కృష్ణా జిల్లా - మధ్యాహ్న భోజన పథకం – జిల్లా నందుగల అందరు మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయునది ఏమనగా, కమీషనరు, పాఠశాల విద్యాశాఖ వారు ఆదేశాలను అనుసరించి మధ్యాహ్న భోజన పథకంలో సరఫరా చేస్తున్న కోడిగుడ్ల బిల్లుల చెల్లింపు విధానాన్ని వికేంద్రీకరణ చేయడం జరిగింది. అదే విధంగా ప్రధానోపాధ్యాయులు కోడిగుడ్డు సరఫరా మరియు వినియోగం నమోదు చేయుటకు వీలుగా ఎం.డి.ఎం యాప్ నందు మార్పులు చేయడమైనది. ఈ అంశాలను సదరు యాప్ ను Update చేసుకొను విదముగా మరియు పాఠశాల స్థాయి వరకు చేరేవిధముగా తగు చర్యలు తీసుకోవలసినదగా తెలియజేయటమైనది. శ్రీమతి యం.వి.రాజ్యలక్ష్మి, డి.ఇ.ఒ., కృష్ణా, మచిలీపట్నం.
No comments:
Post a Comment