Blog Archive

Sunday 31 January 2021

వెయ్యి రూపాయలకె 20 లక్షల బీమా*.


*వెయ్యి రూపాయలకె 20 లక్షల బీమా*.......


*SBI BANK* లో సేవింగ్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ ఉండి మీరు 18 నుండి 65 సంవత్సరాల మద్య వయస్సు కలిగి ఉన్న వారైతే మీకు ఒక గొప్ప *శుభవార్త* .....!


మీరు వెంటనే మీరు ఓపెన్ చేసిన *SBI బ్యాంక్ కు వెళ్లి Rs.1000/- జమ చేసి గ్రూప్ పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్* లో చేరి *Rs.20 లక్షల వ్యక్తి గత ప్రమాద బీమా పొందండి*


అలాగే *PMJJBY* స్కీమ్ లో Rs.330/- చెల్లించి *2 లక్షల* లైఫ్ కావరేజ్ పొందండి ఇది సహజ మరణానికి కూడా వర్తిస్తుంది.


అలాగే మరో *Rs.12/- లు PMSBY* స్కీం లో చేరండి వ్యక్తిగత ప్రమాద బీమా *Rs.2 లక్షలు* కావరేజ్ పొందండి ఈ స్కీం లో శాశ్వత అంగవైకల్యం చెందితే Rs. *1 *లక్ష* రూపాయల కావరేజ్ ఇవ్వబడును.


మొత్తం *Rs.1342/*- చెల్లించి *Rs.24 లక్షల రూపాయల* కవరేజ్ ఒక సంవత్సరకాలం వరకు పొందండి. మీరు తప్పక ఆటో రెన్యూవల్ మోడ్ ను ఎంచుకోండి. మీరు వెంటనే మీకు దగ్గరలో ఉన్న *SBI BANK* ని సంప్రదించండి అధిక వివరాలు తెలుకొని చేరండి అకౌంట్ లేని వారు వెంటనే యెనో అకౌంట్ ఓపెన్ చేయండి.




మీ

శాఖా అదికారి 

భారతీయ స్టేట్ బ్యాంక్

మెడికల్ ఇన్వాలిడేషన్

 మెడికల్ ఇన్వాలిడేషన్  


1.అనారోగ్య కారణంగా పదవీ విరమణ పొందు ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణకు కనీసం 5 సంవత్సరాల సర్వీసు కలిగియుండి, ఉద్యోగి కుటుంబానికి ఎటువంటి జీవనాధారము లేని తీవ్ర,దుర్భర ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినచో నియామకాధికారి సంతృప్తి చెందిన మీదట కొన్ని షరతులకు లోబడి ఉద్యోగి కుటుంబ ఆధారితులకు కారుణ్య నియామకము చేస్తారు.


(G.O.Ms.NO.504,GAD తేది:30-4-1980)


(G.O.Ms.NO.309,GAD తేది:04-07-1985)


(A.P Pension code volume-I,Article-441)


❇తదుపరి ఒక కేసులో రాష్ట్రఉన్నతస్థాయి న్యాయస్థానం అట్టి కారుణ్య నియమకాలు రాజ్యంగ విరుద్దమని తీర్పు వెలువరించిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఇన్వాలిడేషన్ పై కారుణ్య నియామకాల పద్దతిని రద్దుపరచింది.


❇ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుమేరకుప్రభుత్వం మరలా మెడికల్ఇన్వాలిడేషన్ పై  ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పద్దతిని మరలా పునరుద్దరించింది.(G.O.Ms.No.661 GAD తేది:23-10-2008)


ఎవరు అర్హులు:


కుటుంబ సభ్యులు అనగా AP Revised Pension Rules 1980 లోని రూలు 50(12B)లో నిర్దేశించిన వారై ఉండాలి.



❇ భార్య/భర్త, కుమారులు, కూతుళ్ళు , చట్టరిత్యా దత్తత తీసుకున్న కుమారుడు/కూతురు, అట్టి దత్తత రిటైర్మెంటుకు ముందుగా తీసుకునియుండాలి.


❇అవివాహిత కూతురు, విధవరాలైన కూతురు, విడాకులు పొందిన కూతురు.


మెడికల్ ఇన్వాలిడేషన్ నిబంధనలు 


❇మెడికల్ ఇన్వాలిడేషన్  కోరు ఉద్యోగి నియామకాధికారికి దరఖాస్తు చేసుకోవాలి.


❇సదరు దరఖాస్తు మెడికల్ బోర్డు సిఫార్సులనిమిత్తం పంపబడుతుంది.


❇ జూనియర్ అసిస్టెంట్, తత్సమానమైన పోస్టు అంతకంటే తక్కువైన పోస్టులో నియామకం చేయవచ్చు.


(G.O.Ms.No.35 తేది:10-04-2000)


❇మెడికల్ ఇన్వాలిడేషన్ పై ఉద్యోగి రిటైరైన తేదినుంచిఒక సంవత్సరం లోపల ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలి.


❇ నియామక ఉత్తర్వులు జారీచేసిన తర్వాత,అభ్యర్ధికి సంబంధించిన అన్ని వివరములుఎంప్లాయిమెంట్ కార్యాలయానికి తెలియజేయాలి.


❇ మెడికల్ బోర్డు నివేదిక  అందిన తర్వాత ఉద్యోగిని  నియామక అధికారి జిల్లాస్థాయి కమిటీ వారి పరిశీలనార్ధం పంపాలి.


❇ జిలాస్థాయి కమిటీ:


1.జిల్లా కలెక్టర్-అధ్యక్షుడు(CHAIRMAN)


2.జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి-సభ్యుడు


3.సంబంధిత జిల్లా శాఖ అధికారి-సభ్యుడు/కన్వీనర్


❇శాఖధిపతి(Head of the Department)కార్యాలయాలలో పనిచేయు ఉద్యోగులు/సెక్రటేరియేట్ శాఖాలలో


పనిచేయు ఉద్యోగుల విషయంలో రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుంది



❇ మెడికల్ ఇన్వాలిడేషన్


పథకం క్రింద,కారుణ్య నియామకాలు,యూనిట్ నియామకాల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలలో 5 % మించకూడదు.


❇భార్య,భర్తలిరువురు ఉద్యోగులైన సందర్భములో కారుణ్య నియామకానికి అవకాశము లేదు.


❇ మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీము జిల్లాపరిషత్,మున్సిపల్,ఎయిడెడ్ టీచర్లకు వర్తింపచేసారు.   మెడికల్ ఇన్వాలిడేషన్(అనారోగ్య కారణాలపై)వైద్య ధ్రువపత్రము ద్వారా రిటైర్ అయిన వారికి పెన్షన్,కమ్యూటేషన్ అవకాశములేదు.


మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగికి ఇన్వాలిడు పింఛను ఇస్తారు.


❇ ఏ జబ్బుల వల్లమెడికల్ ఇన్వాలిడేషన్ పై  రిటైరు కావచ్చు:


క్రింద తెలిపిన ఏదేని జబ్బులతో రోగపీడితులుగా ఉన్న ఉద్యోగిమెడికల్ఇన్వాలిడేషన్ పై మెడికల్ బోర్డు


నిర్థారణ సర్టిఫికేట్ ఆధారంగా,మెడికల్ ఇన్వాలిడేషన్ పై రిటైరు కావచ్చును.


    1.పక్షవాతము(PARALYSIS):             


A)నాలుగు అవయవములు-కాళ్ళు,చేతులు

B)ఒకవైపు పై భాగము లేదా,క్రింది భాగము

C)క్రింది భాగము రెండు అవయవములు లేదా/అంగములు


2.అంతిమదశలో ఉన్న మూత్రపిండముల రోగము(END STAGE RENAL DISEASE)


3.అంతిమదశలో ఉన్న కాలేయ రోగము(END STAGE LEVER DISEASE)


4.క్యాన్సరు(CANCER WITH METASTASIS STAGE OR SECONDARIES)


5.మానసిక సంబంధితము (DEMENTIA-MENTAL DISORDER)

6.తీవ్రమైన పార్కిన్సన్ జబ్బు(SEVERE PARKINSON DISEASE)


❇ మెడికల్ ఇన్వాలిడేషన్  విషయంలో కమిటీకి పంపవలసిన వివరములు (GOVT MEMO.NO.10054/K2/2009 తేది:05-09-2009)


1.మెడికల్ ఇన్వాలిడేషన్ కోరు ఉద్యోగి పేరు:

2.ఉద్యోగి పనిచేస్తున్న శాఖ-హోదా-జీతపు స్కేలు:

3.ఏదైనా క్రమశిక్షణా చర్యలు అపరిష్క్రుతంగాఉన్నాయా:

4.ఉద్యోగి సర్వీసు క్రమబద్దీకరించబడిందా:

5.సర్వీసు రిజిస్టరు మేరకు పుట్టిన తేది:

6.వాస్తవంగా కాలపరిమితిమేరకు పదవీవిరమణ  చేయు తేది:

7.రోగ వివరములు:

8.అట్టి రోగము ప్రభుత్వ ఉత్త్ర్వులు G.O.Ms.No.661, తేది:23-10-2008 లో తెలిపిన మేరకు కలిగియున్నదా:

9.ఉద్యోగి రోగ చికిత్స నిమిత్తం అతను/ఆమె మెడికల్ సెలవుపై ఉన్నారా,అయితే ఏ తేదినుంచి  అట్టి సెలవుపై అట్టి             రోగ చికిత్స నిమిత్తం ఉన్నారు:

    10.మెడికల్ బోర్డు వారి సిఫార్సులు(ORIGINAL) సిఫార్సు జతపరిచారా:

    11.శాఖాపర విశ్లేషణ-సిఫార్సు  


      

01.02.2021 నుండి ప్రతిపాదిత MDM టైమింగ్స్*

 


*01.02.2021 నుండి ప్రతిపాదిత MDM టైమింగ్స్*



🔷 *ప్రాధమిక పాఠశాలల యందు*


*1,2,3  తరగతులకు మధ్యాహ్న భోజన విరామం 11.45-12.25*


*4,5 తరగతులకు మధ్యాహ్న భోజన విరామం 12.25-01.05*



🔷 *ప్రాథమికోన్నత పాఠశాలలు*


*1-5  తరగతులకు మధ్యాహ్న భోజన విరామం 11.45-12.25*


*6-8 తరగతులకు మధ్యాహ్న భోజన విరామం 12.25-01.05*


*ఉపాధ్యాయులు గమనించగలరు*


#MDM 

#SCERT_AP

Saturday 30 January 2021

ప్రాధమిక,ప్రాధమికోన్నత, ఉన్నతపాఠశాలల కాలనిర్ణయ పట్టిక 2020-21

 ప్రాథమిక పాఠశాల కాలనిర్ణయ పట్టిక 2020-21



ప్రాథమికోన్నత పాఠశాల కాలనిర్ణయ పట్టిక 2020-21



ఉన్నత పాఠశాల కాలనిర్ణయ పట్టిక 2020-21




2020-21FINACIAL YEAR INCOME TAX SOFTWARE

 2020-21FINACIAL YEAR INCOME TAX SOFTWARE

2020-21 ఆర్థిక సంవత్సరం INCOME TAX SOFTWARE K.S.S.PRASAD గారి software PRTU GUNTUR BADI WEBSITE LO అందుబాటులో కాలేదు.

👇👇

CLICK HERE TO DOWNLOAD SOFTWARE

MEDICAL REIMBURSEMENT FOR CORONA TREATMENT

 MEDICAL REIMBURSEMENT FOR CORONA TREATMENT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  కరోనా వైరస్ బారిన పడిన ఉద్యోగులు చికిత్స పొందుటకు మెడికల్ రీయింబర్స్మెంట్ క్రింద మన రాష్ట్రంలో మరియు ఇతర రాష్ట్రాల లో (హైదరాబాద్, బెంగళూరు,చెన్నై) చికిత్స పొందుటకు అవకాశం కలదు.దీనికి  సంబంధించినG.O.R.T.NO.30ను విడుదల చేశారు.

👇👇

CLICK HERE TO DOWNLOAD

SERVICE_MATTERS

 SERVICE_MATTERS

సర్వీస్ మేటర్స్*

👉సందేహాలు -  సమాధానాలు


*🔶️ప్రశ్న:*

ఒక జిల్లాలోని విద్యార్థి మరొక జిల్లాకు బదిలీ అయితే రికార్డు షీటు లేక టి.సి.పై ఎవరి కౌంటర్ సిగ్నేచర్ అవసరం? 


*👉జవాబు:*

ఎవరు కౌంటర్ సిగ్నచర్ అవసరం లేదు. (L.Dis. No.

7310 B1/2/76, Dt. 17-9-76. DSE,Hyd) 


*🔶️ప్రశ్న:*

ఇన్ చార్జి HM ఏయే విధులు నిర్వహించవచ్చు?


*👉జవాబు:*

ఇన్చార్జి HM ఆర్థిక కార్యకలాపాలు, టి.సి.లు జారీ చేయుట చేయరాదు. కేవలం టీచర్స్, విద్యార్థుల హాజరు పట్టీలు, విజిటర్స్ బుక్, CL రిజిస్టర్ నిర్వహణ మాత్రమే చేయాలి 15 రోజులకు మించి HM సెలవు పెడితే FACకు దరఖాస్తు చేసుకొనవచ్చును. FAC HM అన్ని రకాల HM బాధ్యతలు వారితో సమానముగా నిర్వహించవచ్చును


*🔶️ప్రశ్న:*

HM కుర్చీలో ఇన్ చార్జి HM కూర్చొనవచ్చునా? 


*👉జవాబు:*

కూర్చొనరాదు. FAC HM కూర్చొనవచ్చును. FAC HM గ్రీన్ ఇంకుతో సంతకాలు చేయరాదు. పాఠశాల జారీచేసిన ధ్రువపత్రాలపై తప్ప వేటిని ఎటెస్టేషన్ చేయరాదు



*🔶️ప్రశ్న:*

ఉన్నత పాఠశాలల్లో 9:30కు మొదటి బెల్, 9:35కు రెండవ బెల్, 9:35 నుండి 9:45 వరకు అసెంబ్లీ నిర్వహించబడును. 9:45కు మూడవ బెల్ మరియు మొదటి పీరియడ్ ప్రారంభమగును, ఉపాధ్యాయుడు 9:45కు రావచ్చునా?


*👉జవాబు:*

కాదు. ఉపాధ్యాయుడు విధిగా అసెంబ్లీకు హాజరు కావలెను. School Assembly is part and parcel of curriculam. అసెంబ్లీకి రానిచో ఆరోజు హాఫ్ డే సి.ఎల్.గా నోట్ చేయాలి (Rc.No. 529/E2/97, Dt, 16-7-1997)


*🔶️ప్రశ్న:*

నెలలో మూడుసార్లు లేట్ పర్మిషన్ తీసుకోవచ్చునా?


*👉జవాబు:*

ఉపాధ్యాయులకు ఈ సౌకర్యం లేదు.


*🔶️ప్రశ్న:*

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 15 రోజుల సెలవుపై ఆన్డ్యూటీ పై వెళ్ళినప్పుడు ఎవరికి ఇన్చార్జి ఇచ్చి వెళ్ళాలి 


*👉జవాబు:*

తప్పనిసరిగా సీనియర్ ఉపాధ్యాయునికి ఇన్చార్జి ఇచ్చి

వెళ్ళాలి. అతను వద్దంటే తదుపరి సీనియర్ కు ఇవ్వాలి.


*🔶️ప్రశ్న:*

ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి ఉపాధ్యాయుడు కనీసం  ఎన్ని  పిరియడ్లు బోధించాలి?


*👉జవాబు:*

కనీసం 24 లేకపోతే జీతం ఇవ్వరాదు (AER-R 77 )


*🔶️ప్రశ్న*

LFL HMలు గెజిటెడ్ HM గా పదోన్నతి పొందవచ్చునా?


*👉జవాబు:*

డిగ్రీ, బి.ఇడి మరియు శాఖాపరమైన పరీక్షలలో కృతార్థత ఉంటే గెజిటెడ్ HMకు పదోన్నతి పొందవచ్చును. కానీ నిర్ణీత  అర్హతలున్ననూ జూనియర్ లెక్చరరకు అవకాశములేదు.


*🔶️ప్రశ్న:*

ప్రభుత్వ /మండల/జడ్పి   స్కూళ్ళలో పనిచేయు SGT/LPలు 6/12/18 సం॥ల స్కేలు పొందుటకు ఎటువంటి అదనపు అర్హతలు కావాలి?


*👉జవాబు:*

ఎటువంటి అదనపు అర్హతలు అవసరం లేదు, నియామకపు అర్హతలుంటే సరిపోవును


*🔷️ప్రశ్న:*

ఫైవారు 24 సం|ల స్నేలు పొందాలంటే ఏఏ అర్హతలు ఉండాలి?


*👉జవాబు:*

HM పదోన్నతికి కావలసిన డిగ్రీ, బి.ఇడి పండిత శిక్షణలు మరియు సంబంధిత శాఖాపరీక్షలు ఉత్తీర్ణత పొందాలి. 


*🔶️ప్రశ్న:*

నేరుగా నియామకము పొందిన స్కూల్ అసిస్టెంట్ కు 45 సం॥లు వయస్సు దాటితే శాఖాపరమైన వరీక్షల కృతార్ధత నుండి పదోన్నతికి 12/18/24 సం॥ల స్కేలు పొందుటకు మినహాయింపు ఉన్నదా?


*👉జవాబు:*

అవును. .



*🔷️ప్రశ్న*

ఇంటర్/డిగ్రీలో హిందీ 2వ భాషగా కలవారు పదోన్నతికి  ఏయేశాఖాపరమైన పరీక్షలు వ్రాయాలి


 *👉జవాబు:*

 పేపర్ కోడ్ 037, స్పెషల్ తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ కృతార్ధత అవ్వాలి:

*ప్రశ్న* 

సరెండర్ లీవు ఎస్ క్యాష్ మెంటు కోసం ఇంటరీమ్ రిలీఫ్, అదనపు అర్హతలకు మంజూరు చేసే అదనపు ఇంక్రిమెంట్లు వర్తిస్తాయా లేదా?


*జవాబు :*

Memo No. 64861/797/FR.I/71 -1, Dt. 14.07.72 GO.Ms.No.25, F&P, Dt.05.02.96) ప్రకారం సరెండర్ లీవు ఎన్ క్యాష్ మెంటు కోసం అదనపు అర్హతలకు/ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకొన్నందుకు మంజూరు చేసే అదనపు ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి. అయితే Memo No.31948/398/PCI/98-1,Fin, Dt.12.08.98 ŏ0 ఇంటరీమ్ రిలీఫ్, మాత్రం రాదు


*ప్రశ్న:*

జీత నష్టపు సెలవు వాడుకొన్నప్పుడు ఆ కాలానికి అర్ధ వేతన సెలవులు జమ అవుతాయా?


*జవాబు:*

అవును. A.P Leave Rules: Rule 13 (a)లో క్రింది విధంగా ఉన్నది “The half pay leave in respect of the period spent on duty and on leave including extraordinary leave.


*ప్రశ్న:*

PAT ఉత్తీర్ణత లేని ఒక SGT ఉపాధ్యాయుడు 12 సంవత్సరాల స్కేలు తీసుకున్నాడు. 18సంవత్సరాల స్కేలు కోసం అర్హత లేదని అభ్యంతరం పెడుతూ ఉన్నారు


*జవాబు:*

18 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తే ప్రత్యేకంగా స్కేలు అంటూ ఏమీ లేదు. అందుచేత ఆ స్కేలు కోసం ప్రత్యేకంగా ఉత్తీర్ణత పొందాల్సిన అర్హతలు కూడా ఏమీ లేవు.


*ప్రశ్న :*

ఒక SGT ఉపాధ్యాయుడు 2010 లో 8 సంవత్సరాల స్కేలు తీసుకుని తిరిగి 6/12/18/24 స్కీము రావడం తో 2008 నుండి 6 సంవత్సరాల స్కేలుచేసుకొని అరియర్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇది తప్పు అంటున్నారు. సరియేనా?


*జవాబు:*

6//18/24 స్కీము, GO.Ms.No.96 Finance (Pay Com mission - II) Dept తేదీ : 20,05, 2011 ద్వారా 1-2 2010 నుండి అమలైనది. కాబట్టి అంతకుముందు తేదీ నుండి 6 సంవత్సరాల స్కేలు తీసుకోవడం తప్పు, మీరు 1-2-2010లో 8 సంవత్సరాల స్కేలు తీసుకున్నారు కనక అది అలాగే ఉంచి అదనంగా తీసుకొన్న మొత్తము రికవరీ కట్టడం మంచిది. అయితే మీకు 12 సంవత్సరాల స్కేలు యథావిధిగా 12 సంవత్సరాల పూర్తి చెయ్యిగానే వస్తుంది


*ప్రశ్న :*

ఒక ఉపాధ్యాయుడు 30 సం॥ల సర్వీసు పూర్తి చేశారు ఇప్పటివరకు 170 రోజులు కమ్యుటేషన్ సెలవులు వాడుకున్నారు. ఇంకా ఎన్ని రోజులు కమ్యుటెడ్ సెలవు వాడుకోవచ్చు? తదుపరి కూడా సెలవు అవసరమైతే ఏమి చేయాలి.?


*జవాబు :* 

సర్వీస్ మొత్తం 240 రోలు కమ్యుటెడ్ సెలవుగా వాడుకోవచ్చు. అప్పుడు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గింపు చేయబడతాయి తదుపరి కూడా సెలవు అవసరమైతే అర్ధ జీతపు సెలవుగా మాత్రమే ఖాతాలో నిల్వయున్నంత వరకు వాడుకోవచ్చు.

2020-21 విద్యా సంవత్సరానికి 01.02.2021 నుండి I - V తరగతుల ప్రారంభం - సూచనలు జారీ*

 *🌺2020-21 విద్యా సంవత్సరానికి  01.02.2021 నుండి I - V తరగతుల ప్రారంభం -  సూచనలు  జారీ*



 *ప్రాథమిక పాఠశాలలకు ఉదయం 09.00 నుండి 03.45 PM వరకు ప్రతిరోజూ 01.02.2021 నుండి    పూర్తి రోజు పనిచేస్తాయి*


*ఎ) విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావచ్చు  భౌతికంగా తల్లిదండ్రులు / సంరక్షకుల వ్రాతపూర్వక అనుమతితో మాత్రమే.*  


*బి) పిల్లలందరికీ, బోధన మరియు బోధనేతర సిబ్బందికి ముసుగులు ధరించడం తప్పనిసరి.*


  *సి) తరచుగా చేతులు కడుక్కోవడం మరియు మార్గదర్శకాల ప్రకారం COVID 19 ని కలిగి ఉండటానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి*



 *d) ఇంకా, సామాజిక దూరం కట్టుబడి ఉండాలి.  ఈ విషయంలో, ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి:*


*ROLL : 0-20* 

 *ప్రతి రోజు (క్లాస్ I-V)*


*ROLL :21-40*

👇

 *ఒక పాఠశాలలో రెండు తరగతి గదులు ఉంటే ప్రతిరోజూ తరగతులు నడుస్తాయి (క్లాస్ I- V)*


*ROLL : 41-60*

👇

 *ఒక పాఠశాలలో మూడు తరగతి గదులు ఉంటే, తరగతులు ప్రతిరోజూ (క్లాస్ I-V) నడుస్తాయి, లేకపోతే ప్రత్యామ్నాయ రోజు (క్లాస్ I, III,V - వన్ డే &  క్లాస్ II & IV - ప్రత్యామ్నాయ రోజు)*


 *ROLL : 61-80*

👇

*ఒక పాఠశాలలో నాలుగు తరగతి గదులు ఉంటే, ప్రతిరోజూ తరగతులు నడుస్తాయి, లేకపోతే ప్రత్యామ్నాయ రోజు (క్లాస్ I, III, V - వన్ డే & క్లాస్ II & IV - ప్రత్యామ్నాయ రోజు*


 *ROLL :81-100*

👇

 *ఒక పాఠశాలలో ఐదు తరగతి గదులు ఉంటే, ప్రతిరోజూ తరగతులు నడుస్తాయి, లేకపోతే ప్రత్యామ్నాయ రోజు (క్లాస్ I, III, V - వన్ డే & క్లాస్ II & IV ప్రత్యామ్నాయ రోజు*


   *ROLL :100 పైన*

👇

*ప్రత్యామ్నాయ రోజులు (క్లాస్ I,  III, V - వన్ డే & క్లాస్ II & IV - ప్రత్యామ్నాయ రోజు)*



విద్యార్థులు తల్లిదండ్రులు అంగీకారం పత్రం కొరకు

👇👇

PLEASE CLICK HERE TO DOWNLOAD FORM

IMMS APP

 *HEADMASTERS- MUST DO IN MDM APP AND IMMS ON DAILY BASIS*

👇👇👇

PLEASE CLICK THE LINK FOR DOWNLOAD IMMS APP

అందరు ప్రధానోపాధ్యాయులకు మధ్యాహ్న భోజన పధకం నకు సంబందించి తెలియజేయునది ఏమనగా 

  

1. ప్రతిరోజూ *JAGANANNA GORUMUDDA(MDM)* యాప్ లో  హాజరు అయిన విధ్యార్ధులు మరియు భోజనం చేస్తున్న విధ్యార్ధులు వివరాలు విధిగా నమోదు చేయవలెను. దీనిలో నమోదు చేసిన వివరాలు మేరకు మాత్రమే Bills చేయబడతాయి. మీరు ఎంటర్ చేసిన వివరాలు సవరణలు చేయడం కుదరదు కాబట్టి ఎంటర్ చేసేటప్పుడు ఒకమారు చూసుకుని సబ్మిట్ చేయగలరు.


2. అదే విదంగా ప్రతిరోజూ *IMMS యాప్* లో HM services లో హాజరు అయిన విధ్యార్ధులు మరియు భోజనం చేస్తున్న విధ్యార్ధులు వివరాలు విధిగా నమోదు చేయవలెను.


3. ప్రతిరోజూ *IMMS యాప్ లో Jagananna Gorumudda(MDM)* లో *inspection form* లో అడిగిన వివరాలు నింపి ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేయవలెను.


4. ప్రతిరోజూ *IMMS యాప్ లో Sanitation Monitoring System(SMS)* లో *inspection form* లో అడిగిన వివరాలు నింపి ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేయవలెను.


పైన చెప్పబడిన 4 పాయింట్లు అందరు ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది.


 IMMS అనేది ఆదునికంగా రూపొందించబడిన యాప్ ఇది *Chief Minster Dash Board* వరకు అనుసంధానం అయి ఉంది కాబట్టి సబ్మిట్ చేయని ప్రధానోపాధ్యాయుల వివరాలు వారికి స్పస్టంగా కనబడుతుంది గమనించగలరు.


*IMMS APP నిర్వహణ లో ప్రధానోపాధ్యాయులు జాగ్రత వహించవలసిన ఇంకొన్ని వివరాలు.*


IMMS యాప్ inspection లో బాగంగా *4-tire మానిటరింగ్ సిస్టమ్* గా రూపొందించబడినది. అందులో బాగంగా

*1. ప్రధానోపాధ్యాయులు inspection*


*2. PMC కమిటీ inspection*


*3. Welfare/Ward Education Assistant inspection*


*4. Village Organiser inspection*


పైన తెలుపబడిన నలుగురకు ఇదివరకే id లు ఇవ్వబడ్డాయి. ఇందులో మీకు 2,3,4 వారి యొక్క id లు ఇప్పటికే మీ పాఠశాలకు మ్యాప్ చేయబడ్డాయి. వాళ్ళు కూడా మీ పాఠశాలకు వచ్చి మధ్యాహ్న భోజన పధకం అమలును పరిశీలించి *IMMS యాప్* లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. 


కాబట్టి *IMMS యాప్* విషయం లో అందరు ప్రధానోపాధ్యాయులు కూడా తగు శ్రద్ధ వహించి పై విషయాలలో ఎంటువంటి అలసత్వం వహించకుండా *“జగనన్న గోరుముద్ద పధకం”*  విజయవంతం గా ముందుకు సాగేలా చూడగలరని అందరు ప్రధానోపాధ్యాయులకు కొరడమైనది.


     

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...