Blog Archive

Saturday 30 January 2021

SERVICE_MATTERS

 SERVICE_MATTERS

సర్వీస్ మేటర్స్*

👉సందేహాలు -  సమాధానాలు


*🔶️ప్రశ్న:*

ఒక జిల్లాలోని విద్యార్థి మరొక జిల్లాకు బదిలీ అయితే రికార్డు షీటు లేక టి.సి.పై ఎవరి కౌంటర్ సిగ్నేచర్ అవసరం? 


*👉జవాబు:*

ఎవరు కౌంటర్ సిగ్నచర్ అవసరం లేదు. (L.Dis. No.

7310 B1/2/76, Dt. 17-9-76. DSE,Hyd) 


*🔶️ప్రశ్న:*

ఇన్ చార్జి HM ఏయే విధులు నిర్వహించవచ్చు?


*👉జవాబు:*

ఇన్చార్జి HM ఆర్థిక కార్యకలాపాలు, టి.సి.లు జారీ చేయుట చేయరాదు. కేవలం టీచర్స్, విద్యార్థుల హాజరు పట్టీలు, విజిటర్స్ బుక్, CL రిజిస్టర్ నిర్వహణ మాత్రమే చేయాలి 15 రోజులకు మించి HM సెలవు పెడితే FACకు దరఖాస్తు చేసుకొనవచ్చును. FAC HM అన్ని రకాల HM బాధ్యతలు వారితో సమానముగా నిర్వహించవచ్చును


*🔶️ప్రశ్న:*

HM కుర్చీలో ఇన్ చార్జి HM కూర్చొనవచ్చునా? 


*👉జవాబు:*

కూర్చొనరాదు. FAC HM కూర్చొనవచ్చును. FAC HM గ్రీన్ ఇంకుతో సంతకాలు చేయరాదు. పాఠశాల జారీచేసిన ధ్రువపత్రాలపై తప్ప వేటిని ఎటెస్టేషన్ చేయరాదు



*🔶️ప్రశ్న:*

ఉన్నత పాఠశాలల్లో 9:30కు మొదటి బెల్, 9:35కు రెండవ బెల్, 9:35 నుండి 9:45 వరకు అసెంబ్లీ నిర్వహించబడును. 9:45కు మూడవ బెల్ మరియు మొదటి పీరియడ్ ప్రారంభమగును, ఉపాధ్యాయుడు 9:45కు రావచ్చునా?


*👉జవాబు:*

కాదు. ఉపాధ్యాయుడు విధిగా అసెంబ్లీకు హాజరు కావలెను. School Assembly is part and parcel of curriculam. అసెంబ్లీకి రానిచో ఆరోజు హాఫ్ డే సి.ఎల్.గా నోట్ చేయాలి (Rc.No. 529/E2/97, Dt, 16-7-1997)


*🔶️ప్రశ్న:*

నెలలో మూడుసార్లు లేట్ పర్మిషన్ తీసుకోవచ్చునా?


*👉జవాబు:*

ఉపాధ్యాయులకు ఈ సౌకర్యం లేదు.


*🔶️ప్రశ్న:*

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 15 రోజుల సెలవుపై ఆన్డ్యూటీ పై వెళ్ళినప్పుడు ఎవరికి ఇన్చార్జి ఇచ్చి వెళ్ళాలి 


*👉జవాబు:*

తప్పనిసరిగా సీనియర్ ఉపాధ్యాయునికి ఇన్చార్జి ఇచ్చి

వెళ్ళాలి. అతను వద్దంటే తదుపరి సీనియర్ కు ఇవ్వాలి.


*🔶️ప్రశ్న:*

ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి ఉపాధ్యాయుడు కనీసం  ఎన్ని  పిరియడ్లు బోధించాలి?


*👉జవాబు:*

కనీసం 24 లేకపోతే జీతం ఇవ్వరాదు (AER-R 77 )


*🔶️ప్రశ్న*

LFL HMలు గెజిటెడ్ HM గా పదోన్నతి పొందవచ్చునా?


*👉జవాబు:*

డిగ్రీ, బి.ఇడి మరియు శాఖాపరమైన పరీక్షలలో కృతార్థత ఉంటే గెజిటెడ్ HMకు పదోన్నతి పొందవచ్చును. కానీ నిర్ణీత  అర్హతలున్ననూ జూనియర్ లెక్చరరకు అవకాశములేదు.


*🔶️ప్రశ్న:*

ప్రభుత్వ /మండల/జడ్పి   స్కూళ్ళలో పనిచేయు SGT/LPలు 6/12/18 సం॥ల స్కేలు పొందుటకు ఎటువంటి అదనపు అర్హతలు కావాలి?


*👉జవాబు:*

ఎటువంటి అదనపు అర్హతలు అవసరం లేదు, నియామకపు అర్హతలుంటే సరిపోవును


*🔷️ప్రశ్న:*

ఫైవారు 24 సం|ల స్నేలు పొందాలంటే ఏఏ అర్హతలు ఉండాలి?


*👉జవాబు:*

HM పదోన్నతికి కావలసిన డిగ్రీ, బి.ఇడి పండిత శిక్షణలు మరియు సంబంధిత శాఖాపరీక్షలు ఉత్తీర్ణత పొందాలి. 


*🔶️ప్రశ్న:*

నేరుగా నియామకము పొందిన స్కూల్ అసిస్టెంట్ కు 45 సం॥లు వయస్సు దాటితే శాఖాపరమైన వరీక్షల కృతార్ధత నుండి పదోన్నతికి 12/18/24 సం॥ల స్కేలు పొందుటకు మినహాయింపు ఉన్నదా?


*👉జవాబు:*

అవును. .



*🔷️ప్రశ్న*

ఇంటర్/డిగ్రీలో హిందీ 2వ భాషగా కలవారు పదోన్నతికి  ఏయేశాఖాపరమైన పరీక్షలు వ్రాయాలి


 *👉జవాబు:*

 పేపర్ కోడ్ 037, స్పెషల్ తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ కృతార్ధత అవ్వాలి:

*ప్రశ్న* 

సరెండర్ లీవు ఎస్ క్యాష్ మెంటు కోసం ఇంటరీమ్ రిలీఫ్, అదనపు అర్హతలకు మంజూరు చేసే అదనపు ఇంక్రిమెంట్లు వర్తిస్తాయా లేదా?


*జవాబు :*

Memo No. 64861/797/FR.I/71 -1, Dt. 14.07.72 GO.Ms.No.25, F&P, Dt.05.02.96) ప్రకారం సరెండర్ లీవు ఎన్ క్యాష్ మెంటు కోసం అదనపు అర్హతలకు/ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకొన్నందుకు మంజూరు చేసే అదనపు ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి. అయితే Memo No.31948/398/PCI/98-1,Fin, Dt.12.08.98 ŏ0 ఇంటరీమ్ రిలీఫ్, మాత్రం రాదు


*ప్రశ్న:*

జీత నష్టపు సెలవు వాడుకొన్నప్పుడు ఆ కాలానికి అర్ధ వేతన సెలవులు జమ అవుతాయా?


*జవాబు:*

అవును. A.P Leave Rules: Rule 13 (a)లో క్రింది విధంగా ఉన్నది “The half pay leave in respect of the period spent on duty and on leave including extraordinary leave.


*ప్రశ్న:*

PAT ఉత్తీర్ణత లేని ఒక SGT ఉపాధ్యాయుడు 12 సంవత్సరాల స్కేలు తీసుకున్నాడు. 18సంవత్సరాల స్కేలు కోసం అర్హత లేదని అభ్యంతరం పెడుతూ ఉన్నారు


*జవాబు:*

18 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తే ప్రత్యేకంగా స్కేలు అంటూ ఏమీ లేదు. అందుచేత ఆ స్కేలు కోసం ప్రత్యేకంగా ఉత్తీర్ణత పొందాల్సిన అర్హతలు కూడా ఏమీ లేవు.


*ప్రశ్న :*

ఒక SGT ఉపాధ్యాయుడు 2010 లో 8 సంవత్సరాల స్కేలు తీసుకుని తిరిగి 6/12/18/24 స్కీము రావడం తో 2008 నుండి 6 సంవత్సరాల స్కేలుచేసుకొని అరియర్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇది తప్పు అంటున్నారు. సరియేనా?


*జవాబు:*

6//18/24 స్కీము, GO.Ms.No.96 Finance (Pay Com mission - II) Dept తేదీ : 20,05, 2011 ద్వారా 1-2 2010 నుండి అమలైనది. కాబట్టి అంతకుముందు తేదీ నుండి 6 సంవత్సరాల స్కేలు తీసుకోవడం తప్పు, మీరు 1-2-2010లో 8 సంవత్సరాల స్కేలు తీసుకున్నారు కనక అది అలాగే ఉంచి అదనంగా తీసుకొన్న మొత్తము రికవరీ కట్టడం మంచిది. అయితే మీకు 12 సంవత్సరాల స్కేలు యథావిధిగా 12 సంవత్సరాల పూర్తి చెయ్యిగానే వస్తుంది


*ప్రశ్న :*

ఒక ఉపాధ్యాయుడు 30 సం॥ల సర్వీసు పూర్తి చేశారు ఇప్పటివరకు 170 రోజులు కమ్యుటేషన్ సెలవులు వాడుకున్నారు. ఇంకా ఎన్ని రోజులు కమ్యుటెడ్ సెలవు వాడుకోవచ్చు? తదుపరి కూడా సెలవు అవసరమైతే ఏమి చేయాలి.?


*జవాబు :* 

సర్వీస్ మొత్తం 240 రోలు కమ్యుటెడ్ సెలవుగా వాడుకోవచ్చు. అప్పుడు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గింపు చేయబడతాయి తదుపరి కూడా సెలవు అవసరమైతే అర్ధ జీతపు సెలవుగా మాత్రమే ఖాతాలో నిల్వయున్నంత వరకు వాడుకోవచ్చు.

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...