Blog Archive

Friday 31 January 2020

Solar panel electrification for schools and hostels District wise schools list ,instructions , Lr.2, Dt.30/1/2020


Solar panel electrification for schools and hostels

District wise schools list ,instructions , Lr.2, Dt.30/1/2020

👇👇

CLICK HERE TO DOWNLOAD SOLAR PANELS SELECTED SCHOOLS

ENGLISH TRAINING REGISTRATION FORM

ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అందరు ఫిబ్రవరి 3 వతారీకు నుండి జరుగబోతున్న మండల పరిధి LEP ట్రైనింగ్ కు హాజరు కాబోవు టీచర్స్ క్రింది ఫార్మ్ లోని వివరాలు సిద్దం చేసుకొని రావాలి..
👇👇
CLICK HERE TO DOWNLOAD ENGLISH TRAINING REGISTRATION FORM

Wednesday 29 January 2020

వసంత పంచమి విశిష్టత

వసంత పంచమి

వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవి కి పూజ చేయవలెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానములు చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. చైత్ర శుద్ధ పంచమి నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను" అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది
వసంత పంచమి విశిష్టత
సరస్వతీదేవి ని మాఘపంచమినాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీపంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.
మాఘమాసం శిశిరఋతువులో వసంతుని స్వాగతచిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.
అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.
‘‘చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా’’ అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని, సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.
అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.
ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాల అవసరం ఏమీ వుండదు కదా. ఈ తల్లిని తెల్లని పూవులతోను,శ్వేత వస్త్రాలతోను, శ్రీగంథముతోను, అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని, నేతితోకూడిన వంటలను, నారికేళము, అరటిపండ్లను చెరకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు.
‘‘వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’’ ఇలా అనేక నామాలున్నప్పటికీ ‘‘సామాంపాతు సరస్వతీ.... ’’ అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.
సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావ స్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు. వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.

INCOME TAX CALCULATION IN MOBILE

Income tax ని మన mobile లోనే 2 నిమిషాల్లో లెక్కించుకునే విధంగా ఏదైనా ఉంటే బాగుండేది అనుకుంటున్నారా...!

సరిగ్గా ఈ ఆలోచనలతోనే APలో పనిచేసే టీచర్ల కోసం  IT Online Calculator  రూపొందించబడింది

IT ని మీ Mobile లో 2 minutes లో calculate చేసుకోవడానికి కింది లింక్ ఓపెన్ చేసి  open అయిన వెబ్ పేజ్(Form) లో మీ జీతభత్య వివరాలు ఎంటర్ చెయ్యండి
👉 Enter Earnings & Tap Next
👉 Enter Deductions & Tap Next
👉 Enter Tax savings & Tap Submit

ఇలా submit చెయ్యగానే  మీ IT లెక్కను వివరంగా mobile screen పైన  చూసుకోవచ్చు

Calculate IT Here

👇👇
-----------------------------------------
CLICK HERE CALCULATE INCOME TAX
--------------------------------------

PMVVY Scheme: ఎక్కువ వడ్డీ ఇచ్చే ఈ స్కీమ్ మార్చి వరకే...



PMVVY Scheme: ఎక్కువ వడ్డీ ఇచ్చే ఈ స్కీమ్ మార్చి వరకే...

*🔹ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY)... ఇటీవల బాగా ప్రచారంలోకి వచ్చిన పెన్షన్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం 2017లో ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. ఒకసారి పెట్టుబడి పెడితే 10 ఏళ్ల వరకు నెలనెలా పెన్షన్ పొందే అవకాశం ఉండటం ఈ స్కీమ్‌ ప్రత్యేకత. అంతేకాదు... మిగతా పొదుపు పథకాలతో పోలిస్తే ఈ స్కీమ్ ద్వారా వడ్డీ కూడా ఎక్కువగా వస్తుంది. ప్రస్తుతం 8% నుంచి 8.30% వార్షిక వడ్డీ ఇస్తోంది ఈ పథకం. ఇన్ని లాభాలు ఉన్న స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలంటే 2020 మార్చి 31 మార్చి వరకే అవకాశం. ఆ తర్వాత ఈ స్కీమ్ ఆగిపోయే అవకాశం ఉంది. భారత ప్రభుత్వానికి చెందిన బీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC 'ప్రధాన మంత్రి వయ వందన యోజన' స్కీమ్‌ను అందిస్తోంది.*

*🔸వృద్ధులకు ఆర్థికంగా అండ ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకాన్ని ప్రారంభించింది. రూ.1,000, నుంచి రూ.10,000 వరకు పెన్షన్ తీసుకోవాలనుకునేవారు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. మొదట ఎంత ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని బట్టి పెన్షన్ ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా రూ.15,00,000 పెట్టుబడి పెడితే 10 ఏళ్ల వరకు నెలకు రూ.10,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. 10 ఏళ్లు పూర్తయ్యాక మొదట పెట్టుబడి పెట్టిన రూ.15,00,000 తిరిగి వస్తాయి. ఎల్ఐసీ మేనేజ్ చేస్తున్న ఈ స్కీమ్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు. పాలసీ తీసుకోవాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది.*

*🔹ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్‌లో చేరడానికి కనీస వయస్సు 60 ఏళ్లు. అంటే 60 ఏళ్ల వయస్సు దాటినవారు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ట వయస్సు పరిమితి లేదు. పాలసీ గడువు 10 ఏళ్లు మాత్రమే. కనీస పెన్షన్ నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 వస్తాయి. గరిష్ట పెన్షన్ నెలకు రూ.10,000, మూడు నెలలకు రూ.30,000, ఆరు నెలలకు రూ.60,000, ఏడాదికి రూ.1,20,000 వస్తాయి. ఎన్ని నెలలకు ఓసారి పెన్షన్ తీసుకోవాలో ముందే వెల్లడించాల్సి ఉంటుంది. పాలసీ మూడేళ్లు పూర్తైన తర్వాత గరిష్టంగా 75% రుణం తీసుకోవచ్చు. ఏడాదికి వడ్డీ 10% చెల్లించాలి. 10 ఏళ్ల గడువు పూర్తికాకముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98% మాత్రమే వెనక్కి వస్తుంది. ఒకవేళ 10 ఏళ్లు పూర్తికాకముందే పెట్టుబడి పెట్టిన వ్యక్తి చనిపోతే రూ.15,00,000 వారి జీవితభాగస్వామి లేదా పిల్లలు లేదా నామినీకి వస్తాయి.*


అమరవీరుల సంస్మరణ దినోత్సవం


అమరవీరుల సంస్మరణ దినోత్సవం




జనవరి 30 ,1948 
సాయంత్రం 5.17 నిమిషాలు
బిర్లా నివాసంలోని ప్రార్థనా సమావేశ మందిరానికి గాంధీజీ వెళుతుండగా   ఆయనకు నాధూరాం గాడ్సే ఎదురుపడ్డాడు. గాంధీకి నమస్కరించాడు. 

ఇప్పటికే ఆలస్యమైందంటూ గాడ్సేను పక్కకు నెట్టేసే ప్రయత్నం చేయబోయింది గాంధీ అనుచరురాలు 
అభా ఛటోపాధ్యాయ. 
గాంధీజీ హత్య ప్రదేశం లో ని చిహ్నాలు


కానీ ఆమెను పక్కకు నెట్టిన గాడ్సే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో మూడుసార్లు పాయింట్‌బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపాడు. దేశ స్వాతంత్య్రోద్యమానికి నేతృత్వం వహించిన మహానుభావుడు, అహింసా వాది అక్కడికక్కడే కుప్పకూలాడు...

స్వాతంత్ర పోరాట యోధుడైన గాంధీ మరణించిన ఈ రోజును ఆయన వర్ధంతి తో బాటు *అమరవీరుల సంస్మరణ దినోత్సవం* గా  మనం జరుపు కుంటున్నాము.

మానవులుజన్మిస్తుంటారు, మరణిస్తుంటారు. 
కానీ మరణాన్ని జయించిన మహానీయులు కొందరే  ఉంటారు.  సూర్య చంద్రులున్నంత కాలం వారి కీర్తి ప్రతిష్టలు అజరా మరంగా  ఉంటాయి. 

 *అహింస ముందు ఎటువంటి గొప్ప శక్తి అయినా తలవంచక తప్పదు. హింసకు సరైన సమాధానం అహింస మాత్రమే* అని  నొక్కి వక్కాణించి
మనకు తెలిసిన మనుషుల్లో మహాత్మునిగా నీరాజనాలందుకున్న  మహోన్నతుడు గాంధీజీ మాత్రమే.

కత్తులు, కఠారులు,బాంబులు, తుపాకులు ఏ ఆయుధం  ఉ పయోగింపకుండా అహింసనే ఆయుధంగా  సమరాన్ని సాగించి అఖండ విజయ సంపదను భారత మాత దోసిళ్ళలో పోసిన త్యాగశీలి, అమరవీరుడు మన బాపూజీ.
ఆయన జగతిలో  అందరికీ ఆదర్శప్రాయులు.
రాజ్ ఘాట్, న్యూ ఢిల్లీ


*దేశ రక్షణ కోసం తమ సర్వస్వాన్ని ధారపోసి పగలనక ,రాత్రనక అహోరాత్రులు కాపలా కాసి తమ ప్రాణాలను సైతం లెక్క చేయని అమరవీరులు ఎందరో ఉన్నారు.*

వారందరినీ  ఈరోజు స్మరించుకొని నివాళులర్పిస్తాం.ప్రధమ స్వాతంత్ర సంగ్రామ నేతలైన 
 *ఝాన్సీ లక్ష్మీ బాయ్*,
 *రాణీ అబ్బక్కాదేవి* ,
 *తాంతియా తోపే* ,
 *కిట్టూర్ రాణి చిన్నమ్మ*, 
 *బేగమ్ హజరత్ మహల్*,
 *బహదూర్ షా జాఫర్*,
 *మర్రా పాండియార్*, 
 *చిదంబరం పిళ్లై* ,
 *సుబ్రహ్మణ్యభారతి*,
 *అసఫ్ జుల్లాఖాన్*, 
 *వాసుదేవ బలవంత పాండే*,
 *నానాసాహేబ్*,
 *మంగళ పాండే*
ఇంకా  మరుగున పడిన మనకు తెలియని ఎందరో ఉన్నారు  వారందరినీ ప్రప్రథమంగా గుర్తు చేసుకోవాలి.


విప్లవ కారులుగా స్వాతంత్రం కోసం ప్రాణాలనర్పించిన
 *చంద్రశేఖర్ ఆజాద్*,
 *సర్థార్ భగత్ సింగ్*, 
 *అల్లూరి సీతారామరాజు*
 మొదలగు విప్లవ సింహాలను,
 *బాలగంగాధర తిలక *లాలాలజపతిరాయ్*, 
 *బిపిన్ చంద్ర పాల్*,
 *సుభాశ్ చంద్ర బోస్* 
వంటివారి ముందు మోకరిల్లాలి.

*విజయలక్ష్మీపండిట్*,
 *సరోజినిదేవి*,
*దుర్గాబాయ్ దేశ్ ముఖ్*,
 *కమలా నెహ్రూ* 
వంటి ఎందరో మహిళలు,
 *సర్దార్ వల్ల భాయ్ పటేల్*,
 *జవహర్లాల్ నెహ్రూ*, 
 *లాల్ బహదూర్ శాస్త్రి*, 
 *పోట్టి శ్రీరాములు*, 
 *బసవరాజు అప్పారావు*
ఇంకా ఎందరో ఎందరో గొప్ప వారు, వారందరినీ స్మరించుకోవాలి.

స్వాతంత్రం వచ్చిన తరువాత భారత దేశాన్ని రక్షించడంలో ప్రాణాలు కోల్పోయిన ఎందరో సైనికులు  వారందరికీ సైల్యూట్ చేయాలి.


కార్గిల్ యుద్ధంలో ప్రాణాలనర్పించిన
 *పద్మ ఫణి ఆచార్య విక్రమ్*,
 *మనోజ్,సంజయ్* 
వంటి అమరవీరులు సదా చిరస్మరణీయులు.

అమరవీరుల జ్ఞాపకార్థం దేశ రాజధాని ఢిల్లీలో *ఇండియా గేట్* పేరుతో ఒక స్మృతి చిహ్నాన్ని నిర్మించారు. 
ఇండియా గేట్, న్యూ ఢిల్లీ


  ఈ సమయాన గాంధీజీ గూర్చి ఎంత తలచుకున్నా సరిపోదు అయినా బాపూజీ గూర్చి మనం కొంత మననం చేసుకుందాం

1869 అక్టోబర్ 2 న గుజరాత్ లోని పోర్బందర్ లో కరంచంద్ పత్లీబాయ్ లకు బాపు జన్మించారు. 

ఆయన పన్నెండవ యేట కస్తూరిబా తో వివాహమైనది.

 ఇంట్లో ఎంత క్రమ శిక్షణతో పెరిగినప్పటికీ,పాఠశాలలో కొందరు చెడు స్నేహితుల దురలవాట్లు 'మాంసభక్షణ' కు అలవాటుపడ్డాడు..

తరువాత కాలంలోజీవహింస చేయకూడదని తెలుసుకున్న  గాంధీ సాత్విక ఆహారానికి మారిపోయారు.

ఆయన కుటుంబం లో ఏలోటూ లేకపోయినా భారతీయులందరూ హాయిగా జీవించలేకపోతున్నారనే వ్యధ ఎక్కువగా ఉండేది. 

పైగా తన దేశం పాశ్చాత్యుల చేతుల్లో ఇబ్బందుల పాలవు తున్నారని వాపోయేవారు.

భారతీయులను పాశ్చాత్యులు కొల్లగొడుతున్నారని, వారిని వెళ్లొగొడితే తప్ప తనకు మనశ్శాంతి ఉండదని స్నేహితులతో అనేవారు.

తను ఏంసాధించాలన్నా చదువు అవసరం అని గ్రహించి బారిష్టరు చదువుకు విదేశాలకు వెళ్లారు.

అక్కడ ఎటువంటి దురలవాట్లకు బానిస కాకుండా అన్ని పరీక్షలలోను
ఉత్తమ శ్రేణిలో పాస్ అవుతూ ఉత్తమ విద్యార్థిగా పేరు పొందారు. 

చదువు అనంతరం భారత దేశానికి తిరిగి వచ్చి ముంబై హైకోర్టులో కొంతకాలం న్యాయవాది గా పనిచేసి ధనవంతుల వద్ద తీసుకున్న ఫీజుతో పేదలకు సహాయం చేసి వారి కేసులను ఉచితంగా వాదించేవారు.

 ఒకసారి ఒక సంస్థ తరపున న్యాయ వాదిగా దక్షిణాఫ్రికా లోని ప్రిటోరియాకు వెళ్లారు.

దక్షిణాఫ్రికాలోని భారతీయుల దీనాతిదీన పరిస్థితి ని చూసి గాంధీ గారి హృదయం ద్రవించి పోయింది. 
అక్కడ భారతీయులపై అనేక ఆకాంక్షలుండేవి.అక్కడ భారతీయుల చీకటి జీవితంలో వెలుగులా అవతరించారు.
త్యాగం మూర్తీభవించిన భారతీయులు తమ శ్రమనంతా తెల్లదొరలకు ధారపోసి కూడా ఛీత్కారానికి గురవడం ఇక సాగనివ్వకూడదని భారతీయులనందరిని ఒక సంఘంగా స్థాపించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి పిటీషన్లు పంపనారంభించారు.

పిటీషన్లు ఇవ్వడానికి కార్యాల యానికి వెళ్లినపుడు వారిని పోలీసులు లాఠీలతో కొట్టేవారు. భారతీయులువారిపై తిరగబడపోతే వద్దు మీరు 
*పొరపాటున కూడా చెయ్యి ఎత్తకండి.ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి*.ఎంత కఠిన హృదయుడనైనా మీ చర్య మార్చ గలదు. *అహింసే మన ఆయుధం*  అని వారికి నూరిపోసేవారు. ఆ అహింసావాదం ప్రజలందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.

భారత దేశ స్వాతంత్ర సమరంలో కూడా బాపూజీ తన అద్భుత అస్త్రం  *'అహింస'* ద్వారానే తెల్లదొరల కఠిన హృదయాలను కరిగింప జేయగలిగారు.

చివరికి ఒకసారి తనమీద హత్యాప్రయత్నం చేయబోయిన వ్యక్తిని పోలోసులు పట్టుకున్నపుడు
అతనికి ఎటువంటి శిక్ష వేయకుండా వదిలిపెట్టివేయమని కోరిన మహానుభావుడాయన.

తను నమ్మిన బాట అయిన అహింస  తో ప్రజలను మంత్రముగ్ధులని చేసి మహాత్ముడయ్యారు.

1947 స్వాతంత్రం వచ్చిన తరువాత దేశం భారత్, పాకిస్తాన్ లుగా ఏర్పడటం ఆయన హృదయాన్ని కలచివేసింది.  
దేశవిభజనతో పాటు మత కల్లోలాలు కూడా విజృంభించెను.
శాంతినవలంబించి మత సామరస్యము కొరకు పాటుపడమని ప్రజలందరినీ మహాత్మడు హెచ్చరించెను.

సరిగా ఇదే సమయంలో నాథూరామ్ వినాయక్ గాడ్సే అను ఒక  యువకుడు 1948 వ సంవత్సరం జనవరి 30 తేదీన ఢిల్లీ లో బిర్లా భవనమున ప్రార్థన కొరకు వెడుతున్న గాంధీజీని తుపాకీ తో కాల్చి చంపెను.

ఈ దుఖవార్త ప్రపంచమునంతను శోక సముద్రములో పడవేలసింది.

ఆయన అంత్య క్రియలు పవిత్ర యమునా నదీ తీరాన రాజఘాటు వద్ద జరుపబడెను.అందుచేత అది నేడుయాత్రాస్థలమై నది.

అతడు  
*రాజకీయ వేత్త* *గొప్పతత్వవేత్త* 
*రామ భక్తుడు*.
 *దీనజన సంరక్షుడు*.
*హరిజనుల ఉద్దరణ* కొరకు , *మధ్యపాననిషేధం*  కొరకు ఆయన చేసిన సేవ  అప్రతిమాన మైనది.

మహాత్ముడు చూపిన బాట మన దేశ రక్షణకు వజ్రమయమైన కోట.

 మనందరం ఆయన ఆశయాలను అనుసరించడమే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి. ఆయన ఆశయాలు నాడు ,నేడు, ఏనాడు అందరికీ ఆదర్శాలు , ఆచరణీయాలు... అందుకే ఆయన మహాత్ముడై మనందరి మనస్సులలో నిలిచారు....
గాంధీజీకి ....................,
అమరవీరులందరికీ ...
జోహార్ జోహార్ ...

Departmental Tests November 2019 Session Results - Notification No.19/2019

Departmental Tests November 2019 Session Results - Notification No.19/2019

👇👇

CLICK HERE TO DOWNLOAD RESULTS

Monday 27 January 2020

క్రీడా దినోత్సవం నిర్వహించుటకు మార్గదర్శకాలు

క్రీడా దినోత్సవం నిర్వహించుటకు మార్గదర్శకాలు👇👇

CLICK HERE TO DOWNLOAD SPORTS DAY GUIDELINES

SE e- Hazar Updated App 2.1 by APTOnline

SE e- Hazar Updated App by APTOnline Limited


All the teachers Plz uninstall existing SE eHazar app and install updated SE eHazar version 2.1 from Below Link.

👇👇👇

CLICK HERE TO DOWNLOAD E-HAZAR LATEST VERSION APP

పారిశుధ్య నిర్వహణ కోసం 30/1/2020 న పేరెంట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు

పారిశుధ్య నిర్వహణ...

30/1/2020 న పేరెంట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి సీఎం జగన్ గారి పిలుపు మేరకు ప్రతి పిల్లవాని తరుపున 1000/- విరాళం గా అభ్యర్ధ్యన చేయాలి. గదుల శుభ్రత కోసం ఒక ఆయాను నియమించి నెలకు 4000/- జీతం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి. గదుల శుభ్రత కోసం 3 తల్లిదండ్రులతో సబ్ కమిటీ వేయాలి..ఫిబ్రవరి నుంచి పాఠశాల లో ఈ పారిశుధ్య నిర్వహణ జరిగేటట్లు చూడాలి...CSE వారి ఉత్తర్వులు RC.2 ,Dt.26/1/2020

*పూర్తి వివరణ.... సూచనలు...తెలుగులో...*
👇👇
CLICK HERE TO DOWNLOAD INSTRUCTIONS

Sunday 26 January 2020

ఆకాశవాణి యాప్(News on air App)


AIR News+Live




ఆకాశవాణి యాప్(News on air App)
➤ విందాం నేర్చుకుందాం IRI కార్యక్రమాలను ఈ యాప్ ద్వారా లైవ్ లో వినవచ్చు లేదా వినిపించవచ్చు ఎటువంటి రేడియో అవసరం లేదు
➤ఆకాశవాణి కడప, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం , హైదరాబాదు, ఆదిలాబాదు, వరంగల్ లాంటి తెలుగు ప్రాంత ఆకాశవాణి కేంద్రాలతో పాటు మొత్తం దేశంలోని 92 ఆకాశవాణి కేంద్రాలను ఈ యాప్ ద్వారా వినే అవకాశాన్ని ప్రసారభారతి కల్పించింది.
➤విజయవాడ , విశాఖపట్నం కేంద్రాలకు సాధారణ ప్రసారాలకు అదనంగా ఎఫ్.ఎం. కేంద్రాలకు కూడా యాప్ సౌకర్యం కల్పించారు.
➤అమెరికా, సింగపూరు , కువైట్ ఇతర గల్ఫ్ దేశాలకు  వలసవెళ్ళిన వారికి ఈ ఆన్ లైన్ యాప్ ఏంతో సౌకర్యంగా ఉంటుంది.
➤గూగుల్ ప్లే స్టోర్ లో లేదా కింద ఇచ్చిన లింక్ ద్వారా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు .
➤యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ పైభాగంలో,  రేడియో బొమ్మపై క్లిక్ చేయండి. అన్ని స్టేషన్ల ట్యాబ్ లు కనిపిస్తాయి.వాటిలో ఇష్టమైన కేంద్రాలను ఫేవరైట్ కేంద్రాలుగా పైన ఒక క్రమంలో అమర్చుకునే సౌకర్యం కూడా ఉంది.
➤స్థానిక ఎఫ్.ఎం లాగా మొబైల్ కు ఇయర్ ఫోన్ అవసరం ఉండదు.
➤ఈ యాప్ తో మళ్ళీ రేడియో అందరి చేతిలోకి వచ్చినట్లైంది.
➤రేడియో ద్వారా ఆంగ్లం, హిందీ భాషలలో వార్తలను కూడా ప్రత్యెక కేంద్రం ద్వారా వినవచ్చు.
➤దూరదర్శన్ చానళ్ల కార్యక్రమాలను కూడా చూడవచ్చు.
మరెందుకు ఆలస్యం ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

👇👇
CLICK HERE TO DOWNLOAD PRASARA BHARATHI APP

Saturday 25 January 2020

CFMS సైట్ లో మన పాఠశాలలో ఉన్నSCHOOL GRANTS PD ACCOUNT లో ఉన్న అమౌంట్ ని వేరే వాళ్ళకి చెల్లించుట కొరకు పాఠశాల HM గారి యొక్క లాగిన్

CFMS సైట్ లో మన పాఠశాలలో ఉన్న SCAVENGERS కు PAYMENT చెల్లించుట కోసం లేదా SCHOOL GRANTS PD ACCOUNT లో ఉన్న అమౌంట్ ని వేరే వాళ్ళకి చెల్లించుట కొరకు పాఠశాల HM గారి యొక్క లాగిన్ లో ఏ విధంగా THIRD PARTY BENEFICIERY ని CREATE చేయాలో తెలునుకొనే విధానం కొరకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి
👇👇
CLICK HERE WATCH VIDEO 

మీ పాఠశాల యొక్క DDO కోడ్ తెలుసుకోవటాని ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి DDO కోడ్ లొనే అమౌంట్ వేయడం జరిగింది

అన్ని పాఠశాలలకు Enrollment ఆధారంగా SCHOOL GRANTS అమౌంట్ పాఠశాలల PD అకౌంట్ లో వేయడం జరిగింది,BANK అకౌంట్ లో వేయరు, అదే విధంగా COMPLEX గ్రాంట్స్ కూడా PD అకౌంట్ లో వేయడం జరిగింది.CFMS సైట్లో బిల్ చేస్తేనే అవి Withdraw అవుతాయి*


*SCHOOL GRANTS కు సంభందించి CFMS సైట్ లో పాఠశాల వారు BILL ప్రిపేర్ చేసి అమౌంట్ ను Withdraw చేయాలి*


ఈ ప్రోసెస్ మొత్తం ఆయా పాఠశాలల వారే చేసుకోవాల్సి ఉంటుంది,పాఠశాల HM గారు బిల్ చేసిన తర్వాత CFMSలో BIOMETRIC Authentication కూడా వేయాల్సి ఉంటుంది


MRC GRANTS కు సంభందించి బిల్ ను  కొత్తగా వచ్చిన PD ACCOUNTS ద్వారా ఏ విధంగా CFMS లో బిల్ చేయాలి.


PD ACCOUNT కొరకు ప్రతి పాఠశాలకు ఒక DDO కోడ్ CREATE చేయడం జరిగింది,


మీ పాఠశాల యొక్క DDO కోడ్ తెలుసుకోవటాని ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి DDO కోడ్ లొనే అమౌంట్ వేయడం జరిగింది

*మీ పాఠశాల DDO Code తెలుసుకోండి*


1.https://cfms.ap.gov.in లాగిన్ అవ్వాలి

2.లాగిన్ అయిన తర్వాత Citzen Service క్లిక్ చేయాలి

3.DDO Search క్లిక్ చేయాలి

4.జిల్లా ఎంపిక చేయాలి తర్వాత

5.మీ ట్రెజరీ  ని ఎంపిక చేయాలి

6.తరువాత Search Box లో మీ పాఠశాల పేరుని Search చేసుకుంటే మీ పాఠశాల కేటాయించిన DDO Code ఏమిటో తెలుస్తుంది.

*గణతంత్ర వేడుకలు-2020 లో భాగంగా ఈ నెల 26వ తేదీన నిర్వహించబడు "జెంఢా వందన" కార్యక్రమమును *పాఠశాల ప్రధానోపాధ్యాయులు / విద్యాసంస్థ యొక్క అధిపతిచే* *జరిపించవలెనంటూ మెమో విడుదలచేసిన ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్ ప్రకాష్


గణతంత్ర వేడుకలు-2020 లో భాగంగా ఈ నెల 26వ తేదీన నిర్వహించబడు  "జెంఢా వందన"  కార్యక్రమమును  *పాఠశాల ప్రధానోపాధ్యాయులు / విద్యాసంస్థ యొక్క అధిపతిచే* *జరిపించవలెనంటూ మెమో విడుదలచేసిన ఏపి ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్ ప్రకాష్ గారు(FAC)

పాఠశాలల్లో పరిశుభ్రత ప్రతిజ్ఞ మరియు చేతుల శుభ్రత గురించి మార్గదర్శకాలు విడుదల....

 26 జనవరి 2020 న పాఠశాలల్లో పరిశుభ్రత ప్రతిజ్ఞ మరియు చేతుల శుభ్రత గురించి మార్గదర్శకాలు విడుదల....

CLICK HERE TO DOWNLOAD శుభ్రత పరిశుభ్రత

Friday 24 January 2020

🇮🇳 జాతీయ జెండా వందనం - నియమాలు🇮🇳

🇮🇳 జాతీయ జెండా వందనం - నియమాలు🇮🇳
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳  

     _*🇮🇳భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం. భారతీయులు అందరూ గౌరవించే పతాకం. ఆ నిబద్థతను శ్రద్ధాసక్తులతో నిర్వహించటం ప్రత్యేక బాధ్యత. జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకలు, ప్రైవేట్‌ కార్యమ్రాల్లోనూ జాతీయ జండా ఎగురవేయటం జరగుతోంది. జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో పాటించే పద్ధతుల్లో జరిగే పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు సంబంధించిన వార్తలు తరచుగా చూస్తుంటాము. కనుక జండా వందనం సందర్భంలో చేయవలసిన, చేయకూడని విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్‌లోని ముఖ్యమైన నియమాలు యిలా వున్నాయి.*_

_*🇮🇳1) సాధారణ నియమాలు*
_*🇮🇳★ జాతీయ జెండా చేనేత (ఖాదీ, కాటన్‌, సిల్క్‌) గుడ్డతో తయారైంది కావాలి.*_

_*★ 🇮🇳జెండా పొడవు వెడల్పు 3:2 నిష్పత్తిలో వుండాలి.*_

_*🇮🇳🇮🇳6300 x 4200 మి.మీ నుండి 150 x 100 మి.మీ వరకు మొత్తం 9 రకాల సైజ్‌ల జెండాలు పేర్కొనబడివి.*_

_*★ 🇮🇳ప్లాస్టిక్‌ జెండాలు వాడకూడదు.*_

_*★ 🇮🇳పై నుండి క్రిందకి కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమాన కొలతల్లో వుండాలి.*_

_*★ 🇮🇳జెండాలోని తెలుపురంగు మధ్యలో అశోక ధర్మచక్రం (24 ఆకులు) నీలం రంగులో వుండాలి.*_

_*★ 🇮🇳జెండాను ఎగురవేయటం మరియు దించటం అనేది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపే జరగాలి.*_

_*★ 🇮🇳జెండాను నేలమీదగాని, నీటిమీదగానీ పడనీయకూడదు.*_

_*★ 🇮🇳జెండాను ఎగురవేసేటపుడు వడిగా (వేగంగా) ఎగురవేయాలి. దించేటప్పుడు నెమ్మదిగా దించాలి.*_

_*★ 🇮🇳జెండా పైన ఎలాంటి రాతలుగాని, ప్రింటింగ్‌ గాని వుండకూడదు.*_

_*★ 🇮🇳ఇతర జండాలతో కలిపి చేయాల్సివస్తే, జాతీయ జండా మిగిలిన వాటి కంటె కొంచెం ఎత్తుగా వుండాలి. ప్రధర్శనలో అయితే మిగిలిన వాటి కంటె మధ్యలో ఒకడుగు ముందు వుండాలి.*_

_*★ 🇮🇳జండా ఎప్పుడూ నిటారుగానే వుండాలి. క్రిందికి వంచకూడదు.*_

*🇮🇳2) పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో చెయ్యాల్సినవి.*

_*★ 🇮🇳పాఠశాలల మైదానంలో చతురస్రాకారంలో మూడు వైపుల విద్యార్థులను నిలబెట్టాలి. నాలుగోవైపు మధ్యలో హెడ్మాష్టర్‌, స్టూడెంట్స్‌ లీడర్‌, జెండా ఎగురవేసే వ్యక్తి (హెడ్మాష్టర్‌ కాకపోతే) మూడు స్థానాల్లో నిలబడాలి.*_

_*🇮🇳★ విద్యార్థులను తరగతుల వారీగా 10 మందినొక స్క్వాడ్‌గా ఒకరి వెనుక ఒకరిని నిలబెట్టాలి. క్లాస్‌ లీడర్‌ వరుస ముందు నిలబడాలి వరుసల మధ్యన, విద్యార్థుల మధ్యన 30 ఇంచ్‌ల దూరం వుండాలి.*_

_*★ 🇮🇳క్లాస్‌ లీడర్‌లు ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చి స్కూల్‌ లీడర్‌కి సెల్యూట్‌ చేయాలి. స్కూల్‌ లీడర్‌ వెళ్లి హెడ్మాష్టర్‌కి సెల్యూట్‌ చేయాలి. ఆ తర్వాత జండాను ఎగురవేయాలి.*_

_*★ 🇮🇳జెండా ఎగురవేయటానికి ముందు స్కూల్‌ లీడర్‌ విద్యార్థ్థులను అటెన్షన్‌లో వుంచాలి. ఎగురవేసిన వెంటనే అందరితో సెల్యూట్‌ చేయించి కొద్ది సేపు అలా వుంచి ఆర్డర్‌ చెప్పి అటెన్షన్‌లో వుంచాలి.*_

_*★ 🇮🇳అటెన్షన్‌ వుంచి జాతీయ గీతం ఆలపించాలి, ఆతర్వాత ప్రతిజ్ఞ చేయాలి. హెడ్మాష్టర్‌ చెబుతుంటే విద్యార్థులు అనుసరించాలి.*_

_*🇮🇳జాతీయ దినోత్సవాల్లో జెండా వందనం సందర్భంలో చేయాల్సిన ప్రతిజ్ఞ*

_*[Rule No.2.3-VII లో పేర్కొనబడింది.]*_

_*🇮🇳"I Pledge allegiance to the National  Flag and to the Soveriegn Socialist Secular Democratic Republic for which it stands"*_

        *🇮🇳అనుభవాలే ఆచరణకు మార్గాలు🇮🇳:*
     
_*🇮🇳జండావందనం నియమాలు తెలిసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నట్లు తరచుగా వార్తల్లో తెలుస్తున్నాయి. కాగా రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుతోంది*_
      
_*🇮🇳Flag code of India సెక్షన్‌ v రూల్‌ నంబర్‌ 3.30 ప్రకారం రిపబ్లిక్‌ డే, ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా జెండాలో కొన్ని పూలు వుంచి ఎగురవేయవచ్చు.*_

_*★🇮🇳జండా ఎగురవేయటానికి ముందు కొబ్బరికాయలు కొట్టడం, అగర్‌బత్తీలు వెలిగించటం, జాతీయనేతలు, కొన్నిదేవుళ్ళ ఫోటోలు పెట్టటం, బొట్లు పెట్టడం వంటివి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అటాంటివి దేశ రాజధాని ఎర్రకోట వద్ద గాని, రాష్ట్ర రాజధానిలోగాని, జిల్లా కలెక్టరట్‌లోగాని చేయబడవు. ప్రభుత్వ పరంగా పై స్థాయిలో పాటించని పద్ధతులను పాఠశాలల్లోనూ పాటించకూడదు.*_

_*★🇮🇳పాఠశాలల్లో జెండా ఎవరు ఎగురవేయాలనే విషయంలోనూ కొన్ని వివాదాలు జరుగుతుంటాయి. రిపబ్లిక్‌ డే సందర్భంగా కార్యనిర్వాహక బాధ్యులు (రాష్ట్రపతి, గవర్నర్‌, కలెక్టర్‌, ఎండిఓ, హెడ్మాష్టర్‌ మున్నగు) మరియు ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా విధాన నిర్ణాయక సంస్థల బాధ్యులు (ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, మండల పరిషత్‌ ఛైర్మన్‌, గ్రామ సర్పంచ్‌ మున్నగు వారు) వారి కార్యాలయాల్లో ఎగురేస్తుంటారు. పాఠశాలలు, కళాశాలలు విధాన నిర్ణాయక సంస్థలు కావు, కార్యనిర్వహణ సంస్థలే. కనుక పాఠశాలల్లో జనవరి 26న మరియు ఆగస్ట్‌ 15న జాతీయ జండాను హెడ్మాష్టరే ఎగురవేయాలి.*_

_*★ 🇮🇳జాతీయ జెండాని ఎగరేసే పోల్‌ గట్టిగా వుండాలి. జెండాని పైకి లాగేందుకు అనువుగా పైకి వెళ్ళిన వెంటనే జెండా ముడి విడివడే విధంగా వుండాలి. కొన్ని చోట్ల జెండా కర్రపడిపోవటం, పైకి  పైకి వెళ్లిన తర్వాత ముడివిడకపోవటం, మళ్లీ కిందికి లాగటం, కాషాయ రంగు కిందికి వుండటం వంటి తప్పులు జరుగుతుంటాయి.*_

_*★🇮🇳సూర్యాస్తమయం వరకు పాఠశాలలోనే వుండి జెండాని జాగ్రతగా క్రిందికి దించి మడత పెట్టి బీరువాల్లో వుంచటం హెడ్మాష్టర్‌ బాధ్యతగానే చూడాలి. కొన్ని చోట్ల ఏదోటైమ్‌లో జెండా క్రింద పడటం, రాత్రికూడ ఎగురుతుండటం వంటి తప్పిదాల వలన హెడ్మాష్టర్‌లు సస్పెండ్‌ అయిన సందర్భాలు కూడా వున్నాయి. కనుక భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు జండావందన కార్యక్రమం నియమాలను నిబద్ధతతో పాటించాలి*
🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳👏🇮🇳👏

Thursday 23 January 2020

దేశభక్తి గీతాలు గీతాలు స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన దేశభక్తి గీతాలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

దేశభక్తి గీతాలు


స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన దేశభక్తి గీతాలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.👇👇

CLICK HERE TO DOWNLOAD దేశభక్తి గీతాలు

జాతీయ ఓటర్ల దినోత్సవం భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారు

జాతీయ ఓటర్ల దినోత్సవం








భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
ప్రాముఖ్యతకొత్త ఓటర్లను ఎన్నికల జాబితాలో చేరుస్తారు
జరుపుకొనే రోజుజనవరి 25

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ర్యాలీ

ఏర్పాటుసవరించు



ఇది జనవరి 25, 2011 నుండి కమిషన్ ఫౌండేషన్ రోజును గుర్తించడానికి ప్రారంభమైంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన భారత కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదం లభించిందని అప్పటి సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికా సోనీ తెలిపారు. 18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు, ఎన్నికల రికార్డుల్లో పాల్గొనడానికి తక్కువ ఆసక్తిని చూపిస్తున్నారని, వారి నమోదు స్థాయి కొన్ని సందర్భాల్లో 20 నుంచి 25 శాతానికి తగ్గిపోవడంతో సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు, దేశవ్యాప్తంగా 8.5 లక్షల పోలింగ్ స్టేషన్లలో ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు వచ్చే అర్హతగల అన్ని ఓటర్లు గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టాలని భారత ఎన్నికల కమిషను నిర్ణయించింది.
ఇటువంటి అర్హత కలిగిన ఓటర్లు సమయానికి నమోదు చెసి ప్రతి సంవత్సరం జనవరి 25న వారి ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు అందచెయ్యాలని మరియు ఈ చొరవ యువతకి సాధికారత, గర్యం , మరియు వారి భాధ్యతలను నిర్వర్తించటానికి స్ఫూర్తినిస్తుందని ఆమె చెప్పారు.

VOTER HELP LINE APP కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి
👇
CLICK HERE TO DOWNLOAD VOTER HELP LINE APP

జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహించబడుతుంది.

జాతీయ బాలికా దినోత్సవం

జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహించబడుతుంది.[1] సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు.
జాతీయ బాలికా దినోత్సవం
జాతీయ బాలికా దినోత్సవం
బేటి బచావో బేటి పడావో లోగో
జరుపుకొనేవారుభారతదేశం
ప్రారంభం2008
జరుపుకొనే రోజు24 జనవరి
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

ప్రారంభంసవరించు

ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్‘ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవంను ప్రారంభించడం జరిగింది.[2]

కార్యక్రమాలుసవరించు

సమాజంలో బాలికలు ఎదుర్కొన్న సమస్యలు గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి జరుపుకుంటారు. బాలిక శిశువు గురించి అసమానత్వం విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాల్య వివాహంల గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తారు.[3]
సమాజంలో మహిళల హోదాను ప్రోత్సహించటానికి జరుపుకుంటారు. అమ్మాయిలు సాధారణంగా వారి జీవితంలో ఎదుర్కొనే వివిధ రకాల సాంఘిక వివక్ష మరియు దోపిడీని తొలగించడం చాలా అవసరం. సమాజంలో మహిళల అవసరం గురించి అవగాహన పెంచడానికి, వివిధ రాజకీయ మరియు కమ్యూనిటీ నాయకులు సమాన విద్య మరియు ప్రాథమిక స్వేచ్ఛ కోసం అమ్మాయిలు గురించి ప్రజలకు చెప్పడం జరుగుతుంది .

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...