Blog Archive

Wednesday 29 January 2020

PMVVY Scheme: ఎక్కువ వడ్డీ ఇచ్చే ఈ స్కీమ్ మార్చి వరకే...



PMVVY Scheme: ఎక్కువ వడ్డీ ఇచ్చే ఈ స్కీమ్ మార్చి వరకే...

*🔹ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY)... ఇటీవల బాగా ప్రచారంలోకి వచ్చిన పెన్షన్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం 2017లో ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. ఒకసారి పెట్టుబడి పెడితే 10 ఏళ్ల వరకు నెలనెలా పెన్షన్ పొందే అవకాశం ఉండటం ఈ స్కీమ్‌ ప్రత్యేకత. అంతేకాదు... మిగతా పొదుపు పథకాలతో పోలిస్తే ఈ స్కీమ్ ద్వారా వడ్డీ కూడా ఎక్కువగా వస్తుంది. ప్రస్తుతం 8% నుంచి 8.30% వార్షిక వడ్డీ ఇస్తోంది ఈ పథకం. ఇన్ని లాభాలు ఉన్న స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలంటే 2020 మార్చి 31 మార్చి వరకే అవకాశం. ఆ తర్వాత ఈ స్కీమ్ ఆగిపోయే అవకాశం ఉంది. భారత ప్రభుత్వానికి చెందిన బీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC 'ప్రధాన మంత్రి వయ వందన యోజన' స్కీమ్‌ను అందిస్తోంది.*

*🔸వృద్ధులకు ఆర్థికంగా అండ ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకాన్ని ప్రారంభించింది. రూ.1,000, నుంచి రూ.10,000 వరకు పెన్షన్ తీసుకోవాలనుకునేవారు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. మొదట ఎంత ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని బట్టి పెన్షన్ ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా రూ.15,00,000 పెట్టుబడి పెడితే 10 ఏళ్ల వరకు నెలకు రూ.10,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. 10 ఏళ్లు పూర్తయ్యాక మొదట పెట్టుబడి పెట్టిన రూ.15,00,000 తిరిగి వస్తాయి. ఎల్ఐసీ మేనేజ్ చేస్తున్న ఈ స్కీమ్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు. పాలసీ తీసుకోవాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది.*

*🔹ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్‌లో చేరడానికి కనీస వయస్సు 60 ఏళ్లు. అంటే 60 ఏళ్ల వయస్సు దాటినవారు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ట వయస్సు పరిమితి లేదు. పాలసీ గడువు 10 ఏళ్లు మాత్రమే. కనీస పెన్షన్ నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 వస్తాయి. గరిష్ట పెన్షన్ నెలకు రూ.10,000, మూడు నెలలకు రూ.30,000, ఆరు నెలలకు రూ.60,000, ఏడాదికి రూ.1,20,000 వస్తాయి. ఎన్ని నెలలకు ఓసారి పెన్షన్ తీసుకోవాలో ముందే వెల్లడించాల్సి ఉంటుంది. పాలసీ మూడేళ్లు పూర్తైన తర్వాత గరిష్టంగా 75% రుణం తీసుకోవచ్చు. ఏడాదికి వడ్డీ 10% చెల్లించాలి. 10 ఏళ్ల గడువు పూర్తికాకముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98% మాత్రమే వెనక్కి వస్తుంది. ఒకవేళ 10 ఏళ్లు పూర్తికాకముందే పెట్టుబడి పెట్టిన వ్యక్తి చనిపోతే రూ.15,00,000 వారి జీవితభాగస్వామి లేదా పిల్లలు లేదా నామినీకి వస్తాయి.*


No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...