Blog Archive

Sunday 28 March 2021

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD

ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం.

EMPLOYEE ID (7 digit)అవసరం.

Registered mobile number ki OTP VASTUMDI అది ఎంటర్ చేయండి.

👇👇

CLICK HERE TO DOWNLOAD PAY SLIP 

Sunday 7 March 2021

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుతారు.ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామికమహిళాదినోత్సవం గాపిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది. కొన్ని ప్రాంతాలలో ఈ దినానికి రాజకీయ రంగు పోయి, పురుషులు స్త్రీలకు గల ప్రేమను వ్యక్తపరిచే విధంగా అనగా మాతృమూర్తుల దినోత్సవం, వాలెంటీన్స్ దినోత్సవం లాగా మారిపోయింది. ఇంకొన్ని ప్రాంతాలలో ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుతారు. ఈ రోజున కొంతమంది వంకాయ రంగు రిబ్బనులు ధరించి ఆచరిస్తారు.

చరిత్ర

ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. చికాగోలో 1908 మే 3, న్యూయార్క్ లో 1909 ఫిభ్రవరి 28న జరిగాయి. 1910 ఫిభ్రవరి 27 [4][5] రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగస్టు 1910 లో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో జరిగింది. అమెరికా సామ్యవాదులచే ఉత్తేజితులై, జర్మన్ సామ్యవాది లూయీస్ జియట్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా సహ జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్ధించారు.[6][7] 17 దేశాలనుండి వచ్చిన 100 మహిళలు మహిళలకు ఓటుహక్కుతో పాటు సమానహక్కులు సాధించడానికి సరియైన వ్యూహమని అంగీకరించారు[8] తదుపరి సంవత్సరం 1911 మార్చి 19న పదిలక్షలమంది పైగా ఆస్ట్రియాడెన్మార్క్జర్మనీస్విట్జర్లాండ్ దేశాలలో 1911 మార్చి 19 న మహిళా దినోత్సవం ఆచరించారు. ఆస్ట్రో-హంగేరియన్ రాజ్యంలో300 పైగా ప్రదర్శనలు జరిగినవి.[6] వియన్నాలో రింగ్ స్ట్రాసెలో ప్రదర్శన చేశారు.[6] మహిళలు ఓటుహక్కు, ప్రభుత్వ పదవుల హక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతులను ప్రతిఘటించారు..[3] అమెరికాలో ఫిభ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు.[6]

ఆస్ట్రియా లోని ,బిల్డర్స్ లేబరెర్స్ ఫెడరేష మహిళా సభ్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1975 నాడు ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

1913 లో రష్యను మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు. (అప్పటికి రష్యాలో జూలియన్ కాలెండర్ అమలులో ఉంది.)

1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగినా అవేవీ మార్చి 8న జరగలేదు.[5] అయితే 1914 నుండి ఆ రోజుని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆ రోజు ఆదివారం కావడం వలన అలా ప్రకటించివుండవచ్చు కానీ, అప్పటినుండే అన్నీ దేశాల్లోనూ మార్చి 8 నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు.[5][9] 1914 లో జర్మనీ జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. అయితే,1918 గానీ వారికి ఓటు హక్కు రాలేదు.[9][10]

1917 లో ఫిబ్రవరి విప్లవం ఆ నెల చివరి ఆదివారం సెయుంట్ పీటర్స్ బర్గ్ లో మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మొదలయ్యింది. ( గ్రెగేరియన్ కాలెండరు ప్రకారం ఆ తారీఖు మార్చి 8).[3] ఆ రోజు సెయింట్ పీటర్ బర్గ్ మహిళలందరూ మొదటి ప్రపంచ యుద్ధం, రష్యాలోని ఆహార కొరత ముగిసిపోవాలని నినదించారు. దీన్నే 'బ్రెడ్డు, శాంతి' డిమాండుగా వ్యవహరించారు.[5] లియోన్ ట్రోస్కీ ప్రకారం, 'ఆ రోజే ఒక విప్లవానికి పునాదులు పడతాయని ఎవరూ ఊహించలేదు. వస్త్ర పరిశ్రమల్లోని మహిళా శ్రామికులందరూ పై అధికారుల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా విధులు బహిష్కరించి వీధుల్లో పడ్డారు. అవే విప్లవానికి తొలి అడుగులు".[9]

అక్టోబర్ విప్లవం తరువాత సోవియట్ యూనియన్లో ఆ రోజుని అధికారిక సెలవు దినంలా ప్రకటించడానికి బోల్షెవిక్ అలెగ్జాండర్ కొలెన్టైల్ లు, వ్లాదిమిర్ లెనిన్ని ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. కానీ, 1965 వరకూ అది అమల్లోకి రాలేదు. అదే సంవత్సరం సోవియట్ మహిళలు అప్పటి వరకు చూపిన సాధికారత స్మారకార్థం, మార్చి 8న యుయస్సార్ ప్రభుత్వం ఆ దినాన్ని అధికారక సెలవు దినంగా ప్రకటించింది.1917 సోవియట్ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటిచింది. చాలా మటుకు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు. 1922 నుంచి చైనావారు, 1936 నుంచి స్పానిష్ వారు దీనిని అధికారికంగా ప్రకటించుకున్నారు.[11] 1949 అక్టోబర్ 1 లో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడినది. వారి రాష్ట్రీయ మండలి డిసెంబరు 23న, మార్చి ఎనిమిదిని అధికారిక దినంగా ఉత్తర్వులిస్తూ, చైనా మహిళలకి ఆ రోజు సగం సెలవు ప్రకటించింది.[12]

అప్రాచ్య దేశాల్లో, 1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించుకుంది. అప్పడు మార్చి 8ని మహిళా హక్కులు, ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని యునైటైడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది.[13]

1980 దశకంలో రినీ కోట్ అనే చరిత్రకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం గురించి పరిశోధించింది.

భారతదేశంలో మహిళా హక్కుల పోరాటం

భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో అనసూయా సారాభాయ్ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది[14]. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికుల బ్రతుకులు మెరుగయ్యాయి. కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు, మహిళా కార్మికుల గురించి చట్టాలను చేయబడినవి. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల ప్రభావంవలన ప్రైవేటు రంగం బలపడడంతో మహిళా కార్మికుల చట్టాల అమలు కుంటుబడుతున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలలో మహిళలు పాల్గొనడం, నేతృత్వం వహించడం మెరుగుపడవలసివుంది

యు.యెస్.ఎ లో అధికారిక గుర్తింపు

మానవహక్కుల ఉద్యమకారిణి, నటి బేతా పోజ్నియక్ మహిళా దినోత్సవంగా అధికారిక గుర్తింపును, ప్రభుత్వ సెలవుదినాన్ని సాధించేందుకు లాస్ ఏంజిల్స్ నగరానికి మేయరు, కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ సభ్యులతో కలిసి కృషిచేశారు. 1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుర్తించేలా బిల్లును రూపొందించడం ద్వారా సాకారం చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవమునకు ఐక్యరాజ్య సమితి అధికారిక నేపధ్యములు

పాంపియోనా లో 2019 మార్చి8
1975 లో మహిళా దినోత్సవం సందర్భంగా లండన్ లో విడుదలైన పోస్టర్
2019 మార్చి 8 న స్పెయిన్ లో ర్యాలీ
సంవత్సరంయుఎన్ థీమ్[16]
1996గతమును గుర్తించుట, భవిష్యత్తుకు ప్రణాళిక రచించుట
1997మహిళలు, శాంతి టేబుల్
1998మహిళలు, మానవ హక్కులు
1999మహిళలపై హింసలేని ప్రపంచం
2000శాంతి కొరకు మహిళలను సమన్వయపరచుట
2001మహిళలు, శాంతి: మహిళలు పోరాటాలను నిర్వహించుట
2002నేటి ఆప్ఘన్ మహిళ : నిజాలు, అవకాశాలు
2003లింగ సమానత్వం, లింగ సమానత్వం, సహస్రాబ్దపు అభివృధ్ధి లక్ష్యాలు
2004మహిళలు, హెచ్.ఐ.వి / ఎయిడ్స్
2005తరువాత లింగ సమానత; అతి భద్రమైన భవిష్యత్తును నిర్మించుట
2006నిర్ణయాలు తీసుకొనుటలో మహిళలు
2007మహిళలు, బాలికలపై హింసకు శిక్షను తప్పించుకొనలేకుండా చేయుట
2008మహిళలు, అమ్మాయిలు ఇన్వెస్టింగ్
2009మహిళలు, పురుషులు యునైటెడ్ మహిళలు, అమ్మాయిలు హింసకు వ్యతిరేకంగా
2010సమాన హక్కులు, సమాన అవకాశాలు: అన్ని కోసం ప్రోగ్రెస్
2011మహిళలు మంచి పని చేయడానికి మార్గం: సమాన విద్య, శిక్షణ,, సైన్స్ అండ్ టెక్నాలజీ యాక్సెస్
2012గ్రామీణ మహిళా సాధికారత, పేదరికం, ఆకలి నిర్మూలన
2013ఒక వాగ్దానం వాగ్దానమే: మహిళలపై వయోలెన్స్ నిర్మూలన యాక్షన్ కోసం సమయం
2014మహిళల సమానత్వం అన్నింటి కోసం పురోగతి
2015మహిళలను శక్తివంతం చేయడం, మానవత్వాన్ని శక్తివంతం చేయడం: చిత్రించండి.
20162030 నాటికి గ్రహం 50-50: లింగ సమానత్వం కోసం స్టెప్ ఇట్ అప్
2017మారుతున్న పని ప్రపంచంలో మహిళలు: 2030 నాటికి ప్లానెట్ 50-50
2018ప్రస్తుత సమయం: గ్రామీణ, పట్టణ కార్యకర్తలు మహిళల జీవితాలను మారుస్తున్నారు
2019సమానంగా ఆలోచించండి, నేర్పుతో నిర్మించండి, మార్పు కోసం కొత్త కల్పనలు చేయండి.
2020"నేను పురుషానుక్రమముతో సమానత్వం: మహిళల హక్కులను గ్రహించడం"
2021నాయకత్వంలోని మహిళలు:కోవిడ్ - 19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం

2011 అంతర్జాతీయ మహిళా దినోత్సవంసవరించు

2011 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆఫ్ఘన్ మహిళలతో యు.యస్. ఆర్మీ అధికారిణి, లుటినెంట్ కర్నల్ పామ్ మూడీ!

సుమారు వందకు పైగా దేశాలలో ఈ దినోత్సవం జరుపుకున్నారు.2011 మార్చి 8 న ఈ దినోత్సవ వేడుకలు 100 వసంతాలు పూర్తి చేసుకున్నాయి .] యు.యస్.లో అధ్యక్షుడు బరాక్ ఒబామా మార్చి 2011 ని "మహిళల చారిత్రక మాసం"గా ప్రకటించారు. దేశ చరిత్ర నిర్మాణంలో మహిళల పాత్రని గుర్తించాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు.రాజ్య కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఈ సందర్భంగా "100 మహిళల ఇన్షియేటివ్: అంతర్జాతీయ ఎక్స్చేంజెస్ ద్వారా మహిళలు , బాలికల సాధికారత", ఈ దినోత్సవాన్ని పునస్కరించుకుని ప్రారంభించారు.ఇదే సందర్భంలోనే ఐసిఆర్సి ICRC మహిళలపై జరుగుతున్న అత్యాచార, లైంగిక వేధింపులని అరికడుతూ తీసుకుంటున్న నివారణ చర్యలపై ఎటువంటి జాప్యం చేయకూడదని తమ రాజ్యాలకు పిలుపునిచ్చారు.పాకిస్థాన్లో పంజాబ్ ప్రభుత్వం వారు గుజ్రాన్ వాలా లింగ సంస్కరణా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2011 మహిళా దినోత్సవాన్ని గిఫ్ట్ యూనివర్సిటీ గుజ్రాన్ వాలాలో ఘనంగా నిర్వహించారు. శ్రీమతి షాజియా అష్ఫాగ్ మత్తు, జి.ఆర్.ఎ.పి. అధికారి ఈ వేడుకల్ని చక్కగా నిర్వహించారు.

ఆస్ట్రేలియా ఈ సందర్భంగా 20 సెంట్ల నాణేన్ని 100 వసంతాల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసింది.

ఈజిప్ట్ లో మాత్రం ఈ దినం విషాదాన్నే మిగిల్చింది. తాహిర్ స్వ్కేర్ లో హక్కుల కోసం నినదీస్తున్న మహిళల్ని పురుష సమూహాలు చెదరగొట్టాయి. ఇదంతా పోలీసు, మిలిటలీ బలగాల కళ్ళెదుటే జరిగింది. హదీల్-ఆల్-షల్సీ ఎ.పి.కి రిపోర్టు రాస్తూ ఆ సంఘటనని ఇలా వర్ణించారు- " బురఖాలలో జీన్స్ లలో వివిధ దుస్తుల్లో ఉన్న మహిళలు కైరో సెంట్రల్ లోని తాహిర్ స్వ్కేర్ కి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి చేరుకున్నారు. కానీ అధిక సంఖ్యలో పురుష మూకలు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు".

2021 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం 2021 ఐక్యరాజ్య సమితి ఇతివృత్తం "నాయకత్వంలోని మహిళలు: కోవిడ్-19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం" కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా బాలికలు, మహిళలు ఆరోగ్య సంరక్షణ కార్మికులు, సంరక్షకులు, ఆవిష్కర్తలు, సమాజ నిర్వాహకులుగా చూపిన ప్రభావాన్ని ఎత్తిచూపారు.

Thursday 4 February 2021

SSC-2021 SCHEDULE

 SSC-2021 SCHEDULE


*🌺ఏపీ: టెన్త్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల..*🌺


*🌺ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.*


*🌺పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌( ఏడు పేపర్లు) :*


*🌺జూన్‌ 7(సోమవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌*


*🌺జూన్‌ 8( మంగళవారం) : సెకండ్‌ లాంగ్వేజ్‌*


*🌺జూన్‌ 9(బుధవారం) : ఇంగ్లీష్‌*


*🌺జూన్‌ 10(గురువారం) : గణితం*


*🌺జూన్‌ 11 (శుక్రవారం) : ఫిజికల్‌ సైన్స్‌*


*🌺జూన్‌ 12 (శనివారం) : బయోలాజికల్‌ సైన్స్‌*


*🌺జూన్‌ 14( సోమవారం) : సోషల్‌ స్టడీస్‌*


*🌺జూన్‌ 15 ( మంగళవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2*


*🌺ఓఎస్‌ఎస్‌సీ మేయిన్‌ లాంగ్వేజ్‌ (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)*


*🌺జూన్‌ 16 ( బుధవారం ) ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు(థియరీ)*

Wednesday 3 February 2021

పి.ఓలు మరియు ఏ పీ.వోల విధులు-లోకల్ బాడీస్- *2020*

 *పి.ఓలు మరియు ఏ పీ.వోల విధులు-లోకల్ బాడీస్- *2020** 


 *బిఫోర్ పోల్* 

కలెక్షన్ ఆఫ్ మెటీరియల్

1.బ్యాలెట్ బాక్స్

2.బ్యాలెట్ పేపర్స్ (ఎంపిటిసి జడ్పీటీసీ)

3.Marked copy of electoral rolls

4.indelible ink phial

5.paperseal for ballot boxes

6.address tag for ballot box

7.label for ballot box

8.arrow Cross mark stamps

9.distinguished Mark stamp

10.stamp pad

11. Purple ink bottle

12 pusher

13.metal seal

14.voting compartment  boards

14.candidate posters

పోలింగ్ ఏజెంట్ల నియామకం

 *పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు* 

1. ఇంచార్జ్ ఆఫ్ ఓటర్ ఐ డేంటిఫికెషన్ మరియు మార్కడ్ ఏలోక్ట్రోరోల్

2.ఇష్యూ ఆఫ్ బ్యాలెట్  పేపర్ జడ్పీటీసీ

3.ఇష్యూ ఆఫ్ బ్యాలెట్ పేపర్ ఎంపిటిసి

4.మార్కింగ్ ఆఫ్ ఇండెలిబుల్ ఇంక్ అండ్ గివింగ్ క్రాస్ మార్క్ స్టాంప్


 *డ్యూరింగ్ పోల్* 

1.బ్యాలెట్ పేపర్ ల  వెనుకవైపు సంతకాలు మరియు ధిష్టింగ్వషేడ్ మార్క్ సీల్

3.ఓటింగ్ కంపార్టుమెంట్ విడి విడిగా సిద్ధం చేసుకొనుట వాటికి పింక్ కలర్ జెడ్పిటిసి వైట్ కలర్ ఎంపీటీసీ సైన్ బోర్డ్ అతికించుట

2. బ్యాలెట్ బాక్స్  ప్రదర్శన

3.బ్యాలెట్ బాక్స్ ను సిద్ధం చేయుట

ఏ. అడ్రస్ టాగ్ ను బాక్స్ లో వేయుట

బి. పేపర్ సీల్ మీద వెనుకవైవు పీఓ సంతకం, ఏజెంట్ల సంతకం అభ్యర్థి సంతకం ముందువైవు మధ్యలో డిస్టింగుషేడ్ మార్క్ స్టాంప్ వేయుట

సి. పేపర్ సీల్ సీరియల్ నంబర్ ను నోట్ చేసుకుని పేపర్ సీల్ ను అమర్చి అట్టముక్కను ఉంచి బ్యాలెట్ బ్యాక్స్ కు సెమీ సీల్ వేయుట

4.ఓటింగ్ కార్యక్రమం ప్రారంభించుట

5.పీఓ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన విధుల నిర్వహణ

పీఓ ఓటింగ్ సరళిని తన పీఓ డైరీలోరెండు గంటలకు ఒకసారి లో నమోదు చేస్తూ ఓటింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షణ గావించుట

 *టెండెర్డ్ ఓట్* పై అవగాహన

ఎవరైనా ఓటరు ఓటు వేయడానికి వచ్చినపుడు అతని ఓటు అప్పటికే ఎవరైనా వేసిఉంటే అలాంటి ఓటును టెండర్ ఓట్ అంటారు 

అలాంటపుడు అతనిని సరిగా విచారించి ,పరిశీలించి అతను కచ్చితంగా వేయలేదని నిర్ధారించుకొన్న తరువాత 

ఓటరు వివరాలను ఫార్మ్ నంబర్ 24లో నమోదు చేసి దానిలో అతనిసంతకం చేయించుకొని మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ బండల్ లోని చివరి నుండి ఉన్న మొదటిది తీసుకుని దాని వెనుక వైపు కౌంటర్ ఫైల్ మరియు బ్యాలెట్ పేపర్ రెండిటి మీద పీఓ టెండెర్డ్ బ్యాలెట్ పేపర్ అని రాసి అతనికి ఇచ్చి అతను ఓటు వేసిన తరువాత దానిని ఓటింగ్ కంపార్టుమెంట్ లో వేయకుండా పీవో దగ్గరే ఉంచుకొని వేరుగా కవర్ లో ప్యాక్ చేసి ఇవ్వాలి

వివరాలను ఫార్మ్ నంబర్ 25లో నింపాలి

కాన్సిల్ అండ్ స్పాయిల్ బ్యాలెట్ పేపర్ కూడా జాగ్రత్తగా వెనక్కి ఇవ్వాలి ఫార్మ్25 లో నమోదు చేసి 

 *బ్లైండ్ ఓటర్స్*

ఓటరు తను పూర్తిగా ఓటువేయలేని స్థితి లో ఉన్నప్పుడు వారిని 18 ఏళ్ల పైబడి ఉన్న  సహచర ఓటరును తన ఓటును వేయడానికి అనుమతించవచ్చు అలాంటి వారి వివరాలను ఫార్మ్  నంబర్ 23 లో నమోదు చేయాలి

 *ఛాలెంజ్ ఓట్* 

ఓటరు వచ్చి తన గుర్తింపు విషయంలో ఎవరికైనా  అనుమానం తలెత్తినప్పుడు తను లేదు అది నేనె అని ఛాలెంజ్ చేసి ఓటు వేసేటప్పుడు అనేక ప్రశ్నల ద్వారా హెచ్చరించి సాధ్యమైనంతవరకు  వాటికి అవకాశం ఇవ్వకుండా కాదు కూడదు అన్నప్పుడు తనకు ఛాలెంజ్ ఓటుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చినప్పుడు  ఛాలెంజ్ ఫీని ఫార్మ్ నో 21 లో  5రూపాలు కట్టించుకొని నమోదు చేసి ఇవ్వాలి

 *పోలింగ్ ముగింపు*

ఎన్నికల ఓటింగ్ సమయం ముగింపు చేయేముందు వరుసలో ఉన్న చివరి వారికి టోకెన్ ఇచ్చి 1 నుండీ డేసేండింగ్ ఆర్డర్ లో ఓటింగ్ అయిపోయాక పోలింగ్ ఏజెంట్ ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ ను సీల్ వేసి ప్యాక్ చేసి సిద్ధం చేయాలి

 *సీలింగ్ ఆఫ్ ఎలక్షన్ పేపర్స్*

ఇందులో 5  రకాల 5 రంగుల ప్యాకేట్స్ ఉంటాయి

మొదటిది బ్రౌన్ రంగు ఇందులో

1.బ్యాలెట్ పేపర్ అకౌంట్

2.పీవో ప్రకటించబడిన పత్రము

3.పేపర్ సీల్ అకౌంట్

4.పీవో డైరీ 

5.విజిట్ షీట్

ఇవి చాలా ముఖ్యమనవి వీటితో పాటు బ్యాలెట్ బాక్స్  ను కలిపి ఒక కౌంటర్ లో సబ్మిట్ చేయాలి

రెండవ రంగు ప్యాకెట్ గ్రీన్ కలర్ స్టాచుటరీ కవర్స్

ఇందులో

1.మార్కేడ్ కాపీ ఆఫ్ ఏలొ క్ట్రోల్ రోల్(సీల్ చేయబడిన)

2.సంతకం చేసి వాడకుండా ఉంచిన బ్యాలెట్ పేపర్స్ (సీల్ చేయబడిన)

3.సంతకం చేయకుండా మిగిలిపోయిన బ్యాలెట్ పేపర్స్

4.సీల్ చేయబడిన టెండెర్డ్ బ్యాలెట్ పేపర్స్

5.క్యాన్సల్డ్ బ్యాలెట్ పేపర్స్

6. బ్యాలెట్ పేపర్స్ కౌంటర్ ఫైల్స్ 

3వ రంగు ఎల్లో కవర్స్ ఇవి స్టాచుటరీ కవర్స్

ఇందులో

1.1.మార్క్ చేయని ఏలోక్ట్రోరోల్ కాపీలు

2.పోలింగ్ ఏజెంట్ల నియామక లెటర్స్

3.edc సర్టిఫికెట్

4.లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్ ఓట్లు

5.అంధుల ఓట్లు వివరాలు

6.వయస్సు నిర్ధారణ పత్రాలు

7.రసీదు పత్రాలు

8.చిరిగిపోయిన వాడని పేపర్ సీల్

ఇక 4 వది బ్లూ ఇందులో

1.పీవో హాండ్ బుక్

2.ఇండెలిబుల్ ఇంక్

3.ఇంక్ ప్యాడ్స్

4.మెటల్ సీల్

5.ధిష్టింగిషేడ్ మార్క్

6. యారో  క్రాస్ మార్క్ సీల్

ఇంక 5 వది వైట్

ఇందులో2 మిగిలిన అన్ని వేసి కౌంటర్ లో అప్పగించాలి

Wishing you All the very Best for our Elections Duties

With regards

Urs

 

 *మాస్టర్ ట్రైనర్*

Sunday 31 January 2021

వెయ్యి రూపాయలకె 20 లక్షల బీమా*.


*వెయ్యి రూపాయలకె 20 లక్షల బీమా*.......


*SBI BANK* లో సేవింగ్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ ఉండి మీరు 18 నుండి 65 సంవత్సరాల మద్య వయస్సు కలిగి ఉన్న వారైతే మీకు ఒక గొప్ప *శుభవార్త* .....!


మీరు వెంటనే మీరు ఓపెన్ చేసిన *SBI బ్యాంక్ కు వెళ్లి Rs.1000/- జమ చేసి గ్రూప్ పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్* లో చేరి *Rs.20 లక్షల వ్యక్తి గత ప్రమాద బీమా పొందండి*


అలాగే *PMJJBY* స్కీమ్ లో Rs.330/- చెల్లించి *2 లక్షల* లైఫ్ కావరేజ్ పొందండి ఇది సహజ మరణానికి కూడా వర్తిస్తుంది.


అలాగే మరో *Rs.12/- లు PMSBY* స్కీం లో చేరండి వ్యక్తిగత ప్రమాద బీమా *Rs.2 లక్షలు* కావరేజ్ పొందండి ఈ స్కీం లో శాశ్వత అంగవైకల్యం చెందితే Rs. *1 *లక్ష* రూపాయల కావరేజ్ ఇవ్వబడును.


మొత్తం *Rs.1342/*- చెల్లించి *Rs.24 లక్షల రూపాయల* కవరేజ్ ఒక సంవత్సరకాలం వరకు పొందండి. మీరు తప్పక ఆటో రెన్యూవల్ మోడ్ ను ఎంచుకోండి. మీరు వెంటనే మీకు దగ్గరలో ఉన్న *SBI BANK* ని సంప్రదించండి అధిక వివరాలు తెలుకొని చేరండి అకౌంట్ లేని వారు వెంటనే యెనో అకౌంట్ ఓపెన్ చేయండి.




మీ

శాఖా అదికారి 

భారతీయ స్టేట్ బ్యాంక్

మెడికల్ ఇన్వాలిడేషన్

 మెడికల్ ఇన్వాలిడేషన్  


1.అనారోగ్య కారణంగా పదవీ విరమణ పొందు ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణకు కనీసం 5 సంవత్సరాల సర్వీసు కలిగియుండి, ఉద్యోగి కుటుంబానికి ఎటువంటి జీవనాధారము లేని తీవ్ర,దుర్భర ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినచో నియామకాధికారి సంతృప్తి చెందిన మీదట కొన్ని షరతులకు లోబడి ఉద్యోగి కుటుంబ ఆధారితులకు కారుణ్య నియామకము చేస్తారు.


(G.O.Ms.NO.504,GAD తేది:30-4-1980)


(G.O.Ms.NO.309,GAD తేది:04-07-1985)


(A.P Pension code volume-I,Article-441)


❇తదుపరి ఒక కేసులో రాష్ట్రఉన్నతస్థాయి న్యాయస్థానం అట్టి కారుణ్య నియమకాలు రాజ్యంగ విరుద్దమని తీర్పు వెలువరించిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఇన్వాలిడేషన్ పై కారుణ్య నియామకాల పద్దతిని రద్దుపరచింది.


❇ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుమేరకుప్రభుత్వం మరలా మెడికల్ఇన్వాలిడేషన్ పై  ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పద్దతిని మరలా పునరుద్దరించింది.(G.O.Ms.No.661 GAD తేది:23-10-2008)


ఎవరు అర్హులు:


కుటుంబ సభ్యులు అనగా AP Revised Pension Rules 1980 లోని రూలు 50(12B)లో నిర్దేశించిన వారై ఉండాలి.



❇ భార్య/భర్త, కుమారులు, కూతుళ్ళు , చట్టరిత్యా దత్తత తీసుకున్న కుమారుడు/కూతురు, అట్టి దత్తత రిటైర్మెంటుకు ముందుగా తీసుకునియుండాలి.


❇అవివాహిత కూతురు, విధవరాలైన కూతురు, విడాకులు పొందిన కూతురు.


మెడికల్ ఇన్వాలిడేషన్ నిబంధనలు 


❇మెడికల్ ఇన్వాలిడేషన్  కోరు ఉద్యోగి నియామకాధికారికి దరఖాస్తు చేసుకోవాలి.


❇సదరు దరఖాస్తు మెడికల్ బోర్డు సిఫార్సులనిమిత్తం పంపబడుతుంది.


❇ జూనియర్ అసిస్టెంట్, తత్సమానమైన పోస్టు అంతకంటే తక్కువైన పోస్టులో నియామకం చేయవచ్చు.


(G.O.Ms.No.35 తేది:10-04-2000)


❇మెడికల్ ఇన్వాలిడేషన్ పై ఉద్యోగి రిటైరైన తేదినుంచిఒక సంవత్సరం లోపల ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలి.


❇ నియామక ఉత్తర్వులు జారీచేసిన తర్వాత,అభ్యర్ధికి సంబంధించిన అన్ని వివరములుఎంప్లాయిమెంట్ కార్యాలయానికి తెలియజేయాలి.


❇ మెడికల్ బోర్డు నివేదిక  అందిన తర్వాత ఉద్యోగిని  నియామక అధికారి జిల్లాస్థాయి కమిటీ వారి పరిశీలనార్ధం పంపాలి.


❇ జిలాస్థాయి కమిటీ:


1.జిల్లా కలెక్టర్-అధ్యక్షుడు(CHAIRMAN)


2.జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి-సభ్యుడు


3.సంబంధిత జిల్లా శాఖ అధికారి-సభ్యుడు/కన్వీనర్


❇శాఖధిపతి(Head of the Department)కార్యాలయాలలో పనిచేయు ఉద్యోగులు/సెక్రటేరియేట్ శాఖాలలో


పనిచేయు ఉద్యోగుల విషయంలో రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుంది



❇ మెడికల్ ఇన్వాలిడేషన్


పథకం క్రింద,కారుణ్య నియామకాలు,యూనిట్ నియామకాల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలలో 5 % మించకూడదు.


❇భార్య,భర్తలిరువురు ఉద్యోగులైన సందర్భములో కారుణ్య నియామకానికి అవకాశము లేదు.


❇ మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీము జిల్లాపరిషత్,మున్సిపల్,ఎయిడెడ్ టీచర్లకు వర్తింపచేసారు.   మెడికల్ ఇన్వాలిడేషన్(అనారోగ్య కారణాలపై)వైద్య ధ్రువపత్రము ద్వారా రిటైర్ అయిన వారికి పెన్షన్,కమ్యూటేషన్ అవకాశములేదు.


మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగికి ఇన్వాలిడు పింఛను ఇస్తారు.


❇ ఏ జబ్బుల వల్లమెడికల్ ఇన్వాలిడేషన్ పై  రిటైరు కావచ్చు:


క్రింద తెలిపిన ఏదేని జబ్బులతో రోగపీడితులుగా ఉన్న ఉద్యోగిమెడికల్ఇన్వాలిడేషన్ పై మెడికల్ బోర్డు


నిర్థారణ సర్టిఫికేట్ ఆధారంగా,మెడికల్ ఇన్వాలిడేషన్ పై రిటైరు కావచ్చును.


    1.పక్షవాతము(PARALYSIS):             


A)నాలుగు అవయవములు-కాళ్ళు,చేతులు

B)ఒకవైపు పై భాగము లేదా,క్రింది భాగము

C)క్రింది భాగము రెండు అవయవములు లేదా/అంగములు


2.అంతిమదశలో ఉన్న మూత్రపిండముల రోగము(END STAGE RENAL DISEASE)


3.అంతిమదశలో ఉన్న కాలేయ రోగము(END STAGE LEVER DISEASE)


4.క్యాన్సరు(CANCER WITH METASTASIS STAGE OR SECONDARIES)


5.మానసిక సంబంధితము (DEMENTIA-MENTAL DISORDER)

6.తీవ్రమైన పార్కిన్సన్ జబ్బు(SEVERE PARKINSON DISEASE)


❇ మెడికల్ ఇన్వాలిడేషన్  విషయంలో కమిటీకి పంపవలసిన వివరములు (GOVT MEMO.NO.10054/K2/2009 తేది:05-09-2009)


1.మెడికల్ ఇన్వాలిడేషన్ కోరు ఉద్యోగి పేరు:

2.ఉద్యోగి పనిచేస్తున్న శాఖ-హోదా-జీతపు స్కేలు:

3.ఏదైనా క్రమశిక్షణా చర్యలు అపరిష్క్రుతంగాఉన్నాయా:

4.ఉద్యోగి సర్వీసు క్రమబద్దీకరించబడిందా:

5.సర్వీసు రిజిస్టరు మేరకు పుట్టిన తేది:

6.వాస్తవంగా కాలపరిమితిమేరకు పదవీవిరమణ  చేయు తేది:

7.రోగ వివరములు:

8.అట్టి రోగము ప్రభుత్వ ఉత్త్ర్వులు G.O.Ms.No.661, తేది:23-10-2008 లో తెలిపిన మేరకు కలిగియున్నదా:

9.ఉద్యోగి రోగ చికిత్స నిమిత్తం అతను/ఆమె మెడికల్ సెలవుపై ఉన్నారా,అయితే ఏ తేదినుంచి  అట్టి సెలవుపై అట్టి             రోగ చికిత్స నిమిత్తం ఉన్నారు:

    10.మెడికల్ బోర్డు వారి సిఫార్సులు(ORIGINAL) సిఫార్సు జతపరిచారా:

    11.శాఖాపర విశ్లేషణ-సిఫార్సు  


      

01.02.2021 నుండి ప్రతిపాదిత MDM టైమింగ్స్*

 


*01.02.2021 నుండి ప్రతిపాదిత MDM టైమింగ్స్*



🔷 *ప్రాధమిక పాఠశాలల యందు*


*1,2,3  తరగతులకు మధ్యాహ్న భోజన విరామం 11.45-12.25*


*4,5 తరగతులకు మధ్యాహ్న భోజన విరామం 12.25-01.05*



🔷 *ప్రాథమికోన్నత పాఠశాలలు*


*1-5  తరగతులకు మధ్యాహ్న భోజన విరామం 11.45-12.25*


*6-8 తరగతులకు మధ్యాహ్న భోజన విరామం 12.25-01.05*


*ఉపాధ్యాయులు గమనించగలరు*


#MDM 

#SCERT_AP

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...