Blog Archive

Sunday 7 March 2021

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతీ సంవత్సరం మార్చి 8న జరుపుతారు.ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామికమహిళాదినోత్సవం గాపిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది. కొన్ని ప్రాంతాలలో ఈ దినానికి రాజకీయ రంగు పోయి, పురుషులు స్త్రీలకు గల ప్రేమను వ్యక్తపరిచే విధంగా అనగా మాతృమూర్తుల దినోత్సవం, వాలెంటీన్స్ దినోత్సవం లాగా మారిపోయింది. ఇంకొన్ని ప్రాంతాలలో ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుతారు. ఈ రోజున కొంతమంది వంకాయ రంగు రిబ్బనులు ధరించి ఆచరిస్తారు.

చరిత్ర

ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. చికాగోలో 1908 మే 3, న్యూయార్క్ లో 1909 ఫిభ్రవరి 28న జరిగాయి. 1910 ఫిభ్రవరి 27 [4][5] రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగస్టు 1910 లో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో జరిగింది. అమెరికా సామ్యవాదులచే ఉత్తేజితులై, జర్మన్ సామ్యవాది లూయీస్ జియట్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా సహ జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్ధించారు.[6][7] 17 దేశాలనుండి వచ్చిన 100 మహిళలు మహిళలకు ఓటుహక్కుతో పాటు సమానహక్కులు సాధించడానికి సరియైన వ్యూహమని అంగీకరించారు[8] తదుపరి సంవత్సరం 1911 మార్చి 19న పదిలక్షలమంది పైగా ఆస్ట్రియాడెన్మార్క్జర్మనీస్విట్జర్లాండ్ దేశాలలో 1911 మార్చి 19 న మహిళా దినోత్సవం ఆచరించారు. ఆస్ట్రో-హంగేరియన్ రాజ్యంలో300 పైగా ప్రదర్శనలు జరిగినవి.[6] వియన్నాలో రింగ్ స్ట్రాసెలో ప్రదర్శన చేశారు.[6] మహిళలు ఓటుహక్కు, ప్రభుత్వ పదవుల హక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతులను ప్రతిఘటించారు..[3] అమెరికాలో ఫిభ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు.[6]

ఆస్ట్రియా లోని ,బిల్డర్స్ లేబరెర్స్ ఫెడరేష మహిళా సభ్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1975 నాడు ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

1913 లో రష్యను మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు. (అప్పటికి రష్యాలో జూలియన్ కాలెండర్ అమలులో ఉంది.)

1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగినా అవేవీ మార్చి 8న జరగలేదు.[5] అయితే 1914 నుండి ఆ రోజుని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆ రోజు ఆదివారం కావడం వలన అలా ప్రకటించివుండవచ్చు కానీ, అప్పటినుండే అన్నీ దేశాల్లోనూ మార్చి 8 నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు.[5][9] 1914 లో జర్మనీ జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. అయితే,1918 గానీ వారికి ఓటు హక్కు రాలేదు.[9][10]

1917 లో ఫిబ్రవరి విప్లవం ఆ నెల చివరి ఆదివారం సెయుంట్ పీటర్స్ బర్గ్ లో మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మొదలయ్యింది. ( గ్రెగేరియన్ కాలెండరు ప్రకారం ఆ తారీఖు మార్చి 8).[3] ఆ రోజు సెయింట్ పీటర్ బర్గ్ మహిళలందరూ మొదటి ప్రపంచ యుద్ధం, రష్యాలోని ఆహార కొరత ముగిసిపోవాలని నినదించారు. దీన్నే 'బ్రెడ్డు, శాంతి' డిమాండుగా వ్యవహరించారు.[5] లియోన్ ట్రోస్కీ ప్రకారం, 'ఆ రోజే ఒక విప్లవానికి పునాదులు పడతాయని ఎవరూ ఊహించలేదు. వస్త్ర పరిశ్రమల్లోని మహిళా శ్రామికులందరూ పై అధికారుల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా విధులు బహిష్కరించి వీధుల్లో పడ్డారు. అవే విప్లవానికి తొలి అడుగులు".[9]

అక్టోబర్ విప్లవం తరువాత సోవియట్ యూనియన్లో ఆ రోజుని అధికారిక సెలవు దినంలా ప్రకటించడానికి బోల్షెవిక్ అలెగ్జాండర్ కొలెన్టైల్ లు, వ్లాదిమిర్ లెనిన్ని ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. కానీ, 1965 వరకూ అది అమల్లోకి రాలేదు. అదే సంవత్సరం సోవియట్ మహిళలు అప్పటి వరకు చూపిన సాధికారత స్మారకార్థం, మార్చి 8న యుయస్సార్ ప్రభుత్వం ఆ దినాన్ని అధికారక సెలవు దినంగా ప్రకటించింది.1917 సోవియట్ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటిచింది. చాలా మటుకు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు. 1922 నుంచి చైనావారు, 1936 నుంచి స్పానిష్ వారు దీనిని అధికారికంగా ప్రకటించుకున్నారు.[11] 1949 అక్టోబర్ 1 లో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడినది. వారి రాష్ట్రీయ మండలి డిసెంబరు 23న, మార్చి ఎనిమిదిని అధికారిక దినంగా ఉత్తర్వులిస్తూ, చైనా మహిళలకి ఆ రోజు సగం సెలవు ప్రకటించింది.[12]

అప్రాచ్య దేశాల్లో, 1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించుకుంది. అప్పడు మార్చి 8ని మహిళా హక్కులు, ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని యునైటైడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది.[13]

1980 దశకంలో రినీ కోట్ అనే చరిత్రకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం గురించి పరిశోధించింది.

భారతదేశంలో మహిళా హక్కుల పోరాటం

భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో అనసూయా సారాభాయ్ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది[14]. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికుల బ్రతుకులు మెరుగయ్యాయి. కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు, మహిళా కార్మికుల గురించి చట్టాలను చేయబడినవి. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల ప్రభావంవలన ప్రైవేటు రంగం బలపడడంతో మహిళా కార్మికుల చట్టాల అమలు కుంటుబడుతున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలలో మహిళలు పాల్గొనడం, నేతృత్వం వహించడం మెరుగుపడవలసివుంది

యు.యెస్.ఎ లో అధికారిక గుర్తింపు

మానవహక్కుల ఉద్యమకారిణి, నటి బేతా పోజ్నియక్ మహిళా దినోత్సవంగా అధికారిక గుర్తింపును, ప్రభుత్వ సెలవుదినాన్ని సాధించేందుకు లాస్ ఏంజిల్స్ నగరానికి మేయరు, కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ సభ్యులతో కలిసి కృషిచేశారు. 1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుర్తించేలా బిల్లును రూపొందించడం ద్వారా సాకారం చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవమునకు ఐక్యరాజ్య సమితి అధికారిక నేపధ్యములు

పాంపియోనా లో 2019 మార్చి8
1975 లో మహిళా దినోత్సవం సందర్భంగా లండన్ లో విడుదలైన పోస్టర్
2019 మార్చి 8 న స్పెయిన్ లో ర్యాలీ
సంవత్సరంయుఎన్ థీమ్[16]
1996గతమును గుర్తించుట, భవిష్యత్తుకు ప్రణాళిక రచించుట
1997మహిళలు, శాంతి టేబుల్
1998మహిళలు, మానవ హక్కులు
1999మహిళలపై హింసలేని ప్రపంచం
2000శాంతి కొరకు మహిళలను సమన్వయపరచుట
2001మహిళలు, శాంతి: మహిళలు పోరాటాలను నిర్వహించుట
2002నేటి ఆప్ఘన్ మహిళ : నిజాలు, అవకాశాలు
2003లింగ సమానత్వం, లింగ సమానత్వం, సహస్రాబ్దపు అభివృధ్ధి లక్ష్యాలు
2004మహిళలు, హెచ్.ఐ.వి / ఎయిడ్స్
2005తరువాత లింగ సమానత; అతి భద్రమైన భవిష్యత్తును నిర్మించుట
2006నిర్ణయాలు తీసుకొనుటలో మహిళలు
2007మహిళలు, బాలికలపై హింసకు శిక్షను తప్పించుకొనలేకుండా చేయుట
2008మహిళలు, అమ్మాయిలు ఇన్వెస్టింగ్
2009మహిళలు, పురుషులు యునైటెడ్ మహిళలు, అమ్మాయిలు హింసకు వ్యతిరేకంగా
2010సమాన హక్కులు, సమాన అవకాశాలు: అన్ని కోసం ప్రోగ్రెస్
2011మహిళలు మంచి పని చేయడానికి మార్గం: సమాన విద్య, శిక్షణ,, సైన్స్ అండ్ టెక్నాలజీ యాక్సెస్
2012గ్రామీణ మహిళా సాధికారత, పేదరికం, ఆకలి నిర్మూలన
2013ఒక వాగ్దానం వాగ్దానమే: మహిళలపై వయోలెన్స్ నిర్మూలన యాక్షన్ కోసం సమయం
2014మహిళల సమానత్వం అన్నింటి కోసం పురోగతి
2015మహిళలను శక్తివంతం చేయడం, మానవత్వాన్ని శక్తివంతం చేయడం: చిత్రించండి.
20162030 నాటికి గ్రహం 50-50: లింగ సమానత్వం కోసం స్టెప్ ఇట్ అప్
2017మారుతున్న పని ప్రపంచంలో మహిళలు: 2030 నాటికి ప్లానెట్ 50-50
2018ప్రస్తుత సమయం: గ్రామీణ, పట్టణ కార్యకర్తలు మహిళల జీవితాలను మారుస్తున్నారు
2019సమానంగా ఆలోచించండి, నేర్పుతో నిర్మించండి, మార్పు కోసం కొత్త కల్పనలు చేయండి.
2020"నేను పురుషానుక్రమముతో సమానత్వం: మహిళల హక్కులను గ్రహించడం"
2021నాయకత్వంలోని మహిళలు:కోవిడ్ - 19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం

2011 అంతర్జాతీయ మహిళా దినోత్సవంసవరించు

2011 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆఫ్ఘన్ మహిళలతో యు.యస్. ఆర్మీ అధికారిణి, లుటినెంట్ కర్నల్ పామ్ మూడీ!

సుమారు వందకు పైగా దేశాలలో ఈ దినోత్సవం జరుపుకున్నారు.2011 మార్చి 8 న ఈ దినోత్సవ వేడుకలు 100 వసంతాలు పూర్తి చేసుకున్నాయి .] యు.యస్.లో అధ్యక్షుడు బరాక్ ఒబామా మార్చి 2011 ని "మహిళల చారిత్రక మాసం"గా ప్రకటించారు. దేశ చరిత్ర నిర్మాణంలో మహిళల పాత్రని గుర్తించాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు.రాజ్య కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఈ సందర్భంగా "100 మహిళల ఇన్షియేటివ్: అంతర్జాతీయ ఎక్స్చేంజెస్ ద్వారా మహిళలు , బాలికల సాధికారత", ఈ దినోత్సవాన్ని పునస్కరించుకుని ప్రారంభించారు.ఇదే సందర్భంలోనే ఐసిఆర్సి ICRC మహిళలపై జరుగుతున్న అత్యాచార, లైంగిక వేధింపులని అరికడుతూ తీసుకుంటున్న నివారణ చర్యలపై ఎటువంటి జాప్యం చేయకూడదని తమ రాజ్యాలకు పిలుపునిచ్చారు.పాకిస్థాన్లో పంజాబ్ ప్రభుత్వం వారు గుజ్రాన్ వాలా లింగ సంస్కరణా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2011 మహిళా దినోత్సవాన్ని గిఫ్ట్ యూనివర్సిటీ గుజ్రాన్ వాలాలో ఘనంగా నిర్వహించారు. శ్రీమతి షాజియా అష్ఫాగ్ మత్తు, జి.ఆర్.ఎ.పి. అధికారి ఈ వేడుకల్ని చక్కగా నిర్వహించారు.

ఆస్ట్రేలియా ఈ సందర్భంగా 20 సెంట్ల నాణేన్ని 100 వసంతాల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసింది.

ఈజిప్ట్ లో మాత్రం ఈ దినం విషాదాన్నే మిగిల్చింది. తాహిర్ స్వ్కేర్ లో హక్కుల కోసం నినదీస్తున్న మహిళల్ని పురుష సమూహాలు చెదరగొట్టాయి. ఇదంతా పోలీసు, మిలిటలీ బలగాల కళ్ళెదుటే జరిగింది. హదీల్-ఆల్-షల్సీ ఎ.పి.కి రిపోర్టు రాస్తూ ఆ సంఘటనని ఇలా వర్ణించారు- " బురఖాలలో జీన్స్ లలో వివిధ దుస్తుల్లో ఉన్న మహిళలు కైరో సెంట్రల్ లోని తాహిర్ స్వ్కేర్ కి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి చేరుకున్నారు. కానీ అధిక సంఖ్యలో పురుష మూకలు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు".

2021 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం 2021 ఐక్యరాజ్య సమితి ఇతివృత్తం "నాయకత్వంలోని మహిళలు: కోవిడ్-19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం" కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా బాలికలు, మహిళలు ఆరోగ్య సంరక్షణ కార్మికులు, సంరక్షకులు, ఆవిష్కర్తలు, సమాజ నిర్వాహకులుగా చూపిన ప్రభావాన్ని ఎత్తిచూపారు.

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...