Blog Archive

Thursday 26 December 2019

AMMAVODI

_*అమ్మ ఒడి: రూ.15,000 మీకు వస్తాయా?..ఇలా తెలుసుకోండి!*_

➡ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన పథకాల్లో అమ్మ ఒడి ఒకటి. నవరత్నాల్లో భాగంగా ఈ స్కీమ్‌ను ప్రకటించారు మన యంగ్ సీఎం. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కోసం రూ.6,455 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన విషయం తెలిసిందే. అమ్మ ఒడి స్కీమ్‌ అర్హతకు తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండాలి. అలాగే లబ్ధిదారులకు ఆధార్‌ కార్డు తప్పనిసరి. స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలి. ఒకవేళ పిల్లలు మధ్యలో తమ చదువును నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు ఈ పథకానికి అనర్హులు.

➡ఆర్థిక సాయాన్ని తిరిగి అందుకోవాలంటే పాఠశాలకు పిల్లలు తిరిగి హాజరు కావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్‌ రంగ సంస్థల ఉద్యోగులు, పెన్షన్లు అందుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రిటైర్డు ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కాదు. ఇకపోతే అమ్మ ఒడి స్కీమ్ పథకం అర్హతను ఆన్‌లైన్‌లోనే సులభంగా తెలుసుకోవచ్చు. అదేలానో చూద్దాం..

➡ముందుగా అమ్మ ఒడి వెబ్‌సైట్‌కు వెళ్లాలి. http://jaganannaammavodi.ap.gov.in/ పై క్లిక్ చేస్తే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.  హోమ్ పేజ్‌లో హెచ్ఎం లాగిన్, ఆఫీసర్ లాగిన్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వీటి కింద సెర్చ్ చైల్డ్ డీటైల్స్ ఫర్ అమ్మ ఒడి స్కీమ్ అనే కొన్ని పదాలు వస్తూ పోతూ ఉంటాయి.

➡దీనిపై క్లిక్ చేయాలి.  ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో అమ్మ లేదా సంరక్షకుల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్‌మిట్ చేయాలి  ఇప్పుడు మీకు అర్హత ఉందా? లేదా? అనే విషయం తెలుస్తుంది.

http://jaganannaammavodi.ap.gov.in/

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...