Blog Archive

Saturday, 4 January 2020

సందేహాలు --- సమాధానాలు

*🇮🇳PRTU  P.V.Rao🇮🇳*

*⁉సందేహాలు --- సమాధానాలు⁉*

*❓ప్రశ్న*

*UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు?*

*☑జవాబు:*

*FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి.కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతి తో జమ చేయవలసి ఉంటుంది.*

*❓ప్రశ్న*

*SGT గా పనిచేస్తున్న టీచర్ VRO గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్,సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా?*

*☑జవాబు:*

*DEO అనుమతి తో పరీక్ష రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105 తేదీ:2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి సమానమైన స్టేజి లో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసు లో చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.*


*❓ప్రశ్న*

*మహిళా టీచర్ భర్త నిరుద్యోగి.అత్త, మామ కూడా ఈమె పైనే ఆధార పడి జీవిస్తున్నారు.అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు.మెడికల్ రీ ఎంబర్సుమెంట్ వర్తిస్తుందా?*

*☑జవాబు:*

*APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ,నాన్న లకి మాత్రమే వర్తిస్తుంది.*


*❓ప్రశ్న*

*నాకు మొదటి సారి అమ్మాయి. తర్వాత కవల పిల్లలు జన్మించారు. LTC లో ముగ్గురు పిల్లలు ప్రయాణం చేయవచ్చా?*

*☑జవాబు:*

*జీఓ.140 తేదీ:3.4.96 ప్రకారం ఇద్దరు పిల్లలుకి మాత్రమే అవకాశం ఉంది.*


*❓ప్రశ్న*

*అబార్షన్ కి రెండుసార్లు మాత్రమే సెలవు ఉపయోగించుకోవాలి అనుచున్నారు. వాస్తవమా? కాదా?*

*☑జవాబు:*

*జీఓ.254;ఆర్ధిక;తేదీ:10.11.95 ప్రకారం ఇద్దరు కంటే తక్కువ జీవించియున్న బిడ్డలు గలవారు అర్హులు. అంతేకానీ ఎన్నోసారి అనే దానితో నిమిత్తం లేదు.*

*❓ప్రశ్న*

*అడ్మిషన్ రిజిస్టర్ లో ఒక పుట్టిన తేదీ ఉంది. మున్సిపాలిటీ/కార్పొరేషన్ వారు ఇచ్చిన సెర్టిఫికెట్ లో మరొక పుట్టిన తేదీ ఉంది. మున్సిపాలిటీ సెర్టిఫికెట్ ప్రకారం పుట్టిన తేదీ నామినల్ రోల్స్ లో మార్చమని పేరెంట్స్ అడుగుతున్నారు. అలా మార్చవచ్చా?*

*☑జవాబు:*

*SSC రూల్స్ 6 ప్రకారం తనిఖీ అధికారి అనుమతితో మార్పు చేయవచ్చు.*

*❓ప్రశ్న*

*ఒక టీచర్ జూన్ నుంచి డిసెంబరు వరకు ప్రసూతి సెలవులో ఉన్నారు.ఆమె ఇంక్రిమెంట్ అక్టోబర్ నెలలో ఉంది.ఆమెకు ఇంక్రిమెంట్ ఎప్పటి నుంచి ఇవ్వాలి?*

*☑జవాబు:*

*జీఓ.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ఇంక్రిమెంట్ అక్టోబర్ 1 నుండి మంజూరు చేస్తూ, ఆర్ధిక లాభం విధులలో చేరిన తేదీ నుంచి మంజూరు చెయ్యాలి.*

*❓ప్రశ్న*

*ఐటీ కేవలం ఫిబ్రవరి జీతంలోనే మినహాయించాలా?*

*జవాబు:*

*ఐటీ నిబంధనలు ప్రకారం చెల్లించవలసిన ఐటీ ముందే అంచనా వేసి మార్చి నెల జీతం నుండి ప్రారంభించి నెలనెలా మినహాయించాలి. ప్రతి క్వార్టర్ కి రిటర్న్స్ ఐటీ శాఖకు సమర్పించాలి. ఈ భాద్యత DDO లదే.*


*❓ప్రశ్న*

*ఒకరు మిలటరీ లో చేసి రిటైర్మెంట్ అయి, మరల sgt గా చేరి రిటైర్డ్ అయ్యారు. ఇపుడు అతనికి రెండు పెన్షన్లు వస్తాయా?*

*జవాబు:*

*ఏపీ పెన్షన్ రూల్స్ ప్రకారం రెండు పెన్షన్లు పొందవచ్చు.*

*❓ప్రశ్న*

*నేను SA క్యాడర్ లో 12 ఇయర్స్ స్కేల్ పొందాను. ఇటీవల HM గా పదోన్నతి వస్తే వదులుకున్నాను. ప్రస్తుతం నాకు జరిగే నష్టం ఏమిటి?*

*జవాబు:*

*మెమో.3307 ; ఆర్ధిక ; తేదీ:24.2.1993 ప్రకారం 18,24 ఇయర్స్ స్కేల్స్ ఇక ఇవ్వరు.ఇచ్చిన 12 ఇయర్స్ స్కేల్ మాత్రం కొనసాగుతుంది.*
*🍃🍃*




*⁉సందేహం--సమాధానం⁉*


ప్రశ్న:

*జాతీయ పండుగల రోజు జెండా వందనం కి హాజరు కాలేకపోతే చర్యలు తీసుకుంటారా?*

జవాబు:

సివిల్ సర్వీస్ కోడ్ ప్రకారం జెండా వందనం కి హజరు కాకపోతే జాతీయ జెండాను అగౌరవపరచినట్లుగా భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

🌹🌹🌹🌹🌹

ప్రశ్న:

*స్థానికత దేని ఆధారంగా నిర్ణయిస్తారు?*

జవాబు:

జీఓ.674 జీఏడీ: తేదీ:20.10.1975 రాష్టప్రతి ఉత్తర్వుల లోని పేరా 7  ప్రకారం 4 నుంచి 10వ తరగతి వరకు గల 7 ఇయర్స్ కాలంలో ఎక్కువ భాగం ఎక్కడ చదివితే 
ఆ జిల్లానే లోకల్ గా పరిగణింపబడుతుంది.


🌹🌹🌹🌹🌹

ప్రశ్న:

*నేను 1996 డిసెంబరులో sgt గా చేరాను. ఐతే 2001 లో 142 రోజులు, 2005 లో 90 రోజులు అనారోగ్యంతో జీతనష్టం (ఇఓఎల్) సెలవు పెట్టాను. ఇంక్రిమెంట్ ఆగస్టుకి పోస్టుపోన్ అయ్యింది. ఐతే ఇంక్రిమెంట్ను డిసెంబరుకి మార్చుకొనే అవకాశం లేదా?*

జవాబు:

జీఓ.43; తేదీ:5.2.76 ప్రకారం డిసెంబరుకి మార్చుకోవచ్చు.ఐతే సంబంధిత ప్రతిపాదనలు వైద్య ధ్రువపత్రాలతో మరియు SR తో deo ద్వారా DSE కి పంపాలి.180 రోజుల వరకు DSE, అంతకు మించిన కాలానికి విద్యా శాఖ కార్యదర్శి అనుమతితో ఈఓయల్ కాలం ఇంక్రిమెంట్కి సర్వీసు గా పరిగణించబడుతుంది.

🌹🌹🌹🌹

ప్రశ్న:

*సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి బ్రతికేది ఎలా?*

జవాబు:

సస్పెండ్ పీరియడ్ లో సబ్ స్టెన్స్ అలవెన్సు కింద సగం జీతం (హాఫ్ పే,హాఫ్ డీఏ, హాఫ్ హెచ్ఆర్ఏ) ఇస్తారు.

🌹🌹🌹

ప్రశ్న:

*ఒక ఉద్యోగి 9 ఇయర్స్ పాటు ఉద్యోగానికి గైరు హాజరు అయ్యాడు.అతనికి మరల పోస్టింగ్ ఇస్తారా??*

జవాబు:


FR.18 మరియు aplr.1933 లోని రూల్ 5 ప్రకారం ఒక ఉద్యోగి 5 ఇయర్స్ పాటు గైర్హాజరు అయితే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా భావించాలి.తిరిగి చేరాలి అంటే విద్యాశాఖ కార్యదర్శి నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...