Blog Archive

Thursday, 23 January 2020

EARNED LEAVES INFORMATION

*🍎జనాభా లెక్కల డ్యూటీ చేస్తే రెమ్యూనరేషన్ తో పాటు సంపాదిత సెలవులు(ELs) ఇస్తారు. కానీ వేసవిలో పదవ తరగతి  స్పాట్ వాల్యువేషన్ కి రెమ్యునరేషన్ మాత్రమే ఇస్తారు సంపాదిత సెలవులు (ELs) ఇవ్వరు.*

*ఏ ఏ  సందర్భాలల్లో  సంపాదిత సెలవులు (ELs) ప్రిజర్వ్ చెయ్యాలి అనే అంశాలతో సంచాలకులు పాఠశాలవిద్యాశాఖ ఉత్తర్వులు Rc.No.03/plg-1/2020 తేది: 21.1.2020 విడుదల చేశారు.*

*వెకేషన్ పరిధిలోకి వచ్చే పాఠశాలల్లో పనిచేసే బోధన/బోధనేతర సిబ్బందికి సంవత్సరానికి 6 సంపాదిత సెలవులు ( జనవరి 1 న 3,జులై 1 న మరో 3 సంపాదిత సెలవులను G.O.Ms.No.317 తేది: 15.9.1994 ద్వారా లీవ్ అకౌంట్ లో జమచేస్తారు.*

*వేసవిలో 10వ తరగతి పరీక్షా విధులు నిర్వర్తించే ప్రధానోపాధ్యాయులు మరియు ఆ పాఠశాలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్/రికార్డు అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ కు సంపాదిత సెలవులు మంజూరు చేయాలి.*

*ఒకవేళ ఆ పాఠశాలలో  జూనియర్ అసిస్టెంట్/రికార్డు అసిస్టెంట్ పోస్టు మంజూరు లేనట్లయితే సీనియర్ టీచర్ కు సంపాదిత సెలవులు మంజూరుచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ELs ప్రిజర్వేషన్ ముగ్గురికి మించకూడదు.*

*ఫండమెంటల్ రూల్ 82 లోని సబ్ రూల్ 15 ప్రకారం వేసవిలో విధులు నిర్వహించి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లయితే సదరు టీచింగ్/నాన్ టీచింగ్ స్టాఫ్ కు ELs మంజూరు చేయబడవు. అయితే  ఎన్నికల విధులు,జనాభా గణన,ఓటరు జాబితాల తయారీ/రివిజన్ విధులు నిర్వహించి రెమ్యూనరేషన్ పొందినను G.O.Ms.No.35 Edn తేది: 16.1.1981 మరియు G.O.Ms.No.355 GAD తేది: 19.5.1995 ప్రకారం రెమ్యునరేషన్ గా పరిగణనలోకి తీసుకోకుండా సంపాదిత సెలవులు మంజూరు చేస్తారు.*

*వేసవిలో 10వ తరగతి మూల్యాంకన (Spot) విధులు,ఇతరత్రా పరీక్ష విధులు నిర్వర్తించి TA&DA, రెమ్యునరేషన్ పొందిన సందర్భంలో సంపాదిత సెలవులు(ELs)మంజూరు చేయబడవు.*

*వేసవిలో పనిచేసిన కాలానికి G.O.Ms.No.114 Fin తేది:28.4.2005 ప్రకారం దామాషా పద్దతిలో (Prapoetinate) సంపాదిత సెలవులు మంజూరు చేస్తారు. 6 రోజుల సంపాదిత సెలవులు కలుపుకుని ELs 30 రోజులకు మించకూడదు.*

👇👇
CLICK HERE TO DOWNLOAD E.L.CALICULATION SHEET

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...