Blog Archive

Thursday 5 March 2020

24 year scale గురించి వివరాలు


24 year scale గురించి తెలుసుకోండి
ముఖ్యంగా SGT మిత్రులు దీనిపై సరైన అవగాహన లేకపోవడం వలన ఆర్థికంగా నష్టపోతున్నారు
*24 year స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ...*
ప్రమోషన్ ద్వారా రావలసిన రెండు ఇంక్రిమెంట్లు రావు. ఒక్క ఇంక్రిమెంటు మాత్రమే వస్తుంది
మరియు తదుపరి కొత్త కేడర్ లో AAS అంటే 6-12-18 స్కేళ్ళు రావు
ఎవరైనా మన SGT మిత్రులు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి
మరో ముఖ్య విషయం
మనం 24 సంవత్సరాలు service పూర్తి చేసుకుని, డిపార్ట్మెంటల్ పరిక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా మనకు 24 year scale తీసుకోవాలని నిర్బంధం ఏమీ లేదు
మనం DDO కు 24 స్కేలు కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు. అది రెగ్యులర్ ఇంక్రిమెంటులాంటిది కాదు
ఒక ఉదాహరణ చూద్దాం
A అనే వ్యక్తి 25 సంవత్సరాలు sgt గా పనిచేసి తధుపరి పదోన్నతి తీసుకున్నాడు అనుకుందాం
A తన సర్వీసులో 24 స్కేలు తీసుకుంటే అప్పుడు ఒక్క ఇంక్రిమెంటు వచ్చింది. పదోన్నతి వచ్ఛినపుడు మరొక ఇంక్రిమెంటు వచ్చింది. 
మొత్తం రెండు ఇంక్రిమెంట్లు వచ్చాయి
A కు ఇంకా 12 సంవత్సరాల సర్వీసు ఉంది. అతడు 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు పొందవలసిన రెండు ఇంక్రిమెంట్లు నష్టపోయాడు
B అనే టీచరు కూడా A తో పాటు సర్వీసు లోకి వచ్చి అతడి లాగే 25 సంవత్సరాల తరువాత పదోన్నతి పొందాడు అనుకుందాం
B మాత్రం 24 సంవత్సరాల స్కేలు వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదు. అతడు పదోన్నతి వచ్చినపుడు 2 ఇంక్రిమెంట్లు పొందాడు. 6 , 12 సంవత్సరాలకు AAS కింద మరో రెండు ఇంక్రిమెంట్లు పొందాడు
మొత్తం 4 ఇంక్రిమెంట్లు B పొందాడు
కావున మిత్రులు సర్వీసు ఎక్కువ ఉన్నవారు సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...