Blog Archive

Saturday 28 December 2019

LIC SCHOLARSHIPS

LIC Scholarship: ఎల్ఐసీ నుంచి స్కాలర్‌షిప్... విద్యార్థులు దరఖాస్తు చేయండి ఇలా
టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రతిభ ఉన్నా ఉన్నత చదువులు చదవలేకపోతే స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. భారత ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక బీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC గురించి అందరికీ తెలిసిందే. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ అయిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్-LIC HFL పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. 'ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ స్కాలర్‌షిప్' పేరుతో 8వ తరగతి నుంచి పీజీ చదివే విద్యార్థుల వరకు అందరికీ రూ.30,000 వరకు స్కాలర్‌షిప్స్‌ అందిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2019 డిసెంబర్ 31 చివరి తేదీ.
8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు అంతకుముందు తరగతిలో 65% మార్కులతో పాస్ కావాలి. వార్షికంగా రూ.10,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్నిక్ విద్యార్థులు 10వ తరగతి 65% మార్కులతో పాస్ కావాలి. వార్షికంగా రూ.15,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.
డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేషన్‌లో చేరిన విద్యార్థులు 12వ తరగతిలో 65% మార్కులతో పాస్ కావాలి.వార్షికంగా రూ.20,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.
పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ ప్రోగ్రామ్‌లో చేరిన విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్ 65% మార్కులతో పాస్ కావాలి.వార్షికంగా రూ.30,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.
గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చదువుతున్నవారు మాత్రమే స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయాలి.స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసే విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3,00,000 లోపు ఉండాలి.

ముందుగా ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలోనే విద్యాదాన్ స్కాలర్‌షిప్‌ పేజీ కనిపిస్తుంది క్లిక్ చేయాలి. Buddy4Study పేరుతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. లేదా
అందులో ఆయా తరగతులకు వేర్వేరుగా దరఖాస్తు లింక్స్ కనిపిస్తాయి.
మీరు చదువుతున్న తరగతిని బట్టి దరఖాస్తు లింక్ క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీ వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేసి స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయాలి.
ఫోటో ఐడీప్రూఫ్, అడ్మిషన్ ప్రూఫ్, విద్యా సంవత్సరం ఫీజు వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఆర్థిక అవసరాలు, మెరిట్‌ను బట్టి స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.
తల్లి లేదా తండ్రి లేనివారికి, అనాథలకు, తల్లిదండ్రుల పరిస్థితి బాగాలేనివారికి, ఉపాధిలేని కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది.
విద్యార్థులు టెలిఫోన్ ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత అవసరమైతే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ తర్వాత విద్యార్థులను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...