Blog Archive

Monday, 3 February 2020

యాప్‌తో జనగణనజనాభా లెక్కల సేకరణలో ఆన్‌లైన్‌కు ప్రాధాన్యం తెలుగు రాష్ట్రాల నుంచి 1,71,484 మంది ఉపాధ్యాయుల భాగస్వామ్యం

యాప్‌తో జనగణన!

ఒకసారి నమోదు చేశాక.. గణకుల వద్దా సమాచారం ఉండదు
ప్రజల వివరాలు రహస్యంగా ఉంచేందుకు ఏర్పాట్లు
జనాభా లెక్కల సేకరణలో ఆన్‌లైన్‌కు ప్రాధాన్యం
తెలుగు రాష్ట్రాల నుంచి 1,71,484 మంది ఉపాధ్యాయుల భాగస్వామ్యం

 జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌)లో నమోదు చేసే వివరాలు బయటికి పొక్కుతాయనే ఆందోళనల నేపథ్యంలో ఈ ప్రక్రియలో కేంద్రం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. గణకుల వద్ద సైతం ప్రజల వ్యక్తిగత వివరాలు ఎక్కువ కాలం ఉండకుండా ఐటీ పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించింది. దేశంలో ప్రతి పదేళ్లకోసారి జనగణన జరుగుతుంది. తొలిసారిగా ఆన్‌లైన్‌లో వివరాల నమోదుకు కేంద్రం ప్రాధాన్యమిస్తోంది. ప్రజలు వ్యక్తిగతంగా సైతం వివరాలు నమోదు చేసేందుకు అవకాశమివ్వాలన్న ప్రతిపాదనను చురుగ్గా పరిశీలిస్తోంది.

సాధారణంగా ఎన్‌పీఆర్‌ దరఖాస్తును ప్రజల ఇళ్లకు తీసుకెళ్లి వివరాలు నింపుతారు. ఈ సారి గణకులు ప్రత్యేక యాప్‌లో సైతం వివరాలు నమోదు చేసే అవకాశం కల్పించబోతున్నారు. దరఖాస్తు లేదా యాప్‌లో ఏదో ఒకదాంట్లో ఒక కుటుంబం ఎన్‌పీఆర్‌ వివరాలు పూర్తిచేస్తే సరిపోతుంది. అయితే, ఆన్‌లైన్‌ను ప్రోత్సహించేలా.. యాప్‌లో వివరాలు నింపే గణకుడికి రూ.25 వేలు ఇవ్వనున్నారు. దరఖాస్తులు వినియోగించేవారికి రూ.17 వేలు ఇవ్వాలని జనగణన విభాగం నిర్ణయించింది.


*డౌన్‌లోడ్‌లో జాగ్రత్తలు*

మొబైల్‌ యాప్‌ అంటే ఎవరైనా సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, జనగణన యాప్‌ కేవలం గణకుల ఫోన్‌లో మాత్రమే డౌన్‌లోడ్‌ అవుతుంది.  గణకులుగా ఎంపికైన టీచర్లకు శిక్షణ అనంతరం వారి సెల్‌ నంబర్లు కేంద్ర హోంశాఖకు పంపుతారు. వారి సెల్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సందేశం వస్తుంది. ఇతరులెవరూ ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయలేరు. గణకుడి ఫోన్‌లో డౌన్‌లోడ్‌ అయ్యాక ప్రజల ఇళ్లకు వెళ్లి ఎన్‌పీఆర్‌లో వివరాలు నమోదు చేయాలి. ఇంటి నంబరు, యజమాని ఆధార్‌ సంఖ్య నమోదు చేయగానే 2010లో నమోదు చేసిన ఎన్‌పీఆర్‌ యాప్‌లో ఫోన్‌ తెరపై ప్రత్యక్షమవుతుంది. అందులో ఉన్న వివరాలను సదరు కుటుంబ సభ్యుల వద్ద చదివి వినిపిస్తారు. జనన, మరణాల నమోదుతోపాటు ఇంకేమైనా సవరణలుంటే చేస్తారు. ఒకసారి ఓ కుటుంబం వివరాలు నమోదు చేసి ‘సేవ్‌’ అనే మీట నొక్కగానే అవి జనగణన వెబ్‌సైట్‌లోకి వెళ్లిపోతాయి. మళ్లీ చూడాలంటే గణకులకు కూడా సాధ్యం కాదు. ప్రజల వివరాలు ఎవరికీ తెలియకూడదని అత్యంత భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.


*150 ఇళ్లకు ఒక గణకుడు*

*  ప్రతి 120 నుంచి 150 ఇళ్లకు ఒక ‘జనగణన బ్లాక్‌’గా నిర్ణయించి ఒక గణకుడిని కేటాయిస్తారు.

*  ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,14,904, తెలంగాణలో 70,064 జనగణన బ్లాకులుంటాయని ప్రాథమిక అంచనా.

*  తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,71,484 మంది ఉపాధ్యాయులను జనగణనకు వినియోగించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో 94,835 , తెలంగాణలో 76,649 మంది టీచర్లు జనాభాలెక్కలు సేకరించే క్రతువులో పాల్గొనాల్సిఉంది.

*  ప్రతి మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు అధికారులకు తొలుత శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారు టీచర్లకు శిక్షణ ఇస్తారు.

*  ఏప్రిల్‌ 4వ వారం నుంచి జూన్‌ 10లోగా తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లు, కట్టడాలు, ఎన్‌పీఆర్‌ నమోదు పూర్తిచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి తేదీలను అధికారికంగా ప్రకటిస్తారు.

No comments:

Post a Comment

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...