Blog Archive

Sunday, 5 January 2020

మెడికల్ రీయంబర్స్మెంట్ జీవోలు

మెడికల్ రీయంబర్స్మెంట్ జీవోలు
💝మెడికల్ రీయంబర్స్మెంట్💝
(MEDICAL REMBURESEMENT)
✴ ప్రభుత్వ,పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు నిర్ధారింపబడిన వ్యాధులకు ప్రభుత్వ గుర్తింపుపొందిన ఆసుపత్రులయందు చికిత్సకై రీయంబర్స్మెంట్ విధానం వర్తించును.
*(G.O.Ms.No.74 తేది:15-03-2005)*
✴ ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 2 లక్షలకు మించకుండా రీయంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడును.
*(G.O.Ms.No.397 తేది:13-11-2008)*
✴ కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(CGHS) లో నిర్ణయించబడిన ప్యాకేజి ప్రకారం రీయంబర్స్మెంట్ ఖర్చులు చెల్లిస్తారు.
✴ వైద్యఖర్చులు రూ.50,000 అయితే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి(DEO) అంతకు మించినచో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(DSE) కి పంపాలి.
✴ ప్రైవేట్ రెఫరల్ గుర్తింపుపొందిన ఆసుపత్రులనందు కూడా 10% కోత లేకుండా పూర్తిమొత్తం చెల్లిస్తారు.
*(G.O.Ms.No.68 తేది:28-03-2011)*
✴ కీమోథేరపీ, రేడియోథేరపీ,డయాలసిస్,క్యాన్సర్,కిడ్నీ,గుండెజబ్బులు,ఎయిడ్స్,నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ ఆసుపత్రుల యందు అవుట్ పేషంట్ వైద్యఖర్చులు కూడా చెల్లిస్తారు.
✴ కంటి చికిత్స,దంత చికిత్సలకు గరిష్ఠంగా రూ.10,000 చెల్లిస్తారు.కాస్మోటిక్ డెంటల్ సర్జరీకి రీయంబర్స్మెంట్ సౌకర్యం లేదు.దంతచికిత్స సర్వీసులో (లేదా) జీవిత కాలంలో 3సార్లు చేయించుకోవచ్చును.
✴ రోడ్డుప్రమాదాలు సంభవించినపుడు  మాత్రమే ప్రాణాపాయ రక్షణ నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ గుర్తింపులేని ఆసుపత్రులలో చికిత్స పొందినను రీయంబర్స్మెంట్ చెల్లిస్తారు.స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదయిన FIR కాపిని జతచేయాలి.
*(G.O.Ms.No.175 తేది:29-05-1997)*
✴ 40సం॥ నుండి రిటైర్ అయ్యేవరకు (లేదా) జీవితకాలంలో 3 సార్లు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం కలదు.
*(G.O.Ms.No.105 తేది:09-04-2007)*
✴ మహిళా ఉద్యోగుల తల్లిదండ్రులు పూర్తిగా డిపెండెంట్స్ అయినచో రీయంబర్స్మెంట్ అవకాశం కలదు.
*(DSE Rc.No.350/D2-4/2008 తేది:15-04-2008)*
✴ కుటుంబ పెన్షన్ పొందేవారికి కూడా రీయంబర్స్మెంట్ సౌకర్యం వర్తించును.అయితే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తించదు.
*(G.O.Ms.No.87 తేది:28-02-2004)*
✴ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ లకు జీవిత కాలంలో ఒకే వ్యాధికి 3 పర్యాయాల వరకు రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చును.
*(G.O.Ms.No.601 M&H Dt:15-10-2003)*
✴ నిర్ణీత పదవీ విరమణ వయస్సు పూర్తి చేసి(సూపరాన్యుయేషన్) పై రిటైరైన వారికి మాత్రమే రీయింబర్స్మంట్ సౌకర్యం వర్తింపచేసారు.నిర్బంధ పదవీ విరమణ,వాలంటరీ రిటైర్మెంట్,మెడికల్ ఇన్వాలిడేషన్ పై రిటైర్మెంట్ పొందిన వారికి ఈ సౌకర్యం వర్తించదు.
*(G.O.Ms.No.401 Dt:25-06-1991)*
✴ హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన తేది  నుండి 6 నెలలలోపు, చనిపోయినచో 8 నెలలలోపు DEO/DSE కి ప్రతిపాదనలు పంపాలి.
✴ రీయంబర్స్మెంట్ పొందుటకు సమర్పించవలసిన సర్టిఫికెట్లును Rc.No. *8878/D2-4/09 తేది:02-09-2009* ద్వారా వివరించారు.

ఎల్ నినో, లా నినా అంటే ఏమిటి

ఎల్ నినో, లా నినా అంటే ఏమిటో తెలుగులో వివరించగలరు.

👉సమాధానం:

👉ఇవి రెండూ ప్రపంచ వాతావరణ పరిస్ధితులకు సంబంధించినవన్న సంగతి చాలా మందికి తెలుసు గానీ అవి నిర్దిష్టంగా ఎందుకు ఏర్పడుతాయో తెలియదు. నిజానికి శాస్త్రవేత్తలకు కూడా పూర్తిగా వీటి గురించి తెలియదు. 17వ శతాబ్దం ప్రారంభంలో దక్షిణ అమెరికా ఖండం పశ్చిమ తీరంలోని మత్స్యకారులు ఈ వాతావరణ పరిస్ధితిని మొదటిసారి కనుగొన్నారని రికార్డులు చెబుతున్నాయి. అప్పటి నుండీ శాస్త్రవేత్తలు వీటిపై అధ్యయనం చేస్తున్నారు. ఆ అధ్యయనం ఇంకా పరిణామ దశలోనే ఉంది.

👉సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఎల్ నినో, వర్షాభావ పరిస్ధితిని వివరిస్తుంది. లా నినా విపరీతంగా వర్షాలు కురిసే పరిస్ధితిని వివరిస్తుంది. స్పానిష్ భాషలో ఎల్ నినో అంటే క్రైస్తవ బాలుడు (బాల యేసు) అని అర్ధం. లేదా బాలుడు (ద బాయ్) అని కూడా పిలుస్తారు. డిసెంబర్ నెలలో ఎల్ నినో వాతావరణ పరిస్ధితి ఉచ్ఛ దశకు చేరుతుంది. క్రీస్తు పుట్టిన రోజు డిసెంబర్ లో వస్తుంది గనుక క్రిస్టమస్ పండుగను సూచిస్తూ ఎల్ నినో అని నామకరణం చేశారు.

👉లా నినో కూడా స్పానిష్ పదమే. ఆంగ్లంలో దీని అర్ధం ‘ద గర్ల్’ అని. ఎల్ నినో కు సరిగ్గా విరుద్ధంగా ఉంటుంది గనుక ‘ద బాయ్’ విరుద్ధ పదం అయిన ‘ద గర్ల్’ గా దానిని పిలుస్తున్నారు. ‘ఎల్ నినో’ లాగా, ‘లా నినా’ మరో బాలికా దేవతా స్త్రీని సూచించదు.

👉ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలు మరియు ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య విస్తరించే ఉండే పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ప్రత్యేక సముద్ర పవనాలు ఎల్ నినో – లా నినా లకు కారణం అవుతాయి. ఈ రెండింటినీ కలిపి ‘ఎల్ నినో సదరన్ ఆసిలేషన్’ (ENSO) వలయాలు అంటారు. సముద్రము, దానిపైన ఆవరించి ఉండే వాతావరణాల ఉష్ణోగ్రతలు తీవ్ర స్ధాయిలో ఒడిదుడుకులకు లోనవడం వల్ల ఇవి ఏర్పడతాయి. ENSO యొక్క ఉష్ణ దశను ఎల్ నినో అనీ చలి దశను లా నినా అనీ పిలవచ్చు.

👉సాధారణంగా పసిఫిక్ మహా సముద్రంలో వాణిజ్య పవనాలు ఉపరితల సముద్ర నీటిని తూర్పు నుండి పశ్చిమానికి కొనిపోతాయి. అనగా మధ్య అమెరికా పశ్చిమ తీరం, దక్షిణ అమెరికా ఖండం యొక్క ఉత్తర భాగంలోని పశ్చిమ తీరాల నుండి ఉపరితల సముద్ర నీరు ఆసియా, ఆస్ట్రేలియా తీరాలకు కొనిపోతాయి. ఆస్ట్రేలియా దక్షిణ, ఈశాన్య తీరాలు, చైనా, ఆస్ట్రేలియాల మధ్య ఉన్న వివిధ ద్వీప దేశాలు వీటి మార్గాలో ఉంటాయి. ఈ వాణిజ్య పవనాలు సుదీర్ఘ దూరాలు సూర్యుడి కింద ప్రయాణించడం వలన పశ్చిమ దిశకు వెళ్ళేకొద్దీ వేడెక్కుతాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ.

👉ఎల్ నినో ఏర్పడినప్పుడు దీనికి విరుద్ధ పరిస్ధితులు ఏర్పడతాయి. పెరూ, ఈక్వడార్ దేశాల తీరం నుండి పశ్చిమం వైపుగా ఉన్న సముద్ర ఉపరితలం సాధారణ స్ధితి కంటే వేడెక్కుతుంది. ఫలితంగా పసిఫిక్ సముద్రంలో భూమధ్య రేఖకు సమీపంగా తూర్పు నుండి పశ్చిమానికి ప్రయాణించే వాణిజ్య పవనాలు బలహీనపడతాయి. దానితో పశ్చిమ పసిఫిక్ సముద్ర ఉపరితల జలాలు తూర్పుకు ప్రయాణిస్తాయి. దీనివల్ల అమెరికా ఖండాలలోనూ భారత ఉపఖండం లోనూ, ఈశాన్య యూరప్ లోని కొన్ని ప్రాంతాలలోనూ తీవ్ర వర్షాభావ పరిస్ధితులు ఏర్పడతాయి.

👉ఎల్ నినో వల్ల సముద్ర జలాల ఉష్ణోగ్రత సగటున 0.5 డిగ్రీల సెంటీ గ్రేడు పెరుగుతుంది. ఈ పెరుగుదల ఒక్కోసారి, అరుదుగానే అయినా, 2 నుండి 6 డిగ్రీల వరకూ కూడా ఉండవచ్చు. ఎల్ నినో సంభవానికి ఒక క్రమ పద్ధతి అనేది ఏమీ లేదు. 2 నుండి 7 సంవత్సరాల వ్యవధిలో ఇది ఏర్పడవచ్చు. సగటు వ్యవధి 5 సం.లు అని ఒక అంచనా. ఎల్ నినో వ్యవధి 7 నుండి 9 నెలల వరకూ ఉంటుంది.

👉వికీ పీడియా ప్రకారం ఎల్ నినో సంభవించింది అనడానికి ఈ కింది పరిణామాలు సూచికలు.

👉1. హిందూ మహా సముద్రం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా లపైనా ఉపరితల ఒత్తిడి పెరుగుతుంది.

👉2. తహితితో సహా మధ్య-తూర్పు పసిఫిక్ సముద్రం పైన ఉపరితల గాలి ఒత్తిడి పడిపోతుంది.

👉3. దక్షిణ పసిఫిక్ లోని వాణిజ్య పవనాలు బలహీనపడతాయి. లేదా తూర్పుకు ప్రయాణిస్తాయి.

👉4. పెరు దేశంపై గాలి వేడెక్కి వాతావరణం పైకి ప్రయాణిస్తుంది. అక్కడ చల్లబడి ఉత్తర పెరు ఎడారిలో వర్షాలు కురుస్తాయి.

👉5. సముద్ర ఉష్ణ జలాలు పశ్చిమ పసిఫిక్, హిందూ మహా సముద్రాల నుండి తూర్పు పసిఫిక్ కు విస్తరిస్తాయి. అవి తమతో పాటు వర్షాన్ని కూడా తీసుకెళ్తాయి. ఫలితంగా పశ్చిమ పసిఫిక్ తీరం, హిందూ మహా సముద్రం (ఇండియా) లలో తీవ్ర వర్షాభావ పరిస్ధితులు ఏర్పడడమే గాక సాధారణంగా వర్షం పెద్దగా కురవని పొడి ప్రాంతాలయిన తూర్పు ఫాసిఫిక్ తీరంలో వర్షం భాగా కురుస్తుంది. అమెరికా వరకు చూస్తే పశ్చిమ తీర ప్రాంతం ఎండిపోయి తూర్పు గల్ఫ్ తీర ప్రాంతంలో వర్షాలు దండిగా కురుస్తాయి.

👉ఎల్-నినో ప్రభావం ఇండియాపైన ఉంటుంది. కానీ స్ధిరంగా ఉండదు. ఈ సంవత్సరం ఎల్ నినో ఏర్పడే అవకాశం 60 శాతం ఉన్నదని భారత వాతావరణ విభాగం రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఎల్ నినో సంభవించినప్పుడల్లా ఇండియాలో వర్షాభావం ఏర్పడుతుందన్న నియమం లేదు. కొన్నిసార్లు తీవ్ర ప్రభావం చూపగా మరికొన్నిసార్లు పెద్దగా ప్రభావం చూపలేదు. 1997-98లో తీవ్ర స్ధాయి ఎల్ నినో సంభవించింది. కానీ ఇండియాపై ప్రభావం చూపలేదు. 2002లో ఒక మాదిరి ఎల్ నినో ఏర్పడగా ఇండియాలో తీవ్ర కరువు పరిస్ధితి ఏర్పడింది. మొత్తం మీద చూస్తే గత శతాబ్ద కాలంలో ఎల్ నినో వల్ల ఇండియాలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయింది. సగం కంటే ఎక్కువసార్లు దుర్భిక్ష పరిస్ధితులు ఏర్పడ్డాయి. అనగా ఎల్ నినో ప్రభావం భారత వ్యవసాయరంగాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.

👉లా నినా వాతావరణం సాధారణంగా ఎల్ నినో అనంతరం ఏర్పడతాయి. కానీ ఎల్ నినో అనంతరం ఖచ్చితంగా లా నినా ఏర్పడుతుందని గ్యారంటీ లేదు. తూర్పు పసిఫిక్ మహా సముద్రంలో భూ మధ్య రేఖ ప్రాంతం వెంబడి ఉష్ణోగ్రతలు సాధారణ స్ధాయి కంటే పడిపోయినప్పుడు లా నినా ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత తగ్గుదల 3 నుండి 5 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చు. లా నినా ప్రభావాలు ఎల్ నినో ప్రభావాలకు సరిగ్గా విరుద్ధంగా ఉంటాయి. ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తాయి. ముఖ్యంగా చిలీ, పెరు, న్యూ జీలాండ్, ఆస్ట్రేలియా తీరాల్లో కుంభ వృష్టి పడుతుంది. లా నినా వల్ల పశ్చిమ ‘దక్షిణ అమెరికా’ లో కరువు ఏర్పడితే ఉత్తర ‘దక్షిణ అమెరికా’లో వర్షాలు బాగా కురుస్తాయి.

👉ఇండియాలో ఎల్ నినో వల్ల, 2009లో జరిగినట్లుగా, నైరుతీ ఋతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. లా నినా వల్ల భారత నైరుతీ ఋతుపవనాలు లాభపడతాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఇవ్వడానికి దోహదం చేస్తుంది. ఉదాహరణకి 2010లో పసిఫిక్ లో ఏర్పడిన లా నినా వల్ల ఇండియాలో నైరుతీ ఋతుపవనాలు దండిగా వర్షాలు ఇచ్చాయి. ఆస్ట్రేలియాలో అయితే ఆకాశం విరిగి నేలమీద పడినట్లుగా వర్షాలు కురిసి తీవ్రమైన ఉత్పాతాలకు దారితీసింది.

👉ఎల్ నినో ఏర్పడేందుకు గ్లోబల్ వార్మింగ్ కారణమా? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం శాస్త్రవేత్తలకే ఇంకా తెలియదు. రెండింటికి సంబంధం ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉందని మాత్రం చెబుతున్నారు. భూ వాతావరణ చరిత్ర అంతా ఎల్ నినో, లా నినాల మధ్య ఊగిసలాడిన చరిత్రే అనీ, ఆ రెండింటి మధ్య సాధారణ వాతావరణం ఎక్కువ కాలం కొనసాగిన చరిత్ర గతంలో ఉండగా, ఇప్పుడది తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్ నినో రాక ఇటీవల దశాబ్దాలలో మరీ ముఖ్యంగా గత రెండు, మూడు దశాబ్దాలలో బాగా ఎక్కువయిందని వారు చెబుతున్నారు.

👉ఇప్పుడు ప్రపంచంలోని వివిధ షేర్ మార్కెట్లు కూడా ఎల్ నినో, లా నినా ప్రభావాలకు అనుగుణంగా స్పందించేందుకు అలవాటు పడ్డాయి. పలు ఆర్ధిక వ్యవస్ధలకు ఋతుపవన వర్షపాతమే ఆధారం కనుక అది సహజమే.

ZP/GPF PART FINAL WITH DRAW

ZP/GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్.

👉చందాదారుడు 20 సం॥ సర్వీసు పూర్తిచేసినా,లేక పదవీ విరమణ చేయడానికి 10 సం॥ మిగిలివున్న ఉద్యోగి తన GPF ఖాతా నుండి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ చేసుకోవడానికి అనుమతి మంజూరుచేస్తారు రూల్ -15A

 👉గృహసంబంధ అంశాల విషయంలో ఉద్యోగి 15 సం॥ సర్వీసు పూర్తిచేసినా పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ తీసుకోవడానికి అర్హత కలదు.

👉పదవీ విరమణ పొందడానికి చివరి 4 నెలల సర్వీసులో ఎటువంటి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ అనుమతించబడదు కాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో అనుమతించవచ్చును.(G.O.Ms.No.98 తేది:19-06-1992)

👉సాధారణంగా 6 నెలల తరువాతనే రెండవ పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ అనుమతించాలి లేక ఒక ఆర్ధిక సం॥లో రెండు కంటే ఎక్కువ పార్ట్ ఫైనల్ డ్రాయల్ మంజూరు చేయరాదు రూల్-15B

 👉zp/GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ తీసుకుంటే ఎటువంటి రికవరీ ఉండదు

 👉ZP/GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ దరఖాస్తును అపెండిక్స్-O లో సమర్పించాలి

👉ఉద్యోగి పదవీ విరమణ చేసినా,లేక ఉద్యోగానికి రాజీనామా చేసినా లేక మరణించినా అతని ఖాతాలో నిల్వ ఉన్న మొత్తం అతనికి,అలాగే ఉద్యోగి చనిపోతే అతడు సమర్పించిన నామినేషన్ ప్రకారం కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. నామినేషన్ లేని సందర్భాలలో అర్హత కలిగిన కుటుంబ సభ్యులందరికీ సమాన వాటాల ద్వారా చెల్లిస్తారు రూల్-28,29,30

👉GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్,ఫైనల్ విత్ డ్రాయల్ బిల్లులను ఫామ్-40 లో దాఖలు చేయాలి.అలాగే ఫామ్-40A కూడా జతపరచాలి.

👉జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేయు ఉద్యోగులకు ప్రధానోపాధ్యాయులు,

👉మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ మంజూరుచేసి ఫాం-40 తో పాటు జిల్లా*పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి పంపి సదరు సొమ్మును ఉపాధ్యాయులకు చెక్కు ద్వారా చెల్లిస్తారు
(G.O.Ms.No.447 Dt:28-03-2011)

ఉద్యోగ, ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సర్వీసు అంశాలు

ఉద్యోగ, ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సర్వీసు అంశాలు

 👉సరెండర్ లీవు (Surrender Leave) కాలానికి పూర్తివేతనం,ఇతర అలవెన్సులు మంజూరు చేయబడతాయి.IR చెల్లించబడదు. తెలంగాణ ఇంక్రిమెంట్ చెల్లించబడుతుంది.
(Memo No.31948 F&P తేది:12-08-1998)
(Memo No.3572/107/A1/Admn.I/2014 Dt:15-12-2014)

👉మృత శిశువు జన్మించినా,జన్మించిన తరువాత శిశువు మరణించినా ప్రసూతి  సెలవు (Maternity Leave) కు అర్హులు.
(L.Dis.No.1941 Dt:11-06-1990)

👉ప్రసూతి సెలవులో  (Maternity Leave) ఉండి బదిలీ,పదోన్నతి పొందిన సందర్భంలో లీవ్ పూర్తయిన అనంతరం నూతన పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది.
(Rc.No.29 Dt:25-01-2003)
(Rc.No.3750 Dt:13-08-2009)

👉LTC లో ప్రతి 4 సం॥ కాలం బ్లాకు పీరియడ్ గా నిర్ణయించబడుతుంది.మొదటి 2 సం॥ స్వస్థలం (Home Town) పోవుటకు ,తదుపరి 2 సం॥ కాలం రాష్ట్రంలో ఏ ప్రదేశమునకు గాని లేదా స్వస్థలం (Home Town) నకు గాని,సర్వీసు మొత్తంలో ఒకసారి దేశంలో ఏ ప్రదేశానికైనా LTC సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చును. 3,500 కి.మీ లు మించకుండా ప్రయాణం చేయాలి.రూ.18,750 చెల్లిస్తారు.బ్లాకు పీరియడ్ ను ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా విడుదల చేయాలి.
(G.O.Ms.No.76 Dt:13-05-2015)

👉కారుణ్య నియామకాలలో భాగంగా 18 సం॥ కన్నా తక్కువ వయస్సున్న వారిని ఉద్యోగంలో నియమించుటకు అలాగే 34 సం॥ మించియున్న వయస్సు వారిని ఉద్యోగంలో నియమించుటకు అవకాశం లేదు.అయితే భార్య/భర్త లకు ఉద్యోగం ఇచ్చు సందర్భంలో వారి గరిష్ట వయస్సు 45 సం॥ గా నిర్ణయించడం జరిగింది.
(G.O.Ms.No.759 GAD Dt:06-10-2007)
(G.O.Ms.No.144 GAD Dt:15-06-2004)

👉సస్పెండ్ అయిన ఉద్యోగికి  జీవనాధార భత్యము (Subsistence Allowance) తిరస్కరించరాదు.అట్టి చెల్లింపులు తిరస్కరించడం శిక్షించదగ్గ నేరం.
(Govt.Memo.No.29370/A/458/FR-II/96 F&P Dt:14-10-1996)

Selection Of Field Trainers for Censes Duties

Selection Of Field Trainers for Censes Duties

జనాభా లెక్కలు విధులు నిర్వహించడానికి ఫీల్డ్ ట్రైనర్స్ ఎంపిక చేయుట గురించి మార్గదర్శకాలు

▪ బదిలీలు గురించి తన ఉత్తర్వుల్లో పేర్కొన్న జనాభా లెక్కల విభాగం...


Saturday, 4 January 2020

NADU NEDU MOU APPLICATION

NADU NEDU MOU APPLICATION

👇👇

CLICK HERE TO DOWNLOAD NADU NEDU MOU APPLICATION

పాఠశాల విద్యలో సెమిస్టర్‌ విధానం

 *పాఠశాల విద్యలో సెమిస్టర్‌ విధానం*


❇ *జాతీయ విద్యావిధానం-2020 నివేదికలో వెల్లడి*

🌏 *ఈనాడు - అమరావతి*

⬛ *సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని, పాఠశాల విద్యలో సెమిస్టర్‌ విధానాన్ని అమలు చేయాలని జాతీయ విద్యావిధానం-2020 నివేదిక సూచించింది. పాఠశాల, ఉన్నతవిద్య ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను 60 పేజీల నివేదిక పేర్కొంది.*

⬛ *పూర్వప్రాథమిక విద్యలో నాణ్యత ఉండటం లేదని, అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని సూచించింది. చాలామంది విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం రావడం లేదని, చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.*


 *5+3+3+4 విధానం*

పాఠశాల విద్యలో 5+3+3+4 విధానం అమలు చేయాలి. ఐదేళ్లలో మొదటి మూడేళ్లు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు 1, 2 తరగతులు, తర్వాత మూడేళ్లలో 3-5 తరగతులు, అనంతరం మూడేళ్లు 6-8 తరగతులు, నాలుగేళ్లలో ఉన్నత పాఠశాల 9-12 తరగతులు ఉంటాయి. మొదటి ఐదేళ్ల పునాది స్థాయిలో విద్యార్థులకు మంచి ప్రవర్తన, నైతికత, వ్యక్తిగత పరిశుభ్రత, బృందంగా, పరస్పర సహకార విధానం బోధించాలి.

 *2035 నాటికి 100 శాతం ప్రవేశాలు*

ప్రస్తుతం విద్యార్థుల ప్రవేశాల నిష్పత్తి 6-8 తరగతుల్లో 90.7%, 9-10లో 79.3%, 11-12 తరగతుల్లో 51.3%. ఈ గణాంకాల ప్రకారం ఎనిమిదో తరగతి తర్వాత బడి మానేస్తున్న వారి సంఖ్య అధికం. వీరిని మళ్లీ బడికి తీసుకొచ్చే కార్యక్రమంపై దృష్టి పెట్టాలి.  పూర్వప్రాథమిక విద్యలో 2035 నాటికి 100% స్థూల ప్రవేశాల నిష్పత్తి ఉండాలి.


*నాలుగేళ్ల డిగ్రీలో వెసులుబాటు*

⬛ *ఉన్నత విద్యాసంస్థలు నాలుగేళ్ల డిగ్రీలను ఆహ్వానించాలని సూచించింది. విద్యార్థులు ఎప్పుడైనా బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని పేర్కొంది. మొదటి ఏడాది వెళ్లిపోతే డిప్లొమా అర్హత ధ్రువపత్రం, మూడేళ్లకు బయటకు వెళ్తే డిగ్రీ ఇవ్వాలని వెల్లడించింది.*

⬛ *ఆర్థిక సమస్యలతో ఏ విద్యార్థీ ఉన్నతవిద్యకు దూరం కాకూడదు. జాతీయ ఉపకార వేతనాన్ని మరింత విస్తరించాలి. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు ఉపకార వేతనాలను అందించాలి. ఉన్నతవిద్యలో ప్రవేశాల నిష్పత్తి 2018లో జాతీయ సరాసరి 26.3% ఉంది. ఇది 2030 నాటికి 50% చేరాలి.*

⬛ *2040 నాటికి డిగ్రీ కళాశాలలు స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలుగా, విశ్వవిద్యాలయాలు... పరిశోధన వర్సిటీలు, బోధన వర్సిటీలుగా మారాలి.*

 *నాణ్యతలేని బీఈడీ విద్యాసంస్థల మూత*

🔷 *ఉపాధ్యాయ విద్యలో నాణ్యత పెరగాలని, నాణ్యతలేని వాటిని వీలైనంతవరకు మూసివేయాలని నివేదిక సూచించింది.*

🔷 *కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 30:1, సామాజిక వెనుకబడిన ప్రాంతాల్లో 25:1 తప్పనిసరి.*

🔷 *2030 నాటికి నాలుగేళ్ల సమీకృత డిగ్రీ+ బీఈడీ కోర్సు అర్హతగా ఉండాలి. విద్యా సంస్థలు బహుళ బీఈడీ కోర్సులను నిర్వహించాలి.*

🔷 *నాణ్యతలేని ఉపాధ్యాయ విద్యాసంస్థలను మూసివేయాలి.*

🔷  *ప్రైవేటు పాఠశాలలపై పర్యవేక్షణ, అంచనా, అక్రిడిటేషన్‌ అవసరం* 

🔷 *వెనుకబడిన, అణగారిన వర్గాలకు విద్యాహక్కు చట్టం ప్రకారం ఉన్నత ప్రమాణాలతో కూడిన పూర్వప్రాథమిక విద్యను అందించాలి*. 

🔷 *జాతీయ ఓపెన్‌ స్కూల్‌(ఎన్‌ఐవోఎస్‌)లో సార్వత్రిక, దూరవిద్య కోర్సులను మరింత పెంచాలి.*


IMPROVE ENGLISH power

జనాభా లెక్కలకు పోనంటే జైలే

జనాభా లెక్కలకు పోనంటే జైలే


న్యూఢిల్లీ: *🌎జనాభా లెక్కలకు రంగం సిద్ధమవుతోంది. అన్ని రాష్ట్రాలూ ఏర్పాట్లలో మునిగిపోయాయి. సర్వేకు వెళ్లే స్టాఫ్‌‌కు ట్రైనింగ్‌‌కు కూడా సన్నాహాలు చేస్తున్నాయి. ఇంతవరకు ఓకే.. ఒకవేళ ఏదైనా రాష్ట్రం ‘మేం సర్వే చేయించం’ అంటే? ఎవరైనా గవర్నమెంట్‌‌ ఉద్యోగే ‘నేను సర్వే చేయడానికి పోను’ అంటే? సెన్సస్ ఆఫ్‌‌ ఇండియా యాక్టు ప్రకారం గట్టి శిక్షలే ఉన్నాయి. ప్రభుత్వం గాని, ఉద్యోగి గాని సర్వేకు సాయం చేయకపోతే యాక్టులోని సెక్షన్‌‌ 11 ప్రకారం జైలు శిక్ష గాని, ఫైన్‌‌గానీ వేసే అధికారం కేంద్రానికి ఉందని అధికారులు చెప్పారు. అట్లాగే ఎన్పీఆర్‌‌ డ్యూటీ చేయడానికి నిరాకరిస్తే సిటిజన్‌‌షిప్‌‌ రూల్స్‌‌ 2003 ప్రకారం రూ. వెయ్యి వరకు ఫైన్‌‌ వేయొచ్చన్నారు.*

*🌀పైగా ఆ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే చాన్స్‌‌ ఉందని చెప్పారు. సెన్సస్‌‌ ఆఫ్‌‌ ఇండియా యాక్టు, సిటిజన్‌‌షిప్‌‌ రూల్స్‌‌ ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతాలు జనగణన చేయడంలో సెన్సస్‌‌ కమిషనర్‌‌ అండ్‌‌ రిజిస్ట్రార్‌‌ జనరల్‌‌ ఆఫ్‌‌ సిటిజన్‌‌ రిజిస్ట్రేషన్‌‌కు సహకరించాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు, యూటీలు ప్రిన్సిపల్‌‌ సెన్సస్‌‌ అధికారిని, జిల్లా, ప్రాంతాల వారీగా సెన్సస్‌‌ అధికారులను, సూపర్‌‌వైజర్లు, ఎన్యుమరేటర్లను నియమించాలని చెప్పారు. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ రిజిస్ట్రార్‌‌ జనరల్‌‌ ఆఫ్‌‌ సిటిజన్‌‌ రిజిస్ట్రేషన్‌‌కు సహకరించాలన్నారు. 2021 జనగణనలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌‌ నుంచి సెప్టెంబర్‌‌ వరకు జనాభా లెక్కలు తీయనున్నారు. ఇందుకోసం టీచర్లు, ఇతర గవర్నమెంట్‌‌ స్టాఫ్‌‌ను ఎన్యుమరేటర్లుగా నియమించారు.*

సందేహాలు --- సమాధానాలు

*🇮🇳PRTU  P.V.Rao🇮🇳*

*⁉సందేహాలు --- సమాధానాలు⁉*

*❓ప్రశ్న*

*UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు?*

*☑జవాబు:*

*FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి.కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతి తో జమ చేయవలసి ఉంటుంది.*

*❓ప్రశ్న*

*SGT గా పనిచేస్తున్న టీచర్ VRO గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్,సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా?*

*☑జవాబు:*

*DEO అనుమతి తో పరీక్ష రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105 తేదీ:2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి సమానమైన స్టేజి లో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసు లో చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.*


*❓ప్రశ్న*

*మహిళా టీచర్ భర్త నిరుద్యోగి.అత్త, మామ కూడా ఈమె పైనే ఆధార పడి జీవిస్తున్నారు.అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు.మెడికల్ రీ ఎంబర్సుమెంట్ వర్తిస్తుందా?*

*☑జవాబు:*

*APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ,నాన్న లకి మాత్రమే వర్తిస్తుంది.*


*❓ప్రశ్న*

*నాకు మొదటి సారి అమ్మాయి. తర్వాత కవల పిల్లలు జన్మించారు. LTC లో ముగ్గురు పిల్లలు ప్రయాణం చేయవచ్చా?*

*☑జవాబు:*

*జీఓ.140 తేదీ:3.4.96 ప్రకారం ఇద్దరు పిల్లలుకి మాత్రమే అవకాశం ఉంది.*


*❓ప్రశ్న*

*అబార్షన్ కి రెండుసార్లు మాత్రమే సెలవు ఉపయోగించుకోవాలి అనుచున్నారు. వాస్తవమా? కాదా?*

*☑జవాబు:*

*జీఓ.254;ఆర్ధిక;తేదీ:10.11.95 ప్రకారం ఇద్దరు కంటే తక్కువ జీవించియున్న బిడ్డలు గలవారు అర్హులు. అంతేకానీ ఎన్నోసారి అనే దానితో నిమిత్తం లేదు.*

*❓ప్రశ్న*

*అడ్మిషన్ రిజిస్టర్ లో ఒక పుట్టిన తేదీ ఉంది. మున్సిపాలిటీ/కార్పొరేషన్ వారు ఇచ్చిన సెర్టిఫికెట్ లో మరొక పుట్టిన తేదీ ఉంది. మున్సిపాలిటీ సెర్టిఫికెట్ ప్రకారం పుట్టిన తేదీ నామినల్ రోల్స్ లో మార్చమని పేరెంట్స్ అడుగుతున్నారు. అలా మార్చవచ్చా?*

*☑జవాబు:*

*SSC రూల్స్ 6 ప్రకారం తనిఖీ అధికారి అనుమతితో మార్పు చేయవచ్చు.*

*❓ప్రశ్న*

*ఒక టీచర్ జూన్ నుంచి డిసెంబరు వరకు ప్రసూతి సెలవులో ఉన్నారు.ఆమె ఇంక్రిమెంట్ అక్టోబర్ నెలలో ఉంది.ఆమెకు ఇంక్రిమెంట్ ఎప్పటి నుంచి ఇవ్వాలి?*

*☑జవాబు:*

*జీఓ.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ఇంక్రిమెంట్ అక్టోబర్ 1 నుండి మంజూరు చేస్తూ, ఆర్ధిక లాభం విధులలో చేరిన తేదీ నుంచి మంజూరు చెయ్యాలి.*

*❓ప్రశ్న*

*ఐటీ కేవలం ఫిబ్రవరి జీతంలోనే మినహాయించాలా?*

*జవాబు:*

*ఐటీ నిబంధనలు ప్రకారం చెల్లించవలసిన ఐటీ ముందే అంచనా వేసి మార్చి నెల జీతం నుండి ప్రారంభించి నెలనెలా మినహాయించాలి. ప్రతి క్వార్టర్ కి రిటర్న్స్ ఐటీ శాఖకు సమర్పించాలి. ఈ భాద్యత DDO లదే.*


*❓ప్రశ్న*

*ఒకరు మిలటరీ లో చేసి రిటైర్మెంట్ అయి, మరల sgt గా చేరి రిటైర్డ్ అయ్యారు. ఇపుడు అతనికి రెండు పెన్షన్లు వస్తాయా?*

*జవాబు:*

*ఏపీ పెన్షన్ రూల్స్ ప్రకారం రెండు పెన్షన్లు పొందవచ్చు.*

*❓ప్రశ్న*

*నేను SA క్యాడర్ లో 12 ఇయర్స్ స్కేల్ పొందాను. ఇటీవల HM గా పదోన్నతి వస్తే వదులుకున్నాను. ప్రస్తుతం నాకు జరిగే నష్టం ఏమిటి?*

*జవాబు:*

*మెమో.3307 ; ఆర్ధిక ; తేదీ:24.2.1993 ప్రకారం 18,24 ఇయర్స్ స్కేల్స్ ఇక ఇవ్వరు.ఇచ్చిన 12 ఇయర్స్ స్కేల్ మాత్రం కొనసాగుతుంది.*
*🍃🍃*




*⁉సందేహం--సమాధానం⁉*


ప్రశ్న:

*జాతీయ పండుగల రోజు జెండా వందనం కి హాజరు కాలేకపోతే చర్యలు తీసుకుంటారా?*

జవాబు:

సివిల్ సర్వీస్ కోడ్ ప్రకారం జెండా వందనం కి హజరు కాకపోతే జాతీయ జెండాను అగౌరవపరచినట్లుగా భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.

🌹🌹🌹🌹🌹

ప్రశ్న:

*స్థానికత దేని ఆధారంగా నిర్ణయిస్తారు?*

జవాబు:

జీఓ.674 జీఏడీ: తేదీ:20.10.1975 రాష్టప్రతి ఉత్తర్వుల లోని పేరా 7  ప్రకారం 4 నుంచి 10వ తరగతి వరకు గల 7 ఇయర్స్ కాలంలో ఎక్కువ భాగం ఎక్కడ చదివితే 
ఆ జిల్లానే లోకల్ గా పరిగణింపబడుతుంది.


🌹🌹🌹🌹🌹

ప్రశ్న:

*నేను 1996 డిసెంబరులో sgt గా చేరాను. ఐతే 2001 లో 142 రోజులు, 2005 లో 90 రోజులు అనారోగ్యంతో జీతనష్టం (ఇఓఎల్) సెలవు పెట్టాను. ఇంక్రిమెంట్ ఆగస్టుకి పోస్టుపోన్ అయ్యింది. ఐతే ఇంక్రిమెంట్ను డిసెంబరుకి మార్చుకొనే అవకాశం లేదా?*

జవాబు:

జీఓ.43; తేదీ:5.2.76 ప్రకారం డిసెంబరుకి మార్చుకోవచ్చు.ఐతే సంబంధిత ప్రతిపాదనలు వైద్య ధ్రువపత్రాలతో మరియు SR తో deo ద్వారా DSE కి పంపాలి.180 రోజుల వరకు DSE, అంతకు మించిన కాలానికి విద్యా శాఖ కార్యదర్శి అనుమతితో ఈఓయల్ కాలం ఇంక్రిమెంట్కి సర్వీసు గా పరిగణించబడుతుంది.

🌹🌹🌹🌹

ప్రశ్న:

*సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి బ్రతికేది ఎలా?*

జవాబు:

సస్పెండ్ పీరియడ్ లో సబ్ స్టెన్స్ అలవెన్సు కింద సగం జీతం (హాఫ్ పే,హాఫ్ డీఏ, హాఫ్ హెచ్ఆర్ఏ) ఇస్తారు.

🌹🌹🌹

ప్రశ్న:

*ఒక ఉద్యోగి 9 ఇయర్స్ పాటు ఉద్యోగానికి గైరు హాజరు అయ్యాడు.అతనికి మరల పోస్టింగ్ ఇస్తారా??*

జవాబు:


FR.18 మరియు aplr.1933 లోని రూల్ 5 ప్రకారం ఒక ఉద్యోగి 5 ఇయర్స్ పాటు గైర్హాజరు అయితే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా భావించాలి.తిరిగి చేరాలి అంటే విద్యాశాఖ కార్యదర్శి నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.

NADU NEDU DETAILS ENTER IN STMS APP

నాడు నేడు క్రింద Sanction అయిన పాఠశాలల వారు Parents Committee తీర్మానం కాపీని మరియు కొత్తగా ఓపెన్ చేసిన Bank అకౌంట్ సంభందించి వివరాలను STMS సైట్ లో Enter చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.

👇👇👇

CLICK HERE TO WATCH VIDEO


LEAVE RULES

LEAVE RULES


👉🏿 సాధారణ సెలవులు (cl)  వరుసగా 10 రోజులు వాడరాదు


👉🏿జాతీయ,అంతర్జాతీయ స్థాయి స్పోట్స్ లో పాల్గొనే ఉపాధ్యాయులకు 30 రోజులు spl CL లు ఇస్తారు


👉🏿దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి ( క్యాన్సర్, మూత్రపిండాలు వ్యాధులు) 6 నెలలు పూర్తి వేతనం తో గల halfpay leave ఇస్తారు


👉🏿COMPRENSIVE CASUAL LEAVE ని GOVT అనుమతి ఇచ్చిన DATE నుండి 6 నెలల లోపు వాడుకోవాలి


👉🏿EARNLEAVE ని ప్రతి జనవరి 1 నుండి జూలై 1 వరకు ADVANCE గా 3 రోజులు జమచేయవచ్చు

EL లు service మొత్తంలో 300 రోజులు encashment చేసికోవచ్చు
GO .MS NO.232,DT 16.9.2005

👉🏿EOL లో 5A,5B ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ONE YEAR  ఉద్యోగానికి ABSENT అయితే రాజీనామా చేయినట్లు బావిస్తారు GO. MS NO.129 ,DT 1.6.2007


👉🏿HALF PAY LEAVE(PERSONAL WORK).180 DAYs అనగా 6 నెలలు వరకు HRA, CCA లను పూర్తిగా చెలిస్తారు


HALFPAY LEAVE కి ?PREFIX, SUFIX కూడా వాడుకోవచ్చు


👉🏿HALFPAY LEAVE లో COMMUTATIVE LEAVE ని వాడుకుంటే మీకు ఉన్న ML లు వాడుకున్న రోజులకు రెట్టింపు తగ్గించును

ఇవి సర్వీస్ లో 480 గాను 240 రోజులు వాడుకోవచ్చు

ఇవి వాడుకోను సందర్భం లో దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి
8 నెలల వరకు HRA, CCA లు పూర్తిగా చెలిస్తారు



👉🏿surrender leave లు 15/30 రోజులు సంవత్సరం లో ఏ నెలలోనైనా encashment చేసికోవచ్చు


SURRENDER LEAVE కి IR ఇవ్వరు


👉🏿వేసవికాలంలో.. పనిచేసిన ఏ డ్యూటీలో నయినా వారికి ELS అనేవి దామాషా పద్దతిలో నమోదు చేయును

GO MS NO.382/E1-1/2013,date 16.11.2013


👉🏿MATERNATIVE LEAVE ని కాన్పు జరిగిన రోజునుండి 180 రోజులు జీతంలో కూడిన సెలవు ఇచ్చును


ఈ సెలవు వేసవిలో కాన్పు జరిగినా ,జరిగిన తేదీ నుండే 180 రోజులు వచ్చును


ఈ సెలవులో ఉన్నప్పుడు ఆర్థిక లాభం ఉంటే తిరిగి జాయిన్ ఐన తరువాతే ఇచ్చును


ఈ సెలవులో ఉండగా transfer అయితే కొత్త పాఠశాలలో report చేసి  సెలవులో ఉండాలి join అయితే leave cancel అగును



👉🏿అబార్షన్ జరిగిన వారికి 6 week సెలవు ఇచ్చును 

GO MS NO 762,DT 11.08.1976



👉🏿PATERNATIVE LEAVE ని 15 రోజులు ప్రసవించిన తేదీ నుండి 6 నెలల లోపు వాడుకోవాలి


👉🏿CHILD CARE LEAVE  అనేది 60 రోజులు

ఇది 3 సార్లు కి తగ్గకుండా వాడుకోవాలి మరియు  పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చువరకె అనుమతి

ప్రత్యేక సందర్భంలో 22 YEARS  పూర్తి అయ్యే వరకు ఇస్తారు

దీనికి children date of birth certificate submit చేయాలి


ఈ leave ని CL, SPL CL తో కలిపి వాడరాదు కాని  మిగతా leaves  కలిపి వాడుకోవచ్చు



👉🏿 15 రోజులు దాటిన సెలవులు VACATION అంటారు...దీనికి  PREFIX, SUFIX వాడుకోవచ్చు


10 రోజులు దాటాని సెలవులకు  ముందు,వెనుక రెండు రోజులు రావాలి


10 రోజులు లోపు సెలవులు వస్తే  ముందు, వెనుక రోజుకు  ముందు CL వాడుకోవచ్చు




SPOKEN ENGLISH FOR KIDS

Spoken English and English Grammar for Kids... Pre School Learning Videos.. Every Parent Must watch these videos

👇👇

CLICK HERE TO WATCH VIDEO

దసరా.. సంక్రాంతి సెలవులు.. suffix.. prefix పై వివరణ

దసరా.. సంక్రాంతి సెలవులు.. suffix.. prefix పై వివరణ

*➡ దసరా/సంక్రాంతి సెలవులు 9 రోజులు ప్రకటించినపుడు (ఆదివారంతో కలిపి) చివరి రోజు గానీ , బడి తెరిచే రోజు గానీ (రెండింటిలో ఒకటి మాత్రమే) సాధారణ సెలవు(CL) పెట్టుకోవచ్చు.*

*➡ దసరా/సంక్రాంతి సెలవులు 10 నుంచి 14 రోజులు (ఆదివారంతో కలిపి) ప్రకటించినపుడు చివరి రోజూ , బడి తెరిచేరోజు (రెండు రోజులు) తప్పక బడికి వెళ్ళాలి.అలా వెళ్లకపోతే మొత్తం సెలవులకి అర్హత గల సెలవు పెట్టవలసి ఉంటుంది. అనగా EL/MCL/HPL/EOL లలో ఏదోఒకటి పెట్టవలసి ఉంటుంది.*

*➡ దసరా/సంక్రాంతి సెలవులు 15 లేక అంతకంటే ఎక్కువ రోజులు (ఆదివారంతో కలిపి) ప్రకటించినపుడు బడి చివరి రోజు గానీ , బడి తెరిచేరోజు గానీ (రెండింటి లో ఒక రోజు మాత్రమే) అర్హత గల సెలవు పెట్టుకోవచ్చు. అర్హత గల సెలవు అనగా EL/HPL/MCL లలో ఒకటి 1 రోజు కోసం వాడుకోవచ్చు.*

  •  *గమనిక :- ఈ సంవత్సరం సంక్రాంతి సెలవులు 10.01.2020 నుంచి 20.01.2020 వరకు అనగా మొత్తం 11 రోజులు. కావున 9వ తేదీ ( చివరి రోజు ) మరియు 21వ తేదీ ( బడి తెరిచే రోజు ) తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలి.ఈ రెండు రోజులలో ఏ ఒక్క రోజు హాజరుకాకపోయిన ఈ 11 రోజులు అర్హతగల EL/HPL/MCL/EOL లలో ఏదోఒకటి పెట్టవలసి ఉంటుంది.*

టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల




 టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల

మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8 వరకు నిర్వహణ.

👉ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ శుక్రవారం విడుదలైంది. 

👉2020 మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ షెడ్యూల్‌ ప్రకటించారు. 

👉ఉదయం 9.30 నుంచి మధ్నాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని అందులో పేర్కొన్నారు. 

👉మార్చి 23 - ఫస్ట్‌లాంగ్వేజ్‌ పేపర్‌ 1, 
👉మార్చి 24- ఫస్ట్‌లాంగ్వేజ్‌ పేపర్‌ 2, 
👉 మార్చి26- సెకండ్‌లాంగ్వేజ్‌, 
👉 మార్చి27- ఇంగ్లీష్‌ పేపర్‌ 1, 
👉 మార్చి28- ఇంగ్లీష్‌ పేపర్‌ 2, 
👉 మార్చి30- గణితం పేపర్‌ 1, 
👉 మార్చి31- గణితం పేపర్‌ 2, 
👉 ఏప్రిల్‌ 01- సైన్స్‌ పేపర్‌ 1, 
👉 ఏప్రిల్03- జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2, 
👉 ఏప్రిల్04- సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1,
👉 ఏప్రిల్06- సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2,
👉 ఏప్రిల్ 07- సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌ భాషలకు, 
👉 ఏప్రిల్ 08- ఒకేషనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

Rc.No.D2/2439: Social welfare-Post Matric scholarship

Post Matric scholarship
-sanctions pending up to 2018-19-Arrear bills-instructions-regarding Rc.No.D2/2439: Social welfare.

👇👇




RPS 2015 pay fixation ఎవరికన్నా ఇంకా చేయకపోతే వారికి జనవరి 31 2020 లోపు Fixation చేయమని ఉత్తర్వులు

RPS 2015 pay fixation ఎవరికన్నా ఇంకా చేయకపోతే వారికి జనవరి 31 2020 లోపు Fixation చేయమని ఉత్తర్వులు.....
👇👇


కవి జ్యోతి బిరుదాంకితులుశ్రీ B.వెంకట్రావు గారికి సన్మానం

కలిదిండి మండల కవి జ్యోతి బిరుదాంకితులు ZPHS ఆరుతెగలపాడు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అయినటువంటి శ్రీ B.వెంకట్రావు గారు జాతీయ స్థాయిలో ఉత్తమ కవి అవార్డ్ స్వీకరించిన సందర్భంగా  వారికి PRTU కలిదిండి శాఖ పక్షాన సన్మానం చేస్తున్న కలిదిండి ప్రధాన కార్యదర్శి సనకా శ్రీనివాస్,జిల్లా కౌన్సిలర్లు నర్రా వేణుగోపాల్,బొప్పన శ్రీనివాస్ మరియు హై స్కూల్ బృందం.
👇👇
వెంకట్రావు గారి కవిత
👇

CLICK HERE TO DOWNLOAD KAVITHA








AMMAVODI ELIGIBLITY CONDITIONS

AMMAVODI ELIGIBLITY CONDITIONS

👇👇

PRTU KALIDINDI TEACHERS INFO FESTIVAL ADVANCE APPLICATION

కలిదిండి మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఫెస్టివల్ అడ్వాన్స్ కావాలనుకునే వారు త్వరగా MRC లో MIS సత్య కు తెలియచేయగలరు.


NOTE:

2006,2008,2012,2014 DSC SGT లు మాత్రమే అర్హులు

Friday, 3 January 2020

HM ATTENDANCE DECLARATION FOR AMMAVODI

HM ATTENDANCE DECLARATION FOR AMMAVODI

👇👇


*National voters day; constituency wise competitions

National voters day; constituency wise competitions on 22nd January

👇👇

CLICK HERE TO DOWNLOAD COPY

అమ్మఒడి రేషన్ కార్డు డిక్లరేషన్

అమ్మఒడి రేషన్ కార్డు డిక్లరేషన్


అమ్మఒడి ఆధార్ కార్డు డిక్లరేషన్

అమ్మఒడి ఆధార్ కార్డు డిక్లరేషన్

Time -Table for syllbus revision & Tests conducting... to 10th students..

Time -Table for syllbus revision  & Tests conducting... to 10th students..

👇👇

CLICK HERE TO DOWNLOAD COPY

AP MDM App Updated Version:2.47

AP MDM App Updated Version:2.47

ఈ update లో గతంలో వలే భోజనం వడ్డించే సమయం, రుచికి సంబంధించిన వివరాలు మరలా పెట్టడం జరిగింది.

👇👇👇


CLICK HERE TO DOWNLOAD MDM APP

Conduct of admission test into VI class in AP Model Schools

Conduct of admission test into VI class in AP Model Schools

A.P.Secondary Educational Society - Model Schools –Conduct of admission test into VI class in AP Model Schools during the academic year-2020-2021 – Programme Schedule & detailed order

👇👇

CLICK HERE TO DOWNLOAD COPY

Thursday, 2 January 2020

మండల విద్యాశాఖ అధికారులు మరియు ఎం‌ఆర్‌సి సిబ్బంది అందరికీ అమ్మ ఒడి పథకం సూచన

మండల విద్యాశాఖ అధికారులు మరియు  ఎం‌ఆర్‌సి సిబ్బంది అందరికీ అమ్మ ఒడి పథకం సూచన.
అమ్మ ఒడి పథకం కింద రెండు , మూడవ జాబితాలో వచ్చిన తల్లి  లేదా సంరక్షకుని  వివరాలు క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా పంపించినవి.  వాటిని ఎవరైనా ఈ పథకం కింద అర్హులమని గాని లేదా తమ పేర్లు జాబితాలో చోటు చేసుకోలేదని కానీ, వారి వివరాలలో తగిన ధ్రువపత్రాలను సేకరించి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో 5-1-2020 సాయంకాలం 5 గంటల లోపు అందజేయాలి.
ఈ విధంగా అందజేసిన అర్హులైన ప్రతి ఒక్క తల్లి లేదా సంరక్షకులు ఈ కార్యక్రమం కింద తప్పనిసరిగా లబ్ధి పొందగలరు అని రాష్ట్ర కార్యాలయం తెలియజేసింది.
కాబట్టి జనవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు మన౦ వివరాలు అప్లోడ్ చేయుటకు  తుది సమయం . కాబట్టి ప్రతి మండల విద్యాశాఖ తమ పరిధిలోని  సిబ్బందితో సమన్వయం చేసుకొని ఈ తదుపరి కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేసి మరియు అప్లోడ్ చేయవలసి ఉన్నది. 
రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన జగన్ అమ్మ ఒడి అర్హతలు దారిద్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లి లేదా సంరక్షకులు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు ఎకౌంటు మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ కలిగి ఉండాలి .
తెల్ల రేషన్ కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద లేదా అర్హత కలిగిన కుటుంబాలకు చెందినవారు అవునో కాదో ఆరు అంకెల పరిశీలన ద్వారా అర్హతను నిర్ణయించి కూడా లబ్ధి చేకూరుతుంది.
స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలలో చదువుతున్న ఆడపిల్లల మరియు వీధి బాలలకు ఈ పథకం వర్తిస్తుంది .
అర్హత కలిగిన తల్లుల లేదా సంరక్షణ పిల్లల కనీస హాజరు డెబ్భై అయిదు శాతం పరిశీలించి ధృవీకరించు కావాల్సి ఉంటుంది.
ఒక తల్లి కి ఎంతమంది పిల్లలు ఉన్నా తో సంబంధం లేకుండా ఏ తల్లిని లేదా సంరక్షకుని మాత్రమే లబ్ధిదారులుగా గుర్తిస్తారు . 
కొత్త రేషన్ కార్డు పొందడానికి నూతన అర్హతలు అమ్మవొడికి కూడా ఉంటాయి.  అవి క్రింది విధంగా ఉన్నాయి .
ఆదాయ పరిమితి : నెలవారి ఆదాయం గ్రామాలలో  10000,  అర్బన్ ప్రాంతాల్లో 12,000.
కుటుంబం యొక్క మొత్తం ల్యాండ్ హోల్డింగ్ (భూమి కలిగి ఉండటం) : ( ఈ రాష్ట్రం మొత్తం ఒకే క్రైటీరియా తీసుకోబడుతుంది) :  మాగాణి భూమి మూడు ఎకరాలు కన్నా తక్కువ ఉండాలి,  మెట్ట భూమి 10 ఎకరాలు కన్నా తక్కువ ఉండాలి,  ఈ రెండూ కలిపి కూడా 10 ఎకరాలు కన్నా ఎక్కువ ఉండరాదు.
ఎలక్ట్రిసిటీ వినియోగం (విద్యుత్ వినియోగం):  ఒక కుటుంబము యొక్క విద్యుత్ వినియోగం 6 నెలల  యావరేజ్ గా తీసుకున్నప్పుడు నెలకు  300 యూనిటీ ల కన్నా తక్కువ ఉండవలెను .
అన్ని ప్రభుత్వ  ఉద్యోగస్తులు మరియు పెన్షనర్స్ కు ఈ పథకం వర్తించదు.
నాలుగు చక్రాల వాహనం ఉన్న వారికి ఈ పథకం వర్తించదు.
ఈ పథకంలో టాక్సీ ట్రాక్టరు మరియు ఆటో ఉన్నవారిని మినహాయింపు ఉంటుంది .
ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు.
మున్సిపల్ ఏరియాలో 750 స్క్వేర్ ఫీట్  కన్నా తక్కువ ఆస్తి కలిగి ఉన్నవారికి మాత్రమే పథకాన్ని కూడా వర్తిస్తాయి.
కొత్త రేషన్ కార్డు నిమిత్తము  కుటుంబాలకి అర్హత ఉద్దేశించబడింది అవే అమ్మ ఒడి పథకానికి కూడా వర్తిస్తాయి.
List-2 required re verification లో supporting documents తీసుకోనే విధానము :
List-2&3ల లో ఏవైనా grievances ఉంటె 04.01.2020 సాయంత్రము 5 లోపు MRC లో submit చేయవలెను. ఆ తరువాత వచ్చినవి అనుమతించబడవు. కావున ఏ రోజుకారోజు grievances MRC లో submit చేయవలెను
ఏ ఏ కారణముకి ఏమి జత చేయాలో చూడండి.
1. Electricity ఎలక్ట్రిసిటీ వినియోగం (విద్యుత్ వినియోగం):  : ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నవి. అవి
a) service no. వారికి సంబందించినదే కానీ అంత వాడకము లేదు: ఈ case లో ఆ service no. తో ఉన్నటువంటి చివరి 6 నెలల current బిల్లుల xerox లేదా AE గారి సంతకము గల నివేదిక కాని జత చేయాలి. 
b) service no. వారికి సంబందించినదే కాదు: ఈ case లో service no. వీరి కుటుంబముకి చెందినది కాదు అని AE గారు certify చేసినది జత చేయాలి. అసలు కరెంట్ లేకపోతే సంబంధిత అధికారి నుండి కనెక్షన్ లేదనే ధృవీకరణ పత్రము అప్లోడ్ చేయాలి.
2. Ration Card లేదు: ఈ case లో లబ్దీదారుకి ration card లేదు అని ఆ గ్రామ VRO గారు certify చేసినది జత చేయాలి.
3. Student Aadhar లేదు: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
4. Four wheeler: ఈ case లో చూపించబడిన number గల వాహనము వీరిది కాదు అని సంబందిత అధికారి (RTO/MVI) certify చేసినది లేదా (ఈ లిస్ట్ లో టాక్సీ ట్రాక్టరు మరియు ఆటో ఉన్నవారిని వివరాలు ఉంటే ఆ వాహనం నంబరు ఫోటో తీసి ) లేదా online లోని నివేదిక తో పాటుగా self declaration జత చేయాలి. .
5. Govt Employee/ Pensioner: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
6. Land details: ఈ case లో గ్రామములో లబ్దీదారు కుటుంబమునకి wet land: ...….. (విస్తీర్ణము)dry land: ....... (విస్తీర్ణము) ఇంత ఉంది అని సంబందిత VRO గారు certify చేసినది, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము xerox లు(భూమి ఉన్నవారికి మాత్లమే) మరియు మా కుటుంబములో వారికి ఈ గ్రామములలో (గ్రామముల పేర్లు రాయాలి)తప్ప మరెక్కడా భూములు లేవని self declaration. ఇవన్నీ జతచేయాలి.
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అని పొరపాటుగా నమోదుచేస్తే డిక్లరేషన్ మరియు వెరిఫికేషన్ పత్రాలు అప్లోడ్ చేయాలి.  
కావున ఈ విషయములో వెంటనే పై మార్గదర్శకాలు అనుగుణంగా  పని చేయవలసిందిగా కోరుచున్నాము.

జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం




సావిత్రి బాయిపూలే జయంతి జనవరి 3 ను భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆమె గొప్పతనం మనం తెలుసు కోవలసిందే....

మనదేశంలో మొదటి మహిళా  ఉపాధ్యాయురాలు, మహిళలకు మొదటిపాఠశాల స్ధాపించిన, సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే.  

మన రాష్ట్ర ప్రభుత్వం ఈమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభకల ఉత్తమ ఉపాధ్యాయినల సత్కారం  ఏర్పాటుచేయడం  ముదావహం.

అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, మనువాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా  పాఠశాలలు ప్రారంభించి,12 మే 1848న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించిన సంస్కర్త సావిత్రిబాయి ఫూలే  .

ఈమె భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి.

 ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య.

 కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.

 ఆమె ఆధునిక విద్య  ద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి  భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.

కుల వ్యవస్థకు వ్యతిరేకంగా,
పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల, 
అస్పృశ్యుల, 
మహిళల 
సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ  సామాజిక  బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. 

నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు.

 సావిత్రి బాయి మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో 1831 జనవరి 3 న జన్మించింది. ఆమెది రైతుకుటుంబం. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లా లో బోధన్ నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో , అదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. 

బోధన్ ప్రాంతపు మున్నూరు కాపులు వీరికి చుట్టాలు. 

సావిత్రి బాయి తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలెను 1840లో వివాహమాడారు. ఆ దంపతులకు స్వంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు) ను దత్తత తీసుకున్నారు.

సావిత్రి బాయి "జ్యోతీరావు ఫూలె" ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. 

సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. 

కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారు. 

1848 లోనే దేశంలొ విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళ ఉపాద్యాయురాలు , దళితుల, స్త్రీల విద్యా  వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. 

వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది.

ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీబాయి దంపతులను గృహ బహిష్కారానికి గురిచేశారు. 

ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘన్ని కూడా స్థాపించింది. 

జెండర్‌ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. 

మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే. అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో "సత్యాన్ని" శోధించడానికి 1873 లో తన భర్త మహత్మా పూలేతో కలసి "సత్యశోధక్ సమాజ్ "ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూడనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేఖంగా మరియు వితంతువు పునఃర్వివాహల కొరకు అసమాన బ్రాహ్మనిజ వ్యవస్థకు వ్యతిరేఖంగా బలమైన ఉధ్యమం నడిపారు.

 బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు.

 గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దేవదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు.యశ్వంత్ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు.

 వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. 

తరువాత 1873 సెప్టెంబరు 24న ‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యసోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈసత్యసోధక్‌ సమాజ్‌ మహిళా విభాగం సావిత్రీబాయి నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ కార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 

1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యసోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యన సావిత్రీబాయి వివాహం జరిపించారు.

1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 

1870లో ఒకసారి 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం. కరువువాతపడిన కుటుంబాలలోని  అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు.

 తమ పాటశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించినారు. 

సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 

1854లోనే ఆమె తన కవితాసంపుటి ‘కావ్యఫూలే’ను ప్రచురించింది. 

మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుభోధ్‌ రత్నాకర్‌’ను 1891లో ప్రచురించింది. 

ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తకరూపంలో వచ్చాయి.

జ్యోతీరావుపూలే. 1890 నవంబరు 28న మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. 

ఈ దుఃఖంలోనుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది. 

ఫూలే మరణాంతరం సత్యసోధాక్ సమాజ్ భాద్యతనీ స్వీకరించి నడిపించింది.

 1897 లో ప్లేగు వ్యాధి, పూణేనగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రీబాయి పూలే కొడుకు యశ్వంత్ తోకల్సి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు 1897 లో కబళించింది. 

ఆమె దత్తపుత్రుడు యశ్వంత్‌ అంత్యక్రియలు జరిపించాడు.

 సావిత్రి బాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలతో.....

అమ్మ ఒడి పధకం వారోత్సవాలు

అన్ని పాఠశాలల్లో అమ్మ ఒడి పధకం ప్రారంభం ను పండుగ వాతావరణం లా చేయాలి

👇
CLICK HERE TO DOWNLOAD COPY

AMMAVODI NOT ELIGIBLE FOR CONTRACT OUTSOURCING EMPLOYEES



✍ *SSA లో నెలకు ₹ 12000/- మించి తీసుకుంటున్న కాంట్రాక్ట్ & అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు.... అమ్మవడి కి అర్హతలేదని ఉత్తర్వులు..

NEW...TLM..తయారీ వీడియోలు

*NEW...TLM..తయారీ వీడియోలు...*

👉 *తికమక పదాలు* TLM

https://youtu.be/mA0rt42GsLc

👉 *ఎటు చదివినా ఒకేలా వచ్చే పదాలు* TLM

https://youtu.be/q8eIx0X2G8o

👉 *మొక్కలు& జంతువులు నుండి లభించేవి* TLM

https://youtu.be/2QJ8Nuosv9g

👉  *అగ్గిపుల్లలతో బొమ్మలు | MATCH STICKS PICTURES* TLM

https://youtu.be/2q6wZcTSXWo


👉 *వ్యతిరేక వాక్యాలు* TLM

https://youtu.be/lDs7x2UHV4c

👉 *మన పండుగలు* TLM

https://youtu.be/YR-nUl8JDyU

👉 *వారముల పుష్పము* TLM

https://youtu.be/6qJ1gv3RE5g

👉  *Photo frame with papers* TLM

https://youtu.be/e69eIkXWooY


అమ్మ ఒడి వారోత్సవoRc.242,Dt.2/1/2020

అమ్మ ఒడి వారోత్సవo

అమ్మ ఒడి ని విద్యా సంస్థల్లో అమలుపరుచుట పై CSE వారి సూచనలు..రోజూ వారి షెడ్యూల్.. Rc.242,Dt.2/1/2020

👇👇

CLICK HERE TO DOWNLOAD COPY

Festival Advance Application and instructions

Festival Advance Application and instructions

DSC2006,2008,2012,2014 ఉపాద్యాయులు మాత్రమే అర్హులు
12సంవత్సరాల స్కేల్ తీసుకున్నవారు అర్హులు కారు.
7500 రూపాయలను ఫెస్టివల్ అడ్వాన్స్ కింద ఇస్తారు.ఈ మొత్తాన్ని నెలకు 750 రూపాయల చొప్పున 10 సమాన వాయిదాలలో మన జీతం నుండి DEDUCT చేస్తారు

FESTIVAL ADVANCE కావాలి అనుకునే వారు ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్ ను MRC కి పంపవలసి ఉంటుంది.
ఫెస్టివల్ అడ్వాన్స్ ను ఏ ఫెస్టివల్ కైనా పొందవచ్చు.
కానీ డిసెంబర్ లో తీసుకుంటే జనవరి జీతం నుండి 750 కటింగ్ పెట్టడం సులువు అగుతుంది.
కనుక FESTIVAL అడ్వాన్స్ కావాలి అనుకునే వారు MRC కి వెంటనే ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్ ను పంపగలరు.
సంక్రాంతి తీసుకుందాము అని అనుకోవద్దు.ఎందుకంటే సంక్రాంతి కి ముందు కొన్ని హాలిడేస్ STO వారికి కూడా ఉంటాయి.సంక్రాంతి పండుగ తరువాత పండుగ ఐపోయింది అని బిల్ PASS చేయని సందర్భాలు చాలా ఉన్నాయి.
వెంటనే ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్ ను MRC కి పంపించిన డిసెంబర్ లోనే బిల్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.లేట్ చేసిన నష్టపోయేది మనం మాత్రమే.
ఈ క్రింద అప్లికేషన్ పిడిఎఫ్ ఫైల్ ను ఇవ్వడం జరుగుతుంది. ప్రింట్ అయిన కానీ, ఒక లెటర్ నందు చూసి రాసి అయిన అప్లికేషన్ ను త్వరితముగా MRC కి పంపుకోగలరు

👇👇👇

CLICK HERE TO DOWNLOAD COPY

Toilet Maintenance Charges శానిటరీ వర్కర్స్ ప్రొఫార్మా

Toilet Maintenance Charges
శానిటరీ వర్కర్స్ ప్రొఫార్మా
➡HS-Rs.4,000/- per month (Rs.2,500/- Honorarium + Rs.1,500/-Material Cost)

➡UPS-Rs.2500/- per month (Rs.1,500/- Honorarium + Rs.1,000/-Material Cost)

➡PS-Rs.2000/- per month (Rs.1,200/- Honorarium + Rs.800/-Material Cost)

👇👇
CLICK HERE TO DOWNLOAD COPY

*Ammavodi district help desk numbers.*

Ammavodi district help desk numbers.

👇👇

మన బడి నాడు నేడు CRP, HM ల పాత్ర, వారికి ఆదేశాలు

మన బడి నాడు నేడు CRP, HM ల  పాత్ర, వారికి ఆదేశాలు*
*👉మన బడి నాడు నేడు లో రాయాల్సిన రెజిస్టర్స్...తీర్మానాలు⤵*
*👉Rc.19, Dt.2/1/2020*
〰〰〰〰〰〰〰〰
*File No.ESE02/563/2019-CIVIL SEC-SSA*
*☸ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ*
*✳సర్క్యూలర్.నెం. ఎంబిఎస్ఎన్/19-20/2, తేది: 2-1-2020*
〰〰〰〰〰〰〰〰
*విషయము:* మనబడి: నాడు- నేడు; సి.ఆర్.పిలు మరియు ప్రధానోపాధ్యాయుల పాత్ర గురించి - ఆదేశాలు జారీ.

*నిర్దేశములు:* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వారి ఉత్తర్వులు నెం. 87, తేది:30-11-2019.

          పైన పేర్కొనబడిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము 'మనబడి: నాడు – నేడు' అనే ప్రభుత్వ ప్రాధాన్యత గల కార్యక్రమం మన రాష్ట్రంలో అమలు జరుగుచున్నది. దీనికి సంబంధించి ఒక వినూత్న పద్ధతిలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ద్వారా పనులు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ప్రధాన పాత్ర వహించాల్సి ఉంటుంది. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చురుగ్గా పాల్గొనాలంటే వారిని ప్రేరేపించడం (Motivation) మరియు వారిని సౌలభ్యం (Facilitate) చేయడం అనేవి విద్యాశాఖ నుండి మనం చేపట్టాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలు నిర్వహించుటలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు క్లస్టర్ రిసోర్సు పర్సన్లు ముఖ్య బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీరిద్దరూ ఈ క్రింది విధులు నిర్వహించాల్సి ఉంటుంది..
1. ప్రతి పాఠశాలలోని తల్లిదండ్రుల కమిటి వారానికి ఒకరోజు (అనుకున్న రోజు, అనుకున్న సమయానికి) తప్పకుండా సమావేశం నిర్వహించుకోవాలి. దీనికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయలు మరియు సీఆర్పీలు తప్పకుండా హాజరు కావాలి.

2. ప్రధానోపాధ్యాయులు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యుందరికీ ఫోన్లు చేసి, వారు ప్రతి వారం తప్పకుండా సమావేశం జరిగేలా బాధ్యత వహించవలెను.

3. ఆ సమావేశంలో తగు విషయాలను అంశాలను చర్చించి ప్రజాస్వామ్యయుతంగా అందరు కమిటీ సభ్యులు కలిసి నిర్ణయాలు తీసుకునేటట్లు సీఆర్పీ సులభతరం (Facilitation) చేయాలి.

4. ఆ సమావేశానికి గ్రామ/వార్డు సచివాలయం నుండి ఇంజినీర్ సహాయకుడు, సంక్షేమ విద్యా సహాయకులు తప్పకుండా హాజరు అయ్యేటట్లు చూసుకోవాలి..

5. మండల స్థాయిలో మండల విద్యాశాఖాధికారి గారు, పట్టణ ప్రాంతాలలో సంబంధిత డిప్యూటీ ఇన్స్పెక్టర్ /మండల విద్యాశాఖాధికారి/ సీఆర్పీలు హాజరు అయ్యే టట్లు పర్యవేక్షించాలి.

6. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ వారు ఎలాంటి కాంట్రాక్టరుకు పనులను కట్టపెట్టకుండా ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు చూసుకోవాలి. బినామీ కాంట్రాక్టర్ ద్వారా పనులు జరగకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రధానోపాధ్యాయులదే.

7. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఖర్చు పెట్టిన వివరాలు అన్ని కూడా 'మనబడి: నాడు-నేడు' లెక్కల పుస్తకాలలో వ్రాయాలి. ఈ లెక్కల పుస్తకాలు గ్రామ/వార్డు సచివాలయ సంక్షేమ విద్యా సహాయకులతో వ్రాయించాలి. ఒక వేళ ఆ పోస్టులో ఎవరు లేకపోతే సీఆర్పీలు ఆ లెక్కలు వ్రాయాల్సి ఉంటుంది.

8. మన బడి: నాడు-నేడు' కార్యక్రమానికి సంబంధించి ఈ క్రింది పుస్తకాలు వ్రాయాలి.
(i) మీటింగ్ మినిట్స్
(ii) నగదు పుస్తకం
(iii) సాధారణ లెడ్జర్
(iv) చెల్లింపు వోచర్
(V) రశీదు పుస్తకము
(vi) స్టాక్ నమోదు- పంపిణీ రిజిస్టర్

9. సీఆర్పీ మరియు ప్రధానోపాధ్యాయులు క్షేత్రస్థాయి ఇంజినీరు సహాయంతో తాపీ మేస్త్రీ , రంగులు వేసే మేస్త్రీ , కరెంట్ మేన్, ఫ్లోరింగ్ మేస్త్రీ , శానిటరీ మేస్త్రీ , ప్లంబింగ్ మేస్త్రీ  మొదలగు వారితో గంపగుత్త రేటు మాట్లాడటంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీకి సహాయపడాలి. మేస్త్రీ లతో రేటు మాట్లాడినప్పుడు ఒక పేజీ ఒప్పంద పత్రము తయారు చేసుకోవడానికి పాఠశఆల తల్లిదండ్రుల కమిటీకి సహాయం చేయాలి.

10. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ వారు కేంద్రీయ సరఫరా(central procurement) పద్ధతిలో ఫర్నీచర్, ఫ్యాన్లు, కమొడ్లు, ఆకుపచ్చ బోర్డులు వంటివి ఇండెంట్ తయారు చేయడానికి, దానిని కంప్యూటర్ ద్వారా పంపించడానికి ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి.

11. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ వారు కొన్న వస్తువులు లేక కేంద్రీయ సరఫరా (central procurement) ద్వారా వచ్చిన సామగ్రి/ వస్తువులు చాల జాగ్రత్తగా పాఠశాల ఆవరణలో భద్రపరచడంలో ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి. సామగ్రి భద్రపరచడంలో క్షేత్ర స్థాయి ఇంజినీర్ బాధ్యత ఉండదు.

12. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ నిర్మాణ వస్తువులు/సామగ్రి కొనడానికి మార్కెట్ కు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సీఆర్పీ గాని ప్రధానోపాధ్యాయుడు కాని ఎవరో ఒకరు తప్పకుండా వెళ్లవలెను.

13. మనబడి' అనే భావజాలంను, 'మన బడి ఒక పవిత్ర స్థలం' అనే భావజాలాన్ని పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు, ఇంజినీరుకు, తల్లిదండ్రులకు, టీచర్లకు, ప్రధానోపాధ్యాయులకు, సీఆర్పీలకు, గ్రామ/వార్డు సచివాలయం సిబ్బందికీ ఇలా ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగేటట్లుగా చేయడంలో ప్రధానోపాధ్యాయులు మరియు సీఆర్పీలు ముఖ్య పాత్ర పోషించవలెను.

14. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యుల మధ్య సఖ్యత ఉండేట్లు, వారిలో ఏమైనా బేధాభిప్రాయాలు వచ్చినట్లయితే వాటిని పరిష్కరించే బాధ్యత సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలి.

15. ఇంజినీర్ పాఠశాలకు వచ్చినపుడు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులను సమావేశపరిచి, పాఠశాలలో అందరు తిరిగి ఏమేమి కావాలో గుర్తించి ఇంజనీర్ అంచనాను తయారు చేసేట్లు ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు బాధ్యత తీసుకోవాలి.

16. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు , క్షేత్రీయ ఇంజనీర్, గ్రామ/వార్డు సచివాలయ ఇంజనీర్, సంక్షేమ విద్యా సహాయకులు, ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీ అందరూ ఒక బృందంలా తయారు కావాలి.

17.  పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు, తల్లిదండ్రులకూ ఖర్చు పెట్టిన ప్రతి పైసా కూడా లెక్క తెలిసేటట్లుగా సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి.

18. చివరగా పాఠశాల పనులను త్వరితగతిన చేయడంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులను సంస్థాగతంగా నడిపించి వారితో పాఠశాల పనులను పూర్తి చేయడంలో సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు ప్రధాన పాత్ర వహించాలి.

       పైన తెలిపిన మార్గదర్శకాలు అమలయ్యేటట్టుగా సంబంధిత మండల విద్యాశాఖాధికారి, డిప్యూటీ ఇన్స్పెక్టర్,
జిల్లా ఉపవిద్యాశాఖాధికారులు, అదనపు ప్రాజెక్ట్ అధికారి (సమగ్రశిక్షా), జిల్లా విద్యాశాఖాధికారులు అందరూ తగిన శ్రద్ధ తీసుకొని నిరంతరం పర్యవేక్షించి 'మన బడి: నాడు-నేడు' కార్య క్రమాన్ని విజయవంతం చేసి మన పిల్లలకు అద్భుతమైన పాఠశాల ఆవరణను, సౌకర్యాలను అందజేయాలని అందరినీ కోరుతున్నాను.

వాడ్రేవు చినవీరభద్రుడు
కమిషనర్, పాఠశాల విద్యాశాఖ (పూ.ఆ.బా)

రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులందరికీ (ఇట్టి నకలు ప్రతిని ప్రధానోపాధ్యాయులకు. సీఆర్పీలకు, మండల విద్యాశాఖాధికారులకు, ఉప విద్యాశాఖాధికారులకు పంపవలెను.)

ఈ సర్క్యూలర్ ను ఈ కింది వారికి సమర్పించడమైనది
1. పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారికి
2. ప్రభుత్వ సలహాదారు (మౌలిక సదుపాయాలు) వారికి,👇👇 
CLICK HERE TO DOWNLOAD COPY

కృష్ణాజిల్లాలో ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు

కృష్ణాజిల్లాలో ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు

రిజర్వేషన్లను ప్రకటించిన జిల్లా కలెక్టర్  ఇంతియాజ్

👇

CLICK HERE TO DOWNLOAD GRAMA PANCHAYAT LIST

👇

CLICK HERE TO DOWNLOAD ZPTC LIST

👇

CLICK HERE TO DOWNLOAD MPTC LIST

NOTE BOOKS ENTRY

ALL HMs ARE INFORMED THAT N.T.BOOKS GROUND BALANCE REPORT SUBMIT YOUR SCHOOL LOGINS IMMEDIATELY   MEO, KALIDINDI.

👇👇
CLICK HERE TO LOGIN

Sanction of Maternity Leave to the Outsourcing and Contract Married Women Employees

 Sanction of Maternity Leave to the Outsourcing and Contract Married Women Employees-Revised Government Ordres on Maternity Leave. Rc.No.241/SPMU-NHM/2019, Dated: 28-12-2019





సోషల్ స్టడీస్ మోడల్ పేపర్స్

సోషల్ స్టడీస్ మోడల్ పేపర్స్ 
📗📗📗📗📗📗📗📗
👉DCEB  విజయనగరం జిల్లా మోడల్ పేపర్స్ పేపర్ 1 మరియు పేపర్ 2 ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియాలో ఇవ్వడం జరిగింది, అందరూ ఉపయోగించుకోవాలని కోరుచున్నాం, 
🙏🙏🙏🙏🌹🙏🙏🙏
               మీ 
  ఏపీ ఎస్ ఎస్ టి ఎఫ్
 సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు సంక్షేమమే 
 మన అందరి సంక్షేమం. 
👇👇
CLICK HERE TO DOWNLOAD (T M) PAPER

👇👇
CLICK HERE TO DOWNLOAD (E M) PAPER

Wednesday, 1 January 2020

తెలుగు లో 100 ఉత్తమ పుస్తకాలు

తెలుగు లో 100 ఉత్తమ పుస్తకాలు

మీకు కావలసిన పుస్తకం ను క్లిక్ చేయండి

👇👇👇👇👇

CLICK HERE TO DOWNLOAD BOOKS

   


*GIS LATESTGO MS 2, Revised Rate of Interest (@7.9%p.a

*GIS GO MS 2, Revised Rate of Interest (@7.9%p.a 
w.e.f 01-07-2019 to 30-09-2019 on Accumulated Savings Fund Communication of 
Tables of Benefits for Savings Fund for the Period from 01-01-2019 to 30-09-2019*
*– Revised Tables – Order–Issued
👇👇

CLICK HERE TO DOWNLOAD COPY

2020 జనవరి నెలలో వచ్చే రేడియో పాఠాలు

*విందాం - నేర్చుకుందాం*
    
 *2020 జనవరి నెలలో వచ్చే రేడియో పాఠాలు*

👉 *02.01.2020 - శక్తి, 5వ (EVS)*

👉 *03.01.2020  -  వృధా చేయం, 5వ, తెలుగు.*

👉 *06.01.2020  -   మనసుంటే మార్గం ఉంది•(5వ,తెలుగు)*

👉 *07.01.2020 -  లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఫన్ (1 &2, తరగతులు)*

👉 *08.01.2020  -  మన ఊరు- మన చెరువు(4వ, EVS)*

👉 *09.01.2020  -  ఆడుకుందాం (3వ, EVS)

 *10.01.2020 నుంచి 20.01.2020 వరకు సంక్రాంతి సెలవులు)*

👉 *21.01.2020  -బొమ్మ గుర్రం(4వ,తెలుగు)*.

👉 *22.01.2020  -   మన దేశం-మన  ప్రపంచం(5వ,EVS)*.

👉 *23.01.2020. -  టిటిపి(TTP)*

👉 *24.01.2020  -   అమరికలు*

👉 *27.01.2020  -  పల్లె చిత్రం*

👉 *28.01.2020  -  ఇది ఎంత పొడవుంది*

👉 *29.01.2020 - టిటిపి*

  👉 *30.01.2020  -     ఆణిముత్యాలు*

*👉 31.01.2020  - LERN ENGLISH IS FUN*

🅰అమ్మఒడి - జాబితాలు🅿

*🅰అమ్మఒడి - జాబితాలు🅿*

1⃣ *అర్హుల జాబితా*

*🔹White ration card , Adhar card , Bank account IFSC code తో పక్కాగా ఉండాలి. ఇలా అన్ని సక్రమంగా ఉన్నవారికి మాత్రమే పథకం పొందే అర్హత ఉంటుంది. ఇది మొదటి జాబితా.* 
*ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వీరికి అమ్మఒడి వర్తిస్తుంది.*

2⃣ *With held జాబితా* 

*🔹ఈ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగుల, Tax పేయర్ల పిల్లలు వస్తారు.*
*వీరికి అమ్మఒడి సాయం వర్తించదు*
*సామాజిక తనిఖీల్లో అనర్హత జాబితాల కింద వీరిని ప్రక్కన పెడతారు*

3⃣ *Request for reverification జాబితా* 

*🔸దరఖాస్తు సమయంలో white ration card ,Adhar card,  Bank account పక్కాగా జతచేయకపోవడం వంటి తప్పులు చేసినవారు ఇందులో ఉంటారు.*
*వీరు white rationcard, Adhar, Mother bank account వివరాలు సచివాలయంలో అందజేస్తే దరఖాస్తు సరిచేస్తారు*

*ఈ ప్రక్రియ జనవరి 1 వరకు కొనసాగుతుంది*
*జాబితాలో తప్పు పడిన పేర్లు , చిరునామాలు ఈ దశలో సరిచేస్తారు.*
*వీరిని మొదటి అర్హుల జాబితాలో చేర్చుతారు.*


*🔸గ్రీవెన్స్ సెల్ జనవరి 1 తో పూర్తవుతుంది. అనంతరం గ్రామ సచివాలయం యూనిట్ గా ఐదు రోజులపాటు సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. అర్హుల పేర్లు తప్పినా, అనర్హుల పేర్లు చేరినా , అక్రమాలు చోటుచేసుకున్న సామాజిక బృందాలు సరిచేస్తాయి.*

*🔹జనవరి 4 నాటికి తుదిజాబితాలు సిద్ధంఅయ్యే అవకాశాలు ఉన్నాయి.*

*🔸జనవరి 9 నుంచి అమ్మఒడి పథకం నగదు బ్యాంకు ఖాతాల్లో విడతలుగా జమ చేస్తారు*

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...