Blog Archive

Thursday, 26 December 2019

నాడు నేడు జాయింట్ అకౌంట్

 *నాడు.. నేడు* Joint Account opening కి కావలసినవి.

▪️ 3 ఫొటోలు(ప్రతి ఒక్కరికి)
▪️ SMC ఎన్నిక తీర్మానం copy.
▪️ ఆధార్ కార్డ్,పాన్ కార్డ్ (Xerox)
▪️5 గురు సభ్యులఎంపిక తీర్మానం - కాపీ.
▪️ నాడు - నేడు -ఎంపిక అయినట్టు  స్కూల్ జాబితా order copy.      

నాడు నేడు యాక్షన్ ప్లాన్

*మన బడి నాడు-నేడు*

*యాక్షన్‌ ప్లాన్‌*

*ఈ నెల 31న మాస్టర్‌ ట్రైనీలతో మండల స్థాయిలో సీఆర్‌పీ, వార్డు,గ్రామ సచివాలయాల్లో కొత్తగా చేరిన వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లకు శిక్షణ ఇస్తారు. అదే రోజున పేరెంట్‌ కమిటీలకు అవగాహన కల్పిస్తారు.*

*🔹జనవరి 5లోగా అంచనాలు సిద్ధమవ్వాలి. వాటి సాంకేతిక అనుమతి కోసం రిపోర్టు డీఈవోకు పంపాలి. వాటిని పరిశీలించాక పరిపాలనా ఆమోదం కోసం ఫైల్‌ కలెక్టర్‌కు వెళ్తుంది. అదే రోజున కలెక్టర్‌ వాటికి అనుమతి ఇస్తారు.*

 *🔸జనవరి 5 నాడు పథకానికి సంబంధించి బ్యాంకు ఖాతాలు తెరవాలి. పాఠశాల హెచ్‌ఎం, పేరెంట్‌ కమిటీ చైర్మన్‌, మరికొందరి సభ్ల్యులతో ఖాతాలు ప్రారంభించాలి. వాటిని ఎస్‌టీఎంఎస్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి.*

*🔸జనవరి 8న పనుల ప్రారంభానికి అవసరమైన అంచనా విలువలో 15 శాతం నిధులు తీసుకోడానికి పేరెంట్‌ కమిటీ తీర్మానం చేయాలి.*

 *🔹10న సంబంధిత ఇంజనీరింగ్‌ శాఖల ఈఈలతో పేరెంట్‌ కమిటీలు ఒప్పందం చేసుకోవాలి. అదే రోజున పనులు ప్రారంభించాలి.*

నాడు నేడు కార్యక్రమం


నాడు నేడు కు ఎంపికైన స్కూల్స్ నిధుల జమ చెల్లింపు ల కోసం కొత్తగా అకౌంట్ తీసుకోవాలి* దీనికి గాను అవసరమయ్యే *కవరింగ్ లెటర్ ను మీ స్కూల్ డైస్ కోడ్ తో* ఈ క్రింది లింక్ నుండి పొందండి. ఎం.ఈ.ఓ కౌంటర్ సైన్ తో, కౌంటర్ సైన్ లేకుండా రెండు రకాలుగా లెటర్ ను ప్రింట్ తీసుకోవచ్చు.
http://projects.ednforum.com/school/nadunedu.php

NPR NRC DETAILS

NPR, NCRకి తేడా ఏంటి? జనగణన ఎలా చేస్తారు? పూర్తి వివరాలు

❇దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై దుమారం రేగుతోంది. పలు చోట్ల కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. NPRని తెరపైకి తెచ్చి, అందుకోసం రూ.3,900 కోట్ల బడ్జెట్ కేటాయిచింది. ఐతే అసోం NRCని చేపట్టిన కేంద్రం.. త్వరలోనే దేశ వ్యాప్తంగా అమలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. NRC ప్రక్రియలో NPR తొలి అడుగు అని చాలా మంది భావిస్తున్నారు. ఎన్‌పీఆర్ ఆధారంగా ఎన్‌ఆర్‌సీ రూపొందించి.. దేశంలో భారత పౌరసత్వం లేకుండా, అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వెళ్లగొడతారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో NPRపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం.

❇దేశంలో నివసిస్తున్న వారందరి జాబితానే NPR. ఇది దేశ పౌరుల లెక్క తేల్చే గణన కాదు.

❇దేశంలో అసలు ఎంత మంది నివసిస్తున్నారే లెక్క తేల్చడమే NPR. ఏదైనా ఒక ప్రాంతంలో ఆర్నెళ్ల నుంచి నివసిస్తున్నవారిని,లేదా రాబోయే ఆర్నెళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఏదైనా ప్రాంతంలో ఉండాలని నిర్ణయించుకున్నవారిని స్థానిక పౌరులుగా గుర్తించి ఇంటి ఇంటికి ఆ వివరాలను సేకరించనున్నారు. మన దేశంలో గత 6 నెలలుగా నివసిస్తున్న విదేశీయుల వివరాలను కూడా ఇందులో నమోదు చేస్తారు. అదే NRCలో కేవలం భారత పౌరులు మాత్రమే ఉంటారు. అందుకే NPRకి NRCతో సంబంధం లేదు.పౌరసత్వ చట్టం-1955, పౌరసత్వం (పౌరుల నమోదు మరియ గుర్తింపు కార్డుల జారీ) నిబంధనలు-2003 ఆధారంగా NPRని రూపొందిస్తారు. దేశంలో ఉండే సాధారణ నివాసితులందరూ NPRలో నమోదు చేయించుకోవాలి.

❇NPR ప్రక్రియ 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఇందులో ప్రజల డెమోగ్రాఫిక్‌తో పాటు బయోమెట్రిక్ డేటాను కూడా సేకరిస్తారు. జనాభా లెక్కలను మునుపటి లాగానే గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సేకరిస్తారు. వారి ఆధార్,మొబైల్ నంబర్,పాన్,డ్రైవింగ్ లైసెన్స్,ఓటర్ కార్డు,పాస్‌పోర్టు వంటి ధ్రువీకరణ వివరాలను సేకరిస్తారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆధార్ వివరాలు ఇవ్వడం,ఇవ్వకపోవడం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సెన్సస్ కమిషనర్ ఈ డేటా బేస్‌ను పర్యవేక్షిస్తుంది.

❇ఎన్ఆర్‌సీ అనేది అధికారికంగా ధ్రువీకరించిన పౌరసత్వ రిజిస్టర్. ఈ జాబితాలో పేరు నమోదైనవారు మాత్రమే దేశ పౌరులుగా పరిగణించబడుతారు. ఐతే NRCలోని పేరులేని వారిని వెంటనే విదేశీయులుగా ప్రకటించరు. న్యాయ పోరాటం చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. తమకు అన్యాయం జరిగిందని భావించిన వాళ్లు ఫారిన్ ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు వినిపించవచ్చు. ట్రిబ్యునల్స్‌లో కేసు ఓడిపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే చివరగా సుప్రీంకోర్టులోనూ కేసు వేయవచ్చు. ఇక అసోంలో ఇటీవల NRC పూర్తి చేసినందున.. అక్కడ మళ్లీ జన గణన చేపట్టరు. NRC సందర్భంగా ఇప్పటికే అక్కడి ప్రజల వివరాలన్నింటినీ సేకరించారు.
2010లో NPR కోసం తొలిసారి డేటా సేకరించారు. 2011 జనాభా లెక్కలో భాగంగా ఈ ప్రక్రియ చేపట్టారు. 2010 NPRలో 15 అంశాల వివరాలను సేకరిస్తే.. ఈసారి మాత్రం 21 డేటా పాయింట్లను సేకరించబోతున్నారు. ఇక గతంలో వేర్వేరు డేటా పాయింట్లుగా ఉన్న తండ్రి పేరు, తల్లి పేరు, భాగస్వామి పేరును క్లబ్ చేసి ఒకే అంశంగా రూపొందించారు. ఈ నేపథ్యంలో ఈసారి కొత్తగా 8 డేటా పాయింట్లు అదనంగా చేర్చారన్నమాట.

1. వ్యక్తి పేరు
2. ఇంటి పెద్దతో బంధుత్వం
3. లింగం
4. పుట్టిన తేదీ
5. వివాహం
6.విద్యార్హతలు
7. వృత్తి
8. తండ్రిపేరు/తల్లి పేరు/దాంపత్య భాగస్వామి
9. పుట్టిన స్థలం
10. ప్రస్తుతం నివాస చిరునామా
11. ప్రస్తుత నివాస చిరునామాలో ఎప్పటి నుంచి ఉంటున్నారు.
12. జాతీయత
13. శాశ్వాత నివాస చిరునామా

14. ఆధార్ కార్డ్ నెంబర్ (వాలంటరీ)
15. మొబైల్ నెంబర్
16. తల్లిదండ్రులు పుట్టిన తేదీ, పుట్టిన స్థలం
17. చివరగా నివసించిన చిరునామా
18. పాస్ పోర్ట్
19. ఓటర్ ఐడీ కార్డ్ నెంబరు
20. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)
21. డ్రైవింగ్ లైసెన్స్

❇ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా NRCని తీసుకోచ్చే ఆలోచన లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దీని గురించి పార్లమెంట్‌లో గానీ, కేబినెట్‌లో చర్చ జరగలేదని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఐతే 2018-19 వార్షిక నివేదికలో మాత్రం దేశవ్యాప్త NRCకి NPRతొలి మెట్టని పేర్కొనడం విశేషం. ఈ నేపథ్యంలో NPRపై చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. NPRపై మరో వివాదముంది. దేశ ప్రజలను లెక్కిస్తామనే సాకుతో, వారి నుంచి వ్యక్తిగత వివరాలను సేకరిస్తారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు ఇటీవల రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, జనాభా కమిషనర్ కొత్త కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధార్, ఓటర్, పాస్‌పోర్టు వంటి కార్డులన్నింటినీ ఒకే కార్డు కిందకు తెస్తామని చెప్పారు. ఈ క్రమంలో NPR ఉద్దేశం.. ఇదేనా అన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి.

❇పౌరసత్వ చట్టం సవరణలపై ఆందోళనలు జరుగుతున్న దృష్ట్యా జనాభా పట్టిక (NPR) రూపకల్పన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్టు కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ప్రకటించాయి. ఐతే ఇలాంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని.. ఇది కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి వస్తుందని కేంద్ర హోంశాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు.

K VIJAYAKUMAR INCOME TAX SOFTWARE

Wednesday, 25 December 2019

KSS PRASAD INCOME TAX SOFTWARE

KRISHNA MDM NEWS

కృష్ణా జిల్లా - మధ్యాహ్న భోజన పథకం – జిల్లా నందుగల అందరు మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయునది  ఏమనగా, కమీషనరు, పాఠశాల విద్యాశాఖ వారు ఆదేశాలను అనుసరించి మధ్యాహ్న భోజన పథకంలో సరఫరా చేస్తున్న కోడిగుడ్ల బిల్లుల చెల్లింపు విధానాన్ని వికేంద్రీకరణ చేయడం జరిగింది.  అదే విధంగా ప్రధానోపాధ్యాయులు కోడిగుడ్డు సరఫరా మరియు వినియోగం నమోదు చేయుటకు వీలుగా ఎం.డి.ఎం యాప్ నందు మార్పులు చేయడమైనది. ఈ అంశాలను సదరు యాప్ ను Update చేసుకొను విదముగా మరియు పాఠశాల స్థాయి వరకు చేరేవిధముగా తగు చర్యలు తీసుకోవలసినదగా తెలియజేయటమైనది. శ్రీమతి యం.వి.రాజ్యలక్ష్మి, డి.ఇ.ఒ., కృష్ణా, మచిలీపట్నం.
USEFUL FOR NO SCHOOL BAG DAY..

పొడుపు కథలు - PODUPU KATHALU



1. ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి.
జ. దీపం
2. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.
జ. నిప్పు
3. ఎందరు ఎక్కిన విరగని మంచం.
జ. అరుగు.
4. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది.
జ.దీపం వెలుగు.
5. ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?
జ. పొగ
6. కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది?
జ. మేఘం
7. తలపుల సందున మెరుపుల గిన్నె.
జ. దీపం
8. తల్లి దయ్యం, పిల్ల పగడం.
జ. రేగుపండు
9. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర
జ. కొవ్వొత్తి
10. ఒకటే తొట్టి, రెండు పిల్లలు.
జ. వేరుశనగ
11. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.
జ. ఉల్లిపాయ
12. నల్లకుక్కకు నాలుగు చెవులు
జ. లవంగం
13. తెలిసి కాయ కాస్తుంది. తెలీకుండా పువ్వు పూస్తుంది.
జ. అత్తి చెట్టు
14. తొడిమ లేని పండు, ఆకులేని పంట.
జ. విభూది పండు, ఉప్పు
15. తన్ను తానే మింగి, మావమౌతుంది.
జ. మైనపు వత్తి
16. చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు.
జ. అద్దం
17. చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు?
జ. టెంకాయ
18. తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు పాము కాదు?
జ. రైలు
19. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది?
జ. నీడ
20. దాని పువ్వు పూజకు రాదు. దాని ఆకు దొప్పకు రాదు, దాని పండు అందరు కోరు?
జ. చింతపండు
21. తొలుతో చేస్తారు. కర్రతో చేస్తారు. అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు?
జ. మద్దెల
22. తోలు నలుపు, తింటే పులుపు.
జ. చింతపండు
23. తొలు తియ్యన, గుండు మింగన్నా?
జ. అరటి పండు
24. జానెడు ఇంట్లో, మూరెడు కర్ర?
జ. కుండలో గరిటె.
25. కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది?
జ.తాటిచెట్టు
26. కొప్పుంది కాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు?
జ. కొబ్బరి కాయ
27. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?
జ. నత్త
28. పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు?
జ. పత్తి కాయ.
29. నూరు పళ్లు, ఒకటే పెదవి.
జ. దానిమ్మ
30. సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు.
జ. సూది
31. దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు.
జ. వల
32. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.
జ. ఉంగరం
33. పొడవాటి మానుకి నీడే లేదు.
జ. దారి
34. పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు.
జ. పొయ్యి
35. ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది.
జ. అత్తిపత్తి
36. ముద్దుగా నుండును, ముక్కుపైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి.
జ. కళ్లజోడు.
37. పైడిపెట్టెలో ముత్యపు గింజ
జ. వడ్లగింజ
38. తల్లి కూర్చొండు, పిల్ల పారాడు.
జ. కడవ, చెంబు
39. పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు.
జ. మొగలిపువ్వు.
40. ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?
జ. తమలపాకు
41. అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా  ఇటుపక్క పడదు. అటు పక్క పడదు.
జ. ఆబోతు మూపురం.
42. అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి.
జ. పెదవులు
43. మనిషికి రెండే కాళ్లు, ఏడు చేతులు.
జ. నిచ్చెన
44. మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా బయటకు బయలుదేరుతుంది.
జ. గొడుగు.
45.  ఎర్రవాడొస్తే, నల్లవాడు పారిపోతాడు
జ. సూర్యుడు, చంద్రుడు.
46. బంగారు చెంబులో వెండి గచ్చకాయ
జ. పనసతొన.
47. నల్లని షర్టువాడు, కావలికి గట్టివాడు.
జ. తాళం.
48. తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది?
జ. ముళ్ల మొక్క
49. బండకు కొడితే వెండి ఊడుతుంది?
జ. కొబ్బరికాయ
50. వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ
జ. రామచిలుక.
51. పోకంత పొట్టోడు. ఇంటికి గట్టోడు.
జ. తాళం కప్ప
52. అమ్మతమ్ముడినికాను, కానీ నేను మీకు మేనమాను.
జ. చందమామ
53. అరటిపండుకి పదే విత్తులు
జ. బొగడగొట్టం
54. అడవిలో ఆంబోతు రంకే వేస్తుంది
జ. గొడ్డలి
55. అరచేతి కింద అరిసె
జ. పిడక
56. అలాము కొండకు సలాము కొట్టు
జ. గొడ్డలి
57. అమ్మంటే దగ్గరకు.. అయ్యంటే దూరంగా పోయేవి ఏమిటి?
జ. పెదవులు
58. అంక పొంకలు లేనిది.
జ. శివలింగం
59. అడవిలో అక్కమమ తల విలబోసుకుంది?
జ. ఈతచెట్టు
60. అక్క ింటిలో చెల్లి ఇంటిలోనికి వెలుగు తెస్తుంది
జ. పెద్ద పొయ్యి
61. అరచేతిలో 60 నక్షత్రాలు
జ. జల్లెడ
62. అరచేతి పట్నంలో 60 వాకిళ్లు
జ. అద్దం
63. అంకటి బంకటి కూర, తియ్యగున్నది. ఇంత పెట్టు
జ. మీగడ
64. అడ్డ గోడ మీద పూజారప్ప
జ. తేలు
65. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది.
జ. కవ్వం
66. అదిలేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు. ఏమిటి?
జ. ఆకలి
67. అనగనగనగా ఓ అప్సరస. ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక.
జ. మేనక.
💐💐💐💐💐💐💐💐💐💐💐.


*🌹మనబడి : నాడు - నేడు 🌹*

*👉చేయవలసిన పనులు* :

1. *Engineering Assistant* :

వీరు పాఠశాలను సందర్శించి అవసరమైన సాంకేతిక వివరాలను
*Input Data Sheet* లో నింపి సంతకం చేయాలి. 

*పాఠశాలలో జరిగే కమిటీ సమావేశాలకు తప్పక హాజరు కావాలి.*

*పనులు జరిగే సమయంలో పర్యవేక్షిస్తూ సూచనలివ్వాలి.*

*పనులలో నాణ్యత ఉండేలా చూసుకోవాలి.*

*ఈ కార్యక్రమంలో ప్రథమ బాధ్యత వహించాల్సివుంది.*

2. *Assistant Engineer (AE):*

*వీరు మండలంలోని ప్రతి పాఠశాలలో Engineering Assistant లు నింపిన వివరాలు పరిశీలించి, పాఠశాలను సందర్శించి input data sheet లోని వివరాలను సరిచూసుకొని సంతకం చేయాలి.*

*పనులు జరిగే సమయంలో నాణ్యతకు అవసరమైన సూచనలు ఇస్తూ ఉండాలి.*

*పనులలో నాణ్యత కు పూర్తి బాధ్యత వహించాల్సివుంది.*

3. *ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్*: 

*ఇంజినీరింగ్ వారు పూర్తిచేసిన వివరాలు సరిపోల్చుకొని input data sheet లో సంతకం చేయాలి.*

*పూర్తిచేసిన ప్రతి సమాచారంను ఒక కాపీని Xerox ను పాఠశాలలో భద్రపరచాలి.*

*మరొక ప్రతిని ఇంజినీరింగ్ వారికి ఇవ్వాలి.*

*మరొక ప్రతిని మండల విద్యాశాఖాధికారిగారికి ఇవ్వాలి.*

*కమిటీ సమావేశం జరిగే సమయంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులు, ఇంజినీరింగ్ వారు EA, AEలు పాల్గొనేలా కోఆర్డినెట్ చేసుకోవాలి.*

*పనులు జరిగే సమయంలో  పనులలో నాణ్యత ఉండేలా 7గురు కమిటీ సభ్యులతో చర్చిస్తూ ఉండాలి.*
డిసెంబర్ 26 స్వాతంత్ర్య సమరయెాధుడు "ఉద్దమ్ సింగ్" జయంతి.....


అది 1919 ఏఫ్రెల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ .....అక్కడ ఓ చిన్నతోటలో  .... రౌలత్ చట్టానికి వ్యతిరేఖంగా శాంతియుతంగా భారతీయులు సభ జరుపుకుంటున్నారు.

ఇంతలో అక్కడ ఉన్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధర్యంలో  ఏ హెచ్చరిక లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరపడం జరిగింది.  దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగ్రాతుృలైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటన గా చరిత్రలో మిగిలిపోయింది..

ఆ రోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయడానికి ఒక అనాధశరణాలయం నుండి 19 యేండ్ల కుర్రాడు వచ్చాడు.. జరిగిన దురంతం చూసి చలించిపోయాడు. నేలమీదపరుండి ప్రాణాలు కాపాడుకున్న ఆ కుర్రాడు..శవాల గుట్టలను చూసి కోపంతో వణికిపోయాడు.. కంటినిండానీరు ఉబికివస్తుండగా ఆ తోటలోని రక్తం అంటినమట్టిని తీసుకొని "ఈ దురంతానికి కారకుడైన వ్యక్తులను చంపేదాకా నేను చావను"అంటూ ప్రతిజ్ఞ చేశాడు. 

   దీనికి కారకుడైన  జనరల్ ఓ డయ్యర్ ను వెతుకుంటూ బయలు దేరాడు. తుపాకీ కాల్చుడం నేర్చుకున్నాడు. కొన్నిరోజులు భగత్ సింగ్ తో కలిసి విప్లవకార్యక్రమా లలో పాల్గొన్నాడు..

జనరల్ ఓ డయ్యర్ ను చంపేందుకు ఇంగ్లండ్ పయన మవ్వాలనుకుంటున్న సమయంలో భగత్ సింగ్ తో పాటు ఆయనను అరెష్ట్ చేశారు.తన కళ్ళముందే భగత్ సింగ్ ను ఉరితీయడం చూసి హతాసుడైనాడు..1932లో విడుదలైన తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఇంగ్లండ్ పయన మైనాడు. పేరు మార్చుకుంటూ జనరల్ ఓ డయ్యర్ ను వెంటాడ సాగాడు.. దీనికోసం చాలా కష్టాలు పడ్డాడు. ఆకలితో నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపాడు.

ఆరోజు 1940 జూలై 13....
 ఓ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరుకాబోతున్నాడు. ఆ సమాచారం  ఆయువకునికి అందింది...  వెంటనే అతను ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్  సంపా దించాడు ..  

ఒకపుస్తకంలో ఫిస్టల్ పట్టేటట్లు కాగితాలను కత్తించి అందులో  ఫిస్టల్  దాచాడు..అది చేతపట్టుకొని ఏమీ ఎరగనట్లు 
ఓ డయ్యర్ సభకు వెళ్ళాడు... 

సభ ప్రారంభమైంది.. ఓ డయ్యర్ ను వీరుడు,ధీరుడంటూ ఆంగ్లేయులు పొగిడేస్తున్నారు...

అది వింటున్న ఆ యువకుడి రక్తం సలసలా మరిగి పోసాగింది. జలియన్ వాలా బాగ్ లో అమాయకుల ఆర్తనాదాలు గుర్తుచ్చాయి..

రక్తమడుగులో గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలిడుస్తున్న అభాగ్యులు గుర్తుకొచ్చారు.. కానీ ఆధీరుడు తన ముఖంలో ఆచాయలు కనిపించనీయకుండా గంభీరంగా ఉన్నాడు...

ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది...ఆయనను అభినందించాడానికి జనాలు ఆయన దగ్గరకు వెళుతున్నారు. 

ఆ యువకుడి కూడా లేచి పుస్తకం చేతబట్టుకొని డయ్యర్ దగ్గరకు వెళుతున్నాడు...

నిశితంగా గమనిస్తున్న ఓ డయ్యర్ ఆ యువకుడి వేషధారణను చూసి ఏదో గుర్తుకొస్తున్నట్లు అనిపించి కంగారు పడుతూ  అప్రమత్తమ య్యేందుకు లేచాడు. 

అంతే ఆయువకుడు  పుస్తకంలోని పిష్టల్ మెరుపువేగంతో తీసి ,అంతే వేగంతో ఓ డయ్యర్ పై గుళ్ళ వర్షం కురిపించాడు.. భారత్ మాతాకీ జై అంటూ ధైర్యంగా అక్కడే నిలుచున్నాడు....

వేలమందిని చంపి భారతీయులు  నా బానిసలు..వారి ప్రాణాలు నేను పెట్టిన బిక్ష అంటూ జలియన్ వాలాబాగ్ కాల్పుల తర్వాత గర్వంగా అన్నాడో... ఆతను జనరల్ ఓ డయ్యర్ నేలకొరిగాడు.. ప్రాణాలు విడిచాడు. 

ఓ డయ్యర్ ను చంపిన తరువాత ఈయనను చంపడానికే నేను ఇన్నిరోజులు బతికాను.ఇంక నన్ను ఏమైనా చేసుకోండి అంటూ లొంగిపోయాడాయువకుడు...
ఇంతకీ ఆ యువకుడి పేరేమిటో తెలుసా???? 

షంషేర్ ఉద్దామ్ సింగ్ ....
ఆ విప్లవవీరుడి జయంతి నేడు.

ఉద్దమ్‌ సింగ్ పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లా లోని సునం తెహసీల్ కు చెందిన కలన్ గ్రామంలో డిసెంబరు 26,  1899   జన్మించాడు.

ఉద్దమ్ సింగ్ తన పేరును రాం మొహమ్మద్ సింగ్ ఆజాద్ గా, భారతదేశంలోని మతాలైన హిందూ, మొహమ్మదీయ, సిక్కు మతాలకు ఏకత్వాన్ని ఆపాదిస్తూ, మార్చుకున్నాడు.ఇతడి త్యాగానికీ,  దేశభక్తికీ మెచ్చుకొని ఇతడిని షహీద్-ఎ-అజం (వీరులలో అగ్రుడు) గా వ్యవహరిస్తారు.

   "జోహార్ ఉద్దాం సింగ్ ...జోహార్ "

Tuesday, 24 December 2019

*జనవిజ్ఞానవేదిక..కృష్ణాజిల్లా*
    *సూర్యగ్రహణం చూతము రారండి...*
*తేదీ*... *డిసెంబర్ 26వ తేదీ,గురువారం*
*సమయం..* ఉదయం గం. *8.14 ల నుండి గం.11.24* ల వరకు
*కొన్ని జాగ్రత్తలు తీసుకొని అందరూ(విద్యార్థులు, పెద్దలు,గర్భిణి స్త్రీలు మొ. న అందరూ) ఈ గ్రహణం ను వీక్షించవచ్చు*
*గ్రహణం ను వీక్షించేతపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు*
*1* .. *సురక్షిత సోలార్ ఫిల్టర్స్ సాయంతో మాత్రమే చూడాలి*
*2* .. *వెల్డింగ్ షాపు వారు ఉపయోగించే నెం.14 గ్లాసు సాయంతో కూడా వీక్షించ వచ్చు*
*3* .. *మసి బూసిన అద్దం,X-రే ఫిల్మ్ మొదలైన వాటితో చూడటం సురక్షితం కాదు...*
*4* ... *సోలార్ ఫిల్టర్స్ లేదా నెం.14 వెల్డింగ్ గ్లాస్ ను ముఖానికి అమర్చుకున్న తరువాత మాత్రమే సూర్యుడు వైపు చూడాలి...అదేవిధంగా తలను క్రింద కు దించిన తరువాత మాత్రమే గ్లాస్ ను తీయాలి*
*5* .. *సురక్షిత ఫిల్టర్స్ తో కూడా అదే పనిగా ఎక్కువ సేపు చూడకూడదు..5నుండి 7 సెకన్లు మాత్రమే వీక్షించి మరలా కాసేపటికి తరువాత ఇంతే సమయం లో చూడటం.... ఈ విధంగా గ్రహణం వదిలే వరకు  వీక్షించడం సురక్షితం...*
        *పై జాగ్రత్తలు పాటిస్తూ ఖాగోళం లో జరిగే అద్భుత సూర్యగ్రహణం ను వీక్షించి ఆనందించండి*
..... *జనవిజ్ఞాన వేదిక మండల కమిటీల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సురక్షిత ఫిల్టర్స్ సాయంతో గ్రహణం ను వీక్షించేందుకు జనవిజ్ఞానవేదిక  ఏర్పాట్లు చేసింది.*
   ....వివరాలకు
*యం.హరికృష్ణ..9491545653*
*ప్రధాన కార్యదర్శి*
*జనవిజ్ఞానవేదిక..కృష్ణాజిల్లా*
గ్రహణాలు - అపోహలు
********************
వ్యవహారిక భాషలో 'గ్రహణాన్ని' చెడుకు పర్యాయపదంగా వాడటం పరిపాటి. గ్రహణం పట్టింది, గ్రహణం వీడింది అనే పదాలు మన జీవితంలో కష్టసుఖాలకి అన్వయింపబడుతుంటాయి. సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాల, ఉపగ్రహాల వల్ల గ్రహణాలు ఏర్పడతాయనే విషయం అందరికి తెలిసిందే. కానీ అనాది కాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలలో గ్రహణాలపై ప్రజలలో అపోహలున్నాయి. వాటిలో కొన్ని నేటికీ కొనసాగుతున్నాయి. గ్రహణ సమయంలో వంట చేయకూడదని, తినకూడదని, ఏమీ త్రాగకూడదని, ఇలా చేస్తే చెడు ఫలితాలొస్తాయని మనదేశంలో నమ్ముతారు. అమెరికాలోని కొంతమంది గ్రహణాలు ఏర్పడటాన్ని సృష్టి వినాశనానికి సంకేతంగా భావిస్తారు. ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలలో గ్రహణం ఏర్పడమంటే సూర్యచంద్రులిద్దరూ కలిసి ఘర్షణ పడతారని నమ్ముతారు. చాలా దేశాల్లో గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలని బయటకి రావద్దని హెచ్చరిస్తారు. మరికొన్ని దేశాలలో గ్రహణాలు ఏర్పడితే భూకంపాలు వస్తాయని, తద్వారా మానవ వినాశనం జరుగుతుందని నమ్ముతారు. మన దేశంలో విస్తృతంగా ప్రచారంలో వున్న రాహు, కేతువుల కధ అందరికీ తెలిసిందే. గెలీలియో, కెప్లర్, కోపర్నికస్ వంటి ఖగోళశాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితంగా సూర్యుడు, గ్రహాల గమనంపై మనకొక అవగాహన ఏర్పడింది. చంద్రుని నీడ భూమిపై పడటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజు మాత్రమే జరుగుతుంది. సూర్యగ్రహణాలలో సంపూర్ణ, పాక్షిక, వలయాకార, మిశ్రమ సూర్యగ్రహణాలుంటాయి. భూమి యొక్క నీడ చంద్రునిపై పడినపుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి రోజున మాత్రమే సంభవిస్తుంది.  సూర్యగ్రహణం ఏర్పడటం వలన పగటి వేళ కొద్ది సేపు రాత్రిని తలపిస్తుంది, అంతరిక్షంపై మనిషికి అవగాహన లేని రోజుల్లో ప్రజలు గ్రహణ సమయములో భయభ్రాంతులకు గురయ్యేవారు. ఆ రోజుల్లో టోలమీ ప్రతిపాదించిన 'భూకేంద్రక సిద్ధాంతం' ప్రాచుర్యంలో ఉండేది. తర్వాత కోపర్నికస్ ప్రతిపాదించిన 'సూర్య కేంద్రక సిద్ధాంతం' శాస్త్రీయంగా నిరూపించబడింది. ఈ సిద్ధాంతాన్ని సమర్ధించినందుకు గియనార్డో బ్రూనో వంటి శాస్త్రవేత్తలను ఆనాటి మతాధిపతులు హతమార్చారు. ప్రాచీన, మధ్య యుగాల్లో చలామణిలో వున్న మూఢవిశ్వాసాలని కరపత్రాల ద్వారా కంప్యూటర్ కాలంలో కూడా ప్రచారం చేసి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. గ్రహణాలని ఎవరైనా చూడవచ్చు. గ్రహణం మొర్రికి గ్రహణాలకు ఎటువంటి సంబంధం ఉండదు. అయితే నేరుగా కంటితో గ్రహణాలు చూడకూడదు. నాణ్యమైన సోలార్ ఫిల్టర్స్ ద్వారా గ్రహణాన్ని చూడవచ్చు. ఇప్పటికే జనవిజ్ఞాన వేదిక వంటి సైన్స్ ప్రచార సంస్థలు గ్రహణాలపై విద్యార్ధులకు అవగాహన కల్పిస్తున్నాయి. పాఠశాలల్లో సైన్స్ ఉపాధ్యాయులు కూడా విద్యార్ధులకు ఇటువంటి విషయాలపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారిలో శాస్త్రీయ ఆలోచనలు పెరుగుతాయి.
యం.రాంప్రదీప్,
జనవిజ్ఞాన వేదిక,
తిరువూరు
సెల్ నెం . 9492712836

*💁పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి 4 మార్గాలు*

*💁పాన్ కార్డుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడానికి 4 మార్గాలు*



*🌈1. SMS:*
                                                                                                                                                                      *❇మీ ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో ఆన్‌లైన్‌లో లింక్ చేయొచ్చు. ఇందుకోసం మీరు 567678 లేదా 56161 నెంబర్లకు కింద సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాలి.*
                                                                                                      *UIDPAN<12><10>*
*ఉదాహరణ: UIDPAN 111122223333 AAAPA9999Q*

*🌈2. Online:*
                                                                                                                                                              *❇incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో పాన్-ఆధార్ నెంబర్లు లింక్ చేయొచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 'Linking Aadhaar' లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. కొత్త పేజీలో ఆధార్‌కార్డుపై ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'Link Aadhaar' పైన క్లిక్ చేస్తే మీ పాన్‌ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.*
                                                                                                                                                                                *🌈3. Income Tax Returns (ITR):*

*❇మీరు ఇ-ఫైలింగ్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కూడా మీ పాన్-ఆధార్ లింక్ చేసే అవకాశం కల్పిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. NSDL (tin-nsdl.com), UTIITSL (utiitsl.com) వెబ్‌‌సైట్లల్లో ఐటీఆర్ ఫైలింగ్ చేసేప్పుడు పాన్-ఆధార్ లింక్ చేయాలి.*
                                                                                                                                                                                                           *🌈4. PAN Card Application:*
                                                                                                                                                  *❇ఇక కొత్తగా పాన్ కార్డు తీసుకునేవాళ్లు, పాన్ కార్డులో మార్పులు చేయించేవాళ్లు దరఖాస్తులోనే ఆధార్ నెంబర్ నిస్తే సరిపోతుంది.*
🌹పి.ఆర్.టి.యు.సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్, కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షులు శ్రీ డి .శ్రీను గారు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ పెరుమాళ్లు గార్ల ఆధ్వర్యంలో  ఉపాధ్యాయ సమస్యల సాధనే కాకుండా  పిఆర్టియు సేవాదళ్ పక్షాన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే.🌹🙏
🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
 వాటిలో భాగమే
నిరుపేద విద్యార్థులకు పిఆర్టియు స్కాలర్షిప్ పంపిణీ,
 వరద బాధిత ప్రాంతాల ప్రజలకు విద్యార్థులకు పిఆర్టియు  సహాయం,
 గూడు లేక చలికి గజగజ వణుకుతూ ప్లాట్ఫాంపై నిద్రిస్తున్న అభాగ్యులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం.... ఇంకా ఎన్నో ఎన్నెన్నో.....
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
అదే ఒరవడిలో భాగంగా గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి *సింగిల్ యూస్ ప్లాస్టిక్ నివారణ* గౌరవనీయ కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ A MD ఇంతియాజ్ గారి *సే నో టు ప్లాస్టిక్* నినాదాలు స్ఫూర్తితో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్ధాలు వాటిని త్యజించాల్సిన ఆవశ్యకతపై *అవగాహన కార్యక్రమం 29.12.19వ తేదీ ఆదివారం నాడు  ఉదయం 10 గంటలకు హోటల్ ఐలాపురం, విజయవాడ నందు ఏర్పాటు చేయడం జరిగింది*.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారు.  తదుపరి కృష్ణాజిల్లా విద్యారంగాన్ని తనదైన శైలిలో ముందుకు తీసుకువెళుతూ అనేక అవార్డులు పొందిన  జిల్లా విద్యాశాఖ అధికారిని శ్రీమతి ఎం వి రాజ్యలక్ష్మి గారికి అభినందన కార్యక్రమం జరుగుతుంది.👏
 *🙏భోజనానంతరం కృష్ణా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుంది.🙏*
కాబట్టి సంఘ బాధ్యులు అందరూ ఈ సమావేశానికి తప్పక హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.👏
*మీ...అక్బర్ పాష, పి.ఆర్.టి.యు.,ఆంధ్రప్రదేశ్.*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

PRTU KALIDINDI TEACHERS INFO

AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD -CFMS SITE

 AP EMPLOYEES PAY SLIPS DOWNLOAD ఇప్పుడు PAY SLIPS DOWNLOAD చేసుకోవడం చాలా సులభం. EMPLOYEE ID (7 digit)అవసరం. Registered mobile number ki OT...